పేద‌ల ఆత్మ‌బంధువులా..  

 నియోజ‌వ‌ర్గంలో పేద‌ల అవ‌స‌రాలు తీరుస్తున్న‌..

జానేశ్వ‌ర ఫౌండేష‌న్ అధినేత షేక్ జాన్‌సైదా

చిల‌క‌లూరిపేట‌: 


ఆకలి కష్టపడటాన్ని అలవాటు చేస్తుంది. ఆలోచన బతకడాన్ని నేర్పిస్తుంది. లక్ష్యం జీవితాన్ని విజయ పథాన నడిపిస్తుంది. 

బ‌త‌క‌ట‌మంటే జీవ‌మున్న జీవిగా బ‌త‌క‌టం కాదు. మ‌న బ‌తుకు మ‌రోక‌రికి భ‌రోసా ఇవ్వాలి. ఇదే విష‌యాన్ని త్రిక‌ర‌ణ శుద్దిగా న‌మ్మిన వ్య‌క్తి షేక్ జాన్‌సైదా. చిన్న‌త‌నంలో తాను అనుభవించిన క‌ష్టాలు.. క‌డ‌గండ్లు, పేద‌ల ఆక‌లి బాధ‌, అనారోగ్యం పాలై ఆసుప‌త్రుల‌కు వెళ్లే స్థోమ‌త లేక రోగాల‌తో స‌త‌మ‌త‌మ‌య్యే వారి క‌న్నీళ్లు నిత్యం వెంటాడేవి. వారి కోసం.. తాను పుట్టిన గ‌డ్డ‌కోసం ఏదో చేయాల‌న్న ల‌క్ష్య‌మే నేటి జాన్‌సైదా సేవా కార్య‌క్ర‌మాల‌కు ప్రారంభానికి అంకురార్ప‌ణ జ‌రిగింది. 

పేద విద్యార్ధుల‌కు పెద‌న్న‌గా జాన్‌సైదా... 

ఒక‌వైపు షూ,ట‌క్‌,బూటుల‌తో కార్పోరేట్ స్కూళ్ల‌కు వెళ్లే పిల్ల‌లు. మ‌రోవైపు జానుడు పొట్ట నింపుకోవ‌టానికి ఎర్ర‌టి ఎండ‌లో పొలంలో,ఇటిక బ‌ట్టిల్లో, ప‌గ‌లు రేయి క‌ష్ట‌ప‌డుతున్న చిన్నారులు. ఎందుకీ తార‌మ‌య్యం. చిన్న‌త‌నంలో జాన్‌సైదాకు ఎదురైన ప్ర‌శ్న ఇది. వీరికి ఏదో చేయాలన్నాఅప్ప‌ట్లో త‌న‌ది అటొ ఇటుగా ఇదే ప‌రిస్థితి. ఈ ప్ర‌శ్న త‌న‌తో పాటే ఎదుగుతూ వ‌చ్చింది. 



అనుభూతి , స్పందించే గుణం ఉండాలే గాని ప్ర‌తి మ‌నిషి మ‌హ‌నీయుడే. పేద‌రికం విద్య‌కు అడ్డుకూద‌డ‌ని జాన్‌సైదా బ‌లంగా నమ్ముతారు. విద్య‌కు మించిన ఆస్తి లేద‌ని, కుటుంబంలో ఓ ఒక్క‌రు ఉన్న‌త విద్యావంతులైతే ఆ కుటుంబ స్థితి గ‌తులే మార్చివేస్తాయ‌న్న‌ది జాన్ సైదా అంచ‌నా. అత‌ని అంచ‌నా త‌ప్ప‌లేదు. తాను క‌ష్ట‌ప‌డి చ‌దువుకున్నాడు. మంచి ఉద్యోగం, హోదా ల‌భించాక విద్య‌కు దూర‌మ‌య్యేవారికి అనేక మందికి చేయూత అందించాడు. అనేక గుప్త‌దానాలు చేశాడు. కాని ఉద్యోగం లో ఉంటే ఈ స‌హ‌కారం కొంత‌మందికే. అదే తానే కంపెనీ అధినేత అయితే ఈ స‌హ‌కారం మ‌రింత విస్త‌రించ‌వ‌చ్చ‌ని త‌లంచాడు. ఒక్క‌సారి చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు.  అప్ప‌టికి జాన్‌సైదా వ‌ద్ద ఉన్న‌ది కేవ‌లం రూ. ల‌క్ష‌లు మాత్ర‌మే. అదే ఐదు ల‌క్ష‌ల‌తో తానే స్వ‌యంగా స్టార్టప్ కంపెనీని ప్రారంభించాడు. ఎన్నో ఒడిడొడుకులు,కుంగ‌దీత‌లు,  నిల‌బ‌డ్డాడు. నేడు ఎంతో మంది విద్యార్ధుల‌ను జీవితంలో నిల‌దొక్కుకొనేలా చేశాడు.. చ‌దువు జీవితాన్ని మారుస్తుంద‌న‌టానికి తాన జీవిత‌మే ఉదాహ‌ర‌ణ‌గా చెబుతాడు. ఏ ప్ర‌తిభ ఉన్నా అటువంటి వారికి జాన్ సైదా జ్ఞానేశ్వ‌ర్ ఫౌండేష‌న్ ద్వారా  చేయూత అందిస్తున్నాడు. నియోజ‌క‌వ‌ర్గంలో వేలాది మంది పేద విద్యార్ధుల‌కు పెద‌న్న‌గా నిలిచాడు. త‌న స్థాపించిన ప‌రిశ్ర‌మ‌ల ద్వారా వేలాది మంది యువ‌త ఉపాధి పొందుతున్నారు. 

పేద‌ల ఇంటి ముందుకే వైద్య శిబిరాల.. 



పేద‌వారికి ఏదైనా అనుకొని జ‌బ్బు వ‌స్తే బ‌తుకు దుర్బ‌ర‌మౌతుంది. అదే కుటుంబ పెద్ద అనుకొని ప‌రిస్థితుల్లో మంచాన ప‌డితే వారి వేద‌న మ‌రింత తీవ్ర‌మౌతుంది. ఒక వైపు ఉపాధిక‌రువై వైద్యానికి డ‌బ్బులు లేక ప‌డే ఇబ్బందులు   చిన్న‌త‌నం నుంచి ఎంతో మంది పేద‌ల జీవితాల‌ను ద‌గ్గ‌ర‌గా చూసిన జాన్‌సైదా ఆరోగ్యానికి ఎంతో ప్ర‌ధాన్య‌త ఇస్తాడు. తాను చేసే స‌హాయంలో అత్య‌ధిక శాతం పేద‌ల ఆరోగ్యానికే  అందేలా ప్రణాళికలు సిద్దం చేసుకుంటాడు. ఇందులో భాగంగానే నియోజ‌క‌వ‌ర్గంలో అనేక ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఉచితంగా మందులు, బోజ‌న వ‌స‌తులు క‌ల్పిస్తున్నారు. ఉపాధి పోతుంద‌ని ఆరోగ్య ప‌రీక్ష‌లు కూడా చేయించుకోకుండా బ‌య‌ట‌కు రాని గ్రామీణ పేద‌ల కోసం వారి గ్రామంలో వారి చెంత‌కు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయిస్తున్నారు. జ‌బ్బు బారిన ప‌డి చికిత్స పొందుతున్న వేలాది మందికి జ్ఞానేశ్వ‌ర ఫౌండేష‌న్ ఒక వ‌రంగా మారింది. ఈ ఫౌండేష‌న్ ద్వారా నియోజ‌వ‌ర్గంలో వేలాది మందికి జాన్‌సైదా స‌హాయం అందించారు. 

.నిగర్వం, నిరాడంబరతో పేద‌ల మ‌న‌సులు గెలుస్తూ. 

చిన్నపిల్ల‌వాడు మొద‌లు.. పేద్ద‌వారు, పేద‌వారు  వ‌ర‌కు నేరుగా జాన్‌సైదాతో క‌లిసిపోతారు. నొప్పించ‌కుండా మాట్లాడ‌డం, వారికి కావాల్సిన స‌హాయాన్ని అందించటం, వారి క‌ళ్ల‌లో ఆనందం చూడ‌టం జాన్‌సైదా స‌హ‌జ నైజం. ఎవరి జీవితం వారికే ఒత్తిడి, భారమైన ఈ రోజుల్లో సాటి వారి పట్ల  సేవా గుణాన్ని, వారిని ఆదుకునేందుకు ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఆర్థికంగా, నైతికంగా, మానసికంగా ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తూ భరోసా అందించ‌టానికి జాన్‌సైదా ముందంజ‌లో ఉంటారు.చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఎవ‌రికీ ఏ క‌ష్టం వాటిల్లినా, ఎవ‌రికి ఏ ఇబ్బందులు ఎదురైనా జాన్‌సైదా నేనున్నానంటూ వారికి భ‌రోసా క‌ల్పిస్తున్నారు.

------------------------

Axact

చిలకలూరిపేట న్యూస్

నిజం.. నిష్పక్షపాతం మా నైజం నిగ్గు తేల్చే నిజాల కోసం.. నిక్కచ్చైన విశ్లేషణల కోసం

Post A Comment:

0 comments: