TRENDING NOW

chilkaluripet news, Latest News, Breaking News, Live News News Headlines

 వేలం వెర్రిగా మారిన‌  పార్టీల్లో చేరిక‌లు 

ఫార్టీ ఫిరాయింపు దారుల‌కు ఎన్నిక‌ల పండుగ 

చిల‌క‌లూరిపేట‌న్యూస్‌: 
ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌కు వ‌స్తోంది. అధికార వైఎస్సార్ సీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ-జ‌న‌సేన కూట‌మిల మ‌ధ్య వార్ మొద‌లైంది. ఇందుకు త‌గ్గ‌ట్లుగానే చిల‌క‌లూరిపేట‌లోనూ పూర్తిగా ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వ‌చ్చేసింది. ఐదేళ్ల‌కు ఒక‌సారి వ‌చ్చే ఎన్నిక‌లంటే కొంద‌రికి పండుగ‌.  ఎన్నిక‌లు ముగిసేవ‌ర‌కు ఆయా పార్టీల్లో ఉండే కొంత‌మందికి నిత్య‌క‌ళ్యాణం ప‌చ్చ‌తోర‌ణ‌మే. ఫ‌ల‌నా పార్టీ నుంచి ఇంత మంది జాయిన్ అయితే, మ‌రుస‌టి రోజు.. అంత స‌మ‌యం కూడా ఉండ‌టం లేదు. సాయంత్రానికే త‌మ పార్టీలో అంత మంది జాయిన్ కావాల్సిందే. ఇందుకు ఈ నాయ‌కులు ప‌నికివ‌స్తారు. ఇటువంటి  నాయ‌కుల‌కు పార్టీలలో  ప్ర‌త్యేక‌మైన గుర్తింపు కూడా ఉంటుంది. వీరితో పాటు జంప్ జిలానిల‌కు ఎన్నిక‌ల అయిపోయేవ‌ర‌కు పండుగే మ‌రి. 
లెక్క స‌రిపోయిందా...? 
లెక్క స‌రిపోవాలి.. లేదా ప్ర‌త్య‌ర్ధి పార్టీ కంటే ఎక్కువ‌గా ఉంటే మ‌రి మంచిది. కండువాలు క‌ప్పుకొనేవారికి .. అంటే పార్టీలు మారేవారికి ప్ర‌త్యేక స‌దుపాయాలు కూడా ఉంటాయి. అప్ప‌టి వ‌ర‌కు అనామ‌కులుగా ఉన్న వారు నాయ‌కులుగా మారిపోతారు. హామీలు  ఉంటాయి. అయితే గ‌తంలో మాదిరి హామీలు న‌మ్మ‌క‌పోవ‌డం వ‌ల్ల అప్ప‌టిక‌ప్పుడు ఫ‌లానా పార్టీ నుంచి 20 కుటుంబాలు ప‌త్య‌ర్ధి పార్టీలో చేరార‌ని స‌మాచారం రావ‌టం ఆల‌శ్యం వెంట‌నే లెక్క స‌రిచేసుకోవాల‌న్నఆత్రం ప్ర‌త్య‌ర్ధిలో మొద‌లౌతుంది. అంతే వెంట‌నే ప్ర‌త్య‌ర్ది వారు వెంట‌నే త‌మ పార్టీలో 22 కుటుంబాలు చేరాయ‌ని, త‌మ పార్టీ  కండువాలు  వేసి హ‌మ‌య్య అనుకుంటారు. అయ‌తే ఇలా ఆయా పార్టీల‌లో చేరుతున్న వారిలో కొంత‌మంది  సొంత‌పార్టీ మ‌నుషులే కావ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తుంది. రాను ఇదో త‌ర‌హ వేలం వెర్రి ప్ర‌క్రియ‌గా మారిపోవ‌డంతో ఎవ‌రు ఏ పార్టీలో చేరినా, పార్టీలు మారినా ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవడం మాని వేశారు. అయినా పార్టీని బ‌లోపేతం చేయ‌డం అంటే ఇలానా అని ఆయా పార్టీల సీనియ‌ర్లు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. 
-------------------



chilkaluripet news, Latest News, Breaking News, Live News News Headlines


 

  •  ఆపద సమయాల్లో అభాగ్యులకు ఆపన్నహస్తం
  •  

  • -కష్టాలు తెలుసుకొని మరీ స్పందించే గుణం

  • -ఎక్కడున్నా.. సమస్య ఏదైనా వెంటనే పరిష్కారం
  • -వేలాది మందికి సాయం
  • - పేదల హృదయాల్లో చెరగని ముద్ర
  • నేడు వైఎస్సార్ సీపీ నియోజ‌క‌వ‌ర్గ ర‌ధ సారధిగా మ‌రో ముండ‌డుగు 

చిల‌క‌లూరిపేట‌: 

 నువ్వు జనంలో కలిసిపోవాలి, నిత్య పోరాటమయంగా నీ జీవితాన్ని మలుచుకోవాలి, అనునిత్యం ఆదర్శప్రాయమైన జీవితాన్ని సాగించాలి.... ఇది నాయ‌కుంటే ఎలా ఉండాల‌నే అంశంపై క‌మ్యూనిస్టు యోధుడు పుచ్చ‌ల‌ప‌ల్లి సుంద‌ర‌య్య చెప్పిన మాట‌లు. క‌మ్యూనిస్టు నేప‌థ్యం ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చి, అంచెలంచెలుగా ఎదిగిన నేటి వైఎస్సార్ సీపీ చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన మ‌ల్లెల రాజేష్‌నాయుడుకు అచ్చంగా అన్వ‌యించుకోవ‌చ్చు. మార్పుకు సంకేతంగా నిలిచే చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్ సీపీ ర‌ధ సార‌ధిగా నూత‌నంగా నియ‌మితులైన మ‌ల్లెల రాజేష్ నాయుడు  ప్రాంతానికి సుప‌రిచితుడే. తాత మ‌ల్లెల బుచ్చ‌య్య నుంచి అల‌వ‌డిన పోరాట‌ప‌టిమ‌. తండ్రి మ‌ల్లెల స‌త్య‌నారాయ‌ణ నుంచి అల‌వ‌డిన దాన‌గుణం, పేద‌ల ప‌ట్ల అపార‌మైన ప్రేమను పునికి పుచ్చికున్న రాజేష్‌నాయుడు రానున్న ఎన్నిక‌ల్లో వైఎస్సార్ సీపీ  త‌రుఫున బ‌రిలో నిల‌వ‌నున్నారు. 

చ‌దువే పెట్టుబ‌డి... 

ఇతనెవ‌రు..?  మీ బాబా ?

 ప‌ది సంవత్స‌రాలు కూడా నిండ‌ని చిన్నారి చూసి అత‌ని తండ్రిని ప్ర‌శ్నించాడు రాజేష్‌నాయుడు. 

అవున‌య్యా.. మీతో చెప్పి ప‌నిలో పెద‌డామ‌ని తెచ్చాయ‌న్నా ..కొడుకు ద‌గ్గ‌ర‌కు తీసుకుంటూ చెప్ప‌డ‌త‌ను. 

చ‌దువు చెప్పించ‌టం లేదా..సంశంతో ఆగాడు

లేద‌య్య‌.. మాలాంటి వాళ్ల‌కు చ‌దువు చెప్పించ‌టం క‌ష్ట‌మ‌య్యా.. వీడు కూడా ఏదైనా ప‌నిచేసి ప‌దో ప‌ర‌కో సంపాదిస్తే ..ఆసరా ఉంటుంద‌ని.. ఆగాడు. 

ఆ చిన్నారిని ద‌గ్గ‌ర‌కు పిలిచాడు రాజేష్ నాయుడు ,.. చ‌దువుకుంటావా.. నేను చ‌దివిస్తా...పుస్త‌కాలు, బ‌ట్ట‌లు కూడా కొని ఇస్తా .. అభ‌య‌మిచ్చాడు. 

తండ్రి ఏం చెబుతోడో అని భ‌య,భ‌యంగా చూసాడు. నేనున్నాంటూ భ‌జం త‌ట్టాడు.  ఈ పంఘ‌ట‌న ఆ చిన్నారి జీవితంలో కొత్త వెలుగులు నింపింది. చ‌దువు ప్రాముఖ్య‌త తెలిసిన రాజేష్ నాయుడు త‌న వ‌ద్ద ప‌నిచేసే ప్ర‌తి ఒక్క‌రి పిల్ల‌లు చ‌దువుకోవాల‌ని ఆకాంక్షిస్తాడు. ఇలా మొద‌లైన మ‌ల్లెల రాజేష్ నాయుడి విద్యాసేవా ప్ర‌స్థానం వేలాది మందికి చేయూత‌నందిస్తుంది. చ‌దువే పెద్ద పెట్టుబ‌డిని, జీవితంలో ప్ర‌తి ఒక్క‌రూ చ‌దువుకోవాల‌ని ఆయ‌న త‌ప‌న‌.ఆర్థిక ఇబ్బందులతో  పేద విద్యార్థులు మధ్యలోనే చదువులు మానేసి కూలీలుగా మారుతున్నరన్న విషయం గ్రహించి  అందరికి నాణ్యమైన విద్యను అందించేందుకు న‌డుం బిగించాడు. 

ఎంఆర్ ఫౌండేష‌న్ ద్వారా సేవా ప్ర‌స్థానం.. 

సాయం.. చదివితే రెండు అక్షరాలే కావొచ్చు. కానీ అందిస్తే.. దాని విలువ జీవితాంతం. అందుకే కష్టాల్లో ఉన్నవారికి బాసటగా నిలిచిన వారు దేవుళ్లుగా కనిపిస్తారు. సాయం చేసే తత్వం అతి కొద్ది మందికే సాధ్యం. ఎదుటి వ్యక్తుల బాధను తమ కష్టంగా భావించే గొప్ప మనసు కావాలి. ఉన్నదాంట్లో కొంత అందించి అండగా నిలిచే హృదయం ఉండాలి. అలాంటి కోవకే చెందిన వ్య‌క్తే రాజేష్‌నాయుడు. ఎంఆర్ ఫౌండేష‌న్ ద్వారా ప్రజల కష్టాలు, కన్నీళ్లలో తోడుగా.. ఆపదొస్తే అండగా ఉంటున్నారు రాజేష్ నాయుడు. విద్యా, వైద్యం, ఆర్థిక ఇబ్బందులు,  కష్టాలు ఇలా సమస్య ఏదైనా, తెలియగానే స్పందిస్తున్నారు. తనకు నేరుగా విన్నవించినా.. లేదా సోషల్ మీడియాద్వారా చేరవేసినా వెంటనే భరోసా ఇస్తున్నారు. అత్యవసరసమయాల్లో ఆపద్బాంధవుడిలా ఆదుకుంటున్నారు.  వేలాది మంది అభాగ్యులకు తన సహాయాన్ని అందించి జనం గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తున్నారు. వారందరి దీవెనలతో మరింత ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు. ఎన్నో గుప్త దానాలు చేసిన మ‌ల్లెల ఆధ్యాత్మిక సేవ‌లోనూ ముందంజ‌లో ఉన్నారు. అనేక శిధిల‌మైన దేవాల‌యాల పున‌రుద్ద‌ర‌ణ, వినాయ‌క చ‌వితి , ద‌స‌రా త‌దిత‌ర పండుగ‌ల ఉత్స‌వాల‌కు ఇతేధికంగా స‌హాయం అందించేవారు. ప్ర‌స్తుతం త‌న‌కు ల‌భించిన వైఎస్సార్ సీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త ప‌ద‌వి కూడా పేద‌ల‌కు మరింత సేవ చేసే ప‌ద‌విగా భావిస్తున్నారు.

కుటుంబ నేప‌థ్యం ...

మ‌ల్లెల రాజేష్ కుటుంబం యావ‌త్తు ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌టంలో ముందున్నారు.  రాజేష్‌నాయుడు  తాత మల్లెల బుచ్చయ్య  చిలకలూరిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ గా, కొమరవల్లిపాడు వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడిగా కొన‌సాగారు. తండ్రి మల్లెల సత్యనారాయణ మున్సిపల్ కౌన్సిలర్ గా , కాపు సంఘం నాయకుడిగా, మ‌ల్లెల బుచ్చ‌య్య చారిట‌బుల్ ట్ర‌స్ట్ నిర్వాహ‌కుడిగా కొన‌సాగారు.  వీరిది ముందు  రాజ‌కీయ కుటుంబం. మల్లెల రాజేష్ నాయుడు  తండ్రి మరణానంతరం ఆయ‌న సేవా కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగిస్తూ ప్రస్తుతం ఏపీఎస్ఐడీసీ డైరెక్టర్ గా కొన‌సాగుతున్నారు. గ‌తం నుంచి వీరి కుటుంబం యావ‌త్తు పేద‌ల ప‌క్ష‌పాతిగా ఉంది. దీంతో వీరికి ప్ర‌జాబ‌లం కూడా ఎక్కువే.  రాజేష్ నాయుడు అడుగు పెట్టిన ప్ర‌తి చోట జ‌న‌సందోహం క‌ట్ట‌లు తెంచుకుంటుంది.ఇంత‌టి ప్ర‌జా ఆద‌ర‌ణ క‌లిగిన నాయ‌కుడిని వైఎస్సార్ సీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య క‌ర్త‌గా ఎంపిక చేయ‌డం స‌ముచిత నిర్ణ‌య‌మ‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. 

chilkaluripet news, Latest News, Breaking News, Live News News Headlines

 పేద‌ల ఆత్మ‌బంధువులా..  

 నియోజ‌వ‌ర్గంలో పేద‌ల అవ‌స‌రాలు తీరుస్తున్న‌..

జానేశ్వ‌ర ఫౌండేష‌న్ అధినేత షేక్ జాన్‌సైదా

చిల‌క‌లూరిపేట‌: 


ఆకలి కష్టపడటాన్ని అలవాటు చేస్తుంది. ఆలోచన బతకడాన్ని నేర్పిస్తుంది. లక్ష్యం జీవితాన్ని విజయ పథాన నడిపిస్తుంది. 

బ‌త‌క‌ట‌మంటే జీవ‌మున్న జీవిగా బ‌త‌క‌టం కాదు. మ‌న బ‌తుకు మ‌రోక‌రికి భ‌రోసా ఇవ్వాలి. ఇదే విష‌యాన్ని త్రిక‌ర‌ణ శుద్దిగా న‌మ్మిన వ్య‌క్తి షేక్ జాన్‌సైదా. చిన్న‌త‌నంలో తాను అనుభవించిన క‌ష్టాలు.. క‌డ‌గండ్లు, పేద‌ల ఆక‌లి బాధ‌, అనారోగ్యం పాలై ఆసుప‌త్రుల‌కు వెళ్లే స్థోమ‌త లేక రోగాల‌తో స‌త‌మ‌త‌మ‌య్యే వారి క‌న్నీళ్లు నిత్యం వెంటాడేవి. వారి కోసం.. తాను పుట్టిన గ‌డ్డ‌కోసం ఏదో చేయాల‌న్న ల‌క్ష్య‌మే నేటి జాన్‌సైదా సేవా కార్య‌క్ర‌మాల‌కు ప్రారంభానికి అంకురార్ప‌ణ జ‌రిగింది. 

పేద విద్యార్ధుల‌కు పెద‌న్న‌గా జాన్‌సైదా... 

ఒక‌వైపు షూ,ట‌క్‌,బూటుల‌తో కార్పోరేట్ స్కూళ్ల‌కు వెళ్లే పిల్ల‌లు. మ‌రోవైపు జానుడు పొట్ట నింపుకోవ‌టానికి ఎర్ర‌టి ఎండ‌లో పొలంలో,ఇటిక బ‌ట్టిల్లో, ప‌గ‌లు రేయి క‌ష్ట‌ప‌డుతున్న చిన్నారులు. ఎందుకీ తార‌మ‌య్యం. చిన్న‌త‌నంలో జాన్‌సైదాకు ఎదురైన ప్ర‌శ్న ఇది. వీరికి ఏదో చేయాలన్నాఅప్ప‌ట్లో త‌న‌ది అటొ ఇటుగా ఇదే ప‌రిస్థితి. ఈ ప్ర‌శ్న త‌న‌తో పాటే ఎదుగుతూ వ‌చ్చింది. 



అనుభూతి , స్పందించే గుణం ఉండాలే గాని ప్ర‌తి మ‌నిషి మ‌హ‌నీయుడే. పేద‌రికం విద్య‌కు అడ్డుకూద‌డ‌ని జాన్‌సైదా బ‌లంగా నమ్ముతారు. విద్య‌కు మించిన ఆస్తి లేద‌ని, కుటుంబంలో ఓ ఒక్క‌రు ఉన్న‌త విద్యావంతులైతే ఆ కుటుంబ స్థితి గ‌తులే మార్చివేస్తాయ‌న్న‌ది జాన్ సైదా అంచ‌నా. అత‌ని అంచ‌నా త‌ప్ప‌లేదు. తాను క‌ష్ట‌ప‌డి చ‌దువుకున్నాడు. మంచి ఉద్యోగం, హోదా ల‌భించాక విద్య‌కు దూర‌మ‌య్యేవారికి అనేక మందికి చేయూత అందించాడు. అనేక గుప్త‌దానాలు చేశాడు. కాని ఉద్యోగం లో ఉంటే ఈ స‌హ‌కారం కొంత‌మందికే. అదే తానే కంపెనీ అధినేత అయితే ఈ స‌హ‌కారం మ‌రింత విస్త‌రించ‌వ‌చ్చ‌ని త‌లంచాడు. ఒక్క‌సారి చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు.  అప్ప‌టికి జాన్‌సైదా వ‌ద్ద ఉన్న‌ది కేవ‌లం రూ. ల‌క్ష‌లు మాత్ర‌మే. అదే ఐదు ల‌క్ష‌ల‌తో తానే స్వ‌యంగా స్టార్టప్ కంపెనీని ప్రారంభించాడు. ఎన్నో ఒడిడొడుకులు,కుంగ‌దీత‌లు,  నిల‌బ‌డ్డాడు. నేడు ఎంతో మంది విద్యార్ధుల‌ను జీవితంలో నిల‌దొక్కుకొనేలా చేశాడు.. చ‌దువు జీవితాన్ని మారుస్తుంద‌న‌టానికి తాన జీవిత‌మే ఉదాహ‌ర‌ణ‌గా చెబుతాడు. ఏ ప్ర‌తిభ ఉన్నా అటువంటి వారికి జాన్ సైదా జ్ఞానేశ్వ‌ర్ ఫౌండేష‌న్ ద్వారా  చేయూత అందిస్తున్నాడు. నియోజ‌క‌వ‌ర్గంలో వేలాది మంది పేద విద్యార్ధుల‌కు పెద‌న్న‌గా నిలిచాడు. త‌న స్థాపించిన ప‌రిశ్ర‌మ‌ల ద్వారా వేలాది మంది యువ‌త ఉపాధి పొందుతున్నారు. 

పేద‌ల ఇంటి ముందుకే వైద్య శిబిరాల.. 



పేద‌వారికి ఏదైనా అనుకొని జ‌బ్బు వ‌స్తే బ‌తుకు దుర్బ‌ర‌మౌతుంది. అదే కుటుంబ పెద్ద అనుకొని ప‌రిస్థితుల్లో మంచాన ప‌డితే వారి వేద‌న మ‌రింత తీవ్ర‌మౌతుంది. ఒక వైపు ఉపాధిక‌రువై వైద్యానికి డ‌బ్బులు లేక ప‌డే ఇబ్బందులు   చిన్న‌త‌నం నుంచి ఎంతో మంది పేద‌ల జీవితాల‌ను ద‌గ్గ‌ర‌గా చూసిన జాన్‌సైదా ఆరోగ్యానికి ఎంతో ప్ర‌ధాన్య‌త ఇస్తాడు. తాను చేసే స‌హాయంలో అత్య‌ధిక శాతం పేద‌ల ఆరోగ్యానికే  అందేలా ప్రణాళికలు సిద్దం చేసుకుంటాడు. ఇందులో భాగంగానే నియోజ‌క‌వ‌ర్గంలో అనేక ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఉచితంగా మందులు, బోజ‌న వ‌స‌తులు క‌ల్పిస్తున్నారు. ఉపాధి పోతుంద‌ని ఆరోగ్య ప‌రీక్ష‌లు కూడా చేయించుకోకుండా బ‌య‌ట‌కు రాని గ్రామీణ పేద‌ల కోసం వారి గ్రామంలో వారి చెంత‌కు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయిస్తున్నారు. జ‌బ్బు బారిన ప‌డి చికిత్స పొందుతున్న వేలాది మందికి జ్ఞానేశ్వ‌ర ఫౌండేష‌న్ ఒక వ‌రంగా మారింది. ఈ ఫౌండేష‌న్ ద్వారా నియోజ‌వ‌ర్గంలో వేలాది మందికి జాన్‌సైదా స‌హాయం అందించారు. 

.నిగర్వం, నిరాడంబరతో పేద‌ల మ‌న‌సులు గెలుస్తూ. 

చిన్నపిల్ల‌వాడు మొద‌లు.. పేద్ద‌వారు, పేద‌వారు  వ‌ర‌కు నేరుగా జాన్‌సైదాతో క‌లిసిపోతారు. నొప్పించ‌కుండా మాట్లాడ‌డం, వారికి కావాల్సిన స‌హాయాన్ని అందించటం, వారి క‌ళ్ల‌లో ఆనందం చూడ‌టం జాన్‌సైదా స‌హ‌జ నైజం. ఎవరి జీవితం వారికే ఒత్తిడి, భారమైన ఈ రోజుల్లో సాటి వారి పట్ల  సేవా గుణాన్ని, వారిని ఆదుకునేందుకు ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఆర్థికంగా, నైతికంగా, మానసికంగా ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తూ భరోసా అందించ‌టానికి జాన్‌సైదా ముందంజ‌లో ఉంటారు.చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఎవ‌రికీ ఏ క‌ష్టం వాటిల్లినా, ఎవ‌రికి ఏ ఇబ్బందులు ఎదురైనా జాన్‌సైదా నేనున్నానంటూ వారికి భ‌రోసా క‌ల్పిస్తున్నారు.

------------------------

chilkaluripet news, Latest News, Breaking News, Live News News Headlines

 బాల సాహిత్య సేవ‌లో కొన‌సాగుతున్న దార్ల‌  బుజ్జిబాబు ప్ర‌స్థానం 

17న  బాలసాహితీ రత్నజాతీయ బాల సాహిత్య పురస్కారం 



బాలల మనసు ఏమీ రాయని తెల్లకాగితం వంటిది” అంటాడు ఓ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త.అటువంటి తెల్ల‌కాగితాలపై మ‌నం ఏది నేర్పిస్తే అలా వారి భావి జీవితాలు తీర్చిదిద్ద‌బ‌డ‌తాయి. చిన్న‌త‌నంలో అమ్మ‌లు, నాన‌మ్మ‌లు  వారికి చక్కని నీతి కథలు కూడా చెబుతూ కొన్ని పద్దతుల ద్వారా వాళ్లకు ఎలా నడుచుకోవాలో నేర్పేవారు. కాని నేటి ఉరుకుల ప‌రుగుల జీవితంలో చిన్నారుల‌కు క‌థ‌లు దూర‌మ‌య్యాయి. క‌థ‌లు చెప్పేవారు. క‌థ‌లు వినే స‌మ‌యం లేదు. ఈ లోటును తీర్చ‌టానికి చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణానికి చెందిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌, బాల‌సాహితీవేత్త డాక్ట‌ర్ దార్ల బుజ్జిబాబు జీవితాన్నే వెచ్చించారు. బాల‌ల‌కు అవ‌స‌ర‌మైన సాహిత్యాన్ని సృష్టిస్తూ,వారిని బాల‌సాహిత్యం వైపు ఆక‌ర్షింప చేస్తూ ఒక ఉద్య‌మం కొన‌సాగిస్తున్నారు. పిల్ల‌ల్లో సృజ‌నాత్మ‌క శ‌క్తిని పెంచే విధంగా అనేక కార్య‌క్ర‌మాలు రూపొందించారు. ఒక‌వైపు సిటీ కేబుల్‌లో ఉద్యోగ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూనే, బాల‌సాహిత్య ప్ర‌స్థానాన్ని కొన‌సాగిస్తున్నారు.   ఈ నెల 17వ తేదీ  బాలసాహితీ రత్న  'పెండం జగదీశ్వర్ స్మారక జాతీయ బాల సాహిత్య పురస్కారం ను నల్గొండలో అందుకోనున్నారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌త్యేక క‌థ‌నం. 

 బుజ్జిబాబు బాల‌సాహితీ ప్ర‌స్థానం ..

chilkaluripet news, Latest News, Breaking News, Live News News Headlines

 

ఎండా కాలం గ‌ట్టేక్కినా...  ప్ర‌స్తుతం తీవ్ర ఎద్ద‌డి త‌లెత్తే ప్ర‌మాదం 

సాగ‌ర్ జ‌లాలు విడ‌ద‌ల అయితేనే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం 



చిల‌క‌లూరిపేట‌:

ఎండా కాలం ముగిసింది. అడ‌పాద‌డ‌పా వ‌ర్షాలు కురుస్తున్నాయి.  ఈ సంవ‌త్స‌రం  హ‌మ్మ‌య్య ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల‌కు నీటి క‌ష్టాలు తీరాయి.. అనుకున్న త‌రుణంలో కొత్త క‌ష్టాలు మొద‌ల‌య్యాయి.  చిల‌క‌లూరిపేట‌కు తాగునీరు అందించే రెండు చెరువుల్లో నీటి నిల్వ‌లు అడ‌గంటాయి. ఉన్న నీటి నిల్వ‌ల‌తో ఇంకా  కొన్ని రోజుల‌కు మాత్ర‌మే ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల‌కు తాగునీరు అందే అవ‌కాశం ఉండ‌టంతో ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల్లోనూ, అధికారుల్లోనూ అందోళ‌న మొద‌లైంది. సాగ‌ర్ జ‌లాలు విడ‌ద‌ల‌యితే తప్పా పేట ప్ర‌జ‌ల తాగునీటి క‌ష్టాలు తీరేలా లేవు. మ‌రోవైపు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఈ విష‌యంపై ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడి, సాగ‌ర్ జ‌లాలు విడ‌ద‌ల అయ్యేలా ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు.  అధికారులు సైతం జిల్లా క‌లెక్ట‌ర్ దృష్టికి స‌మ‌స్య‌ను తీసుకువెళ్లారు. అయితే నీటి విడ‌ద‌ల అనేది చిన్న విష‌యం కాదు. ఇందుకు ఇరు తెలుగు రాష్ట్రాల కృష్ణ‌జ‌లాల యాజ‌మ‌న్య సంస్థ అనుమ‌తి త‌ప్ప‌ని స‌రి. ఈ అవ‌రోధాలు దాటి సాగ‌ర్ జ‌లాలు విడ‌ద‌ల అయితే త‌ప్పా   ప్ర‌స్తుత త‌రుణంలో ఒక రోజు ఆల‌శ్యం అయినా తీవ్ర నీటి ఎద్ద‌డి పొంచి ఉంది. 

అడ‌గింటిన నీటి నిల్వ‌లు.. 

పట్టణంలో సుమారు లక్షకు పైగా జనాభతో పాటు రోజుకు వివిధ ప్రాంతాల నుంచి 50 వేల మంది ప్రజలు పట్టణానికి వచ్చి వెళ్తుంటారు..ప్రతి మనిషికి రోజువారి అవసరాల నిమిత్తం 135 లీటర్ల మంచినీరు అవసరమౌతుంది.లక్షకు పైగా జనభా ఉన్న పట్టణంలో రోజుకు ప్రతి మనిషికి కేవలం 75 లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు.. ప్ర‌స్తుతం రోజుమార్చి రోజు తాగునీటిని పుర‌పాల‌క సంఘం స‌ర‌ఫ‌రా చేస్తుంది.  పెద్దదైన కొత్త చెరువులో 2,690 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగి ఉండగా, పాతదైన చిన్న చెరువు 950 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగి ఉంది. రెండు మంచినీటి చెరువుల్లోని నీరు అడగంటి డెడ్ స్టోరేజ్లు చేరటంతో పట్టణ ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మ‌రో వైపు ఇప్ప‌టికీ ప‌లు కాల‌నీల‌కు పుర‌పాల‌క సంఘం స‌ర‌ఫ‌రా చేసే ట్యాంక‌ర్లే దిక్కు. 

నీటి క‌ష్టాలు అధిగ‌మిస్తాం.. సీహెచ్ గోవింద‌రావు, క‌మిష‌న‌ర్ 



నెల రోజులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని , చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణ మంచినీటి స‌మ‌స్య‌పై కెనాల్స్ ఉన్న‌తాధికారుల‌తో చ‌ర్చిస్తున్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ సైతం ఈ విష‌యంపై స్పందించి పేట తాగునీటి స‌మ‌స్య‌పై దృష్టి సారించారు. ప్ర‌తి రోజూ నీటి వినియోగం, ల‌భ్య‌త తో చెరువుల‌కు సాగ‌ర్ జ‌లాల విడ‌ద‌ల పై చ‌ర్చిస్తున్నాం. సాగ‌ర్ జ‌లాలు త్వ‌ర‌లోనే విడ‌ద‌ల అయ్యే అవ‌కాశం ఉంది. ఈ ఏడాది  వేస‌విలో ఎండ తీవ్ర‌త‌కు నీరు ఇంకి పోయి ఇటువంటి ప‌రిస్థితి ఎర్ప‌డింది. 

------------------------

chilkaluripet news, Latest News, Breaking News, Live News News Headlines
Published from Blogger Prime Android App

జ్ఞానేశ్వర్ ఫౌండేషన్ అధినేత షేక్ జాన్ సైదా యడ్లపాడు మండలం, కొండవీడు గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలిన కుటుంబీకులకు పరామర్శించిన పిదప 20 వేల రూపాయల ఆర్ధిక సహాయం చేయడం జరిగింది.సోమవారం రాత్రి యడ్లపాడు మండలం కొండవీడులో సిలిండర్ లీకై ఇంట్లోని వస్తువులన్నీ దగ్ధమైన సంఘటన జరిగింది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివసించే కట్టా సురేష్ భార్య రాత్రి 8:30 గంటల సమయంలో వంట చేసేందుకు సమాయత్తం అయింది. లైటర్ ముట్టించే ప్రయత్నం చేయగా,అప్పటికీ సిలిండర్ నుంచి గ్యాస్ లీకై ఒక్కసారిగా ఇల్లంతా మంటలు వ్యాపించాయి.అప్పటికే ఇంట్లోని టీవీ, మంచాలు, దుస్తులు, గృహోపకరణ వస్తువులతో పాటు ఆధార్, రేషన్, విద్య సంబంధిత సర్టిఫికెట్లు కాలిపోయాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చల్లా యుగ్నేశ్వర రెడ్డి ,గుంటూరు జిల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ బి వి రెడ్డి , భాస్కర్ రెడ్డి , పోతరం బాషా మేస్త్రి, 15వ వార్డు కౌన్సిలర్ జాలాది సుబ్బారావు , కొండవీడు సర్పంచ్ జాకీర్ తదితరులు పాల్గొన్నారు...
chilkaluripet news, Latest News, Breaking News, Live News News Headlines

 .. 


ప‌ల్నాడు జిల్లాలో ఉన్న  ఆరు స‌ర్కిళ్లు,  మూడు కు కుదింపు

ఆదాయ వృద్థి కోసం ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖను పునర్‌వ్యవస్థీకరించింది. రాష్ట్ర ప్ర‌భుత్వం వాణిజ్య ప‌న్నుల శాఖ‌లో ఇటీవ‌ల‌ తీసుకొచ్చిన సంస్క‌ర్ణ‌లు ప‌లు విమ‌ర్శ‌ల‌కు తావిస్తున్నాయి. ఉన్న కార్యాల‌యాల‌ను  తొల‌గించ‌టం, కొత్త స‌ర్కిల్‌లో క‌ల‌ప‌టం వ‌ల్ల ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌తి ప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతోనూ కొన్ని చిక్కులు ఏర్పడడంతో సమూల మార్పుల ద్వారా ఆదాయం పొందాలని దృష్టిపెట్టింది..  రాష్ట్రంలోని వాణిజ్య పన్నుల శాఖ(స్టేట్‌ టాక్స్‌)లో కొత్త సర్కిల్స్‌ ఏర్పాటయ్యాయి. గతంలో రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 110 సర్కిల్స్‌ ఉండగా వీటిని కొత్త జిల్లాల వారీగా సర్థుబాటు చేసి 109కి కుదించారు. వాణిజ్య పన్నుల శాఖలో పన్నుల వసూళ్లు, ట్రేడర్ల కార్యకలాపాలపై నిఘాను సర్కిల్స్‌ వారిగా కొనసాగించనున్నారు. గుంటూరు జిల్లాలో తొమ్మిది, బాపట్ల జిల్లాలో రెండు, పల్నాడు జిల్లాలో మూడు  సర్కిల్స్‌ను వాణిజ్య పన్నుల శాఖ ఏర్పాటు చేసింది. ప‌ల్నాడు జిల్లా ను తీసుకుంటే చిల‌క‌లూరిపేట‌లో ఉన్న వాణిజ్య‌ప‌న్నుల శాఖ కార్యాల‌యాన్ని స‌త్తెన‌ప‌ల్లిలో, మాచర్ల‌లో ఉన్న స‌ర్కిల్‌ను  పిడుగురాళ్ల‌కు, వినుకొండ‌లో ఉన్న స‌ర్కిల్‌ను న‌ర‌స‌రావుపేట‌కు త‌ర‌లించి కార్యాల‌యాల‌ను కుదించారు.  

వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 2017లో జీఎస్టీ చట్టం తీసుకువచ్చింది. ఈ జీఎస్టీ చట్టంతో రాష్ట్రాలకు రెవెన్యూ లోటు ఏర్పడింది. జీఎస్టీతో ఏర్పడిన రెవెన్యూ లోటు ను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఆయా రాష్ట్రాల లోటు ఆధారంగా పరిహారమిస్తోం ది. మూడేళ్లపాటు మాత్రమే పరిహారం ఇస్తామని కేంద్రం స్పష్టంచేసింది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌ వరకు కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించింది.  గడువు ముగిసిన  నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆదా యంపై దృష్టి సారించింది.

చిల‌క‌లూరిపేట ఉన్న స‌ర్కిల్‌ను స‌త్తెన‌ప‌ల్లిలో క‌లిపి చిల‌క‌లూరిపేట వాణిజ్య‌ప‌న్నుల శాఖ కార్యాల‌యం తొల‌గించారు. 

ఏ ప్రాతిప‌దిక‌న కుదింపు జ‌రిగింది...?

ప్ర‌భుత్వం జీఎస్టీ వ‌సూళ్ల‌పైనే దృష్టి పెట్టింది. వ‌స్తువు త‌యారి అయ్యే ప్రాంతం క‌న్నా వ‌స్తు వినియోగం ఉన్న ప్రాంతంలోనే జీఎస్టీ అత్య‌ధిక వ‌సూలు అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని ప్ర‌భుత్వం భావిస్తుంది.   ఇందులో భాగంగానే ఈ మ‌ర్పులు జ‌రిగాయ‌ని అధికారులు చెబుతున్నారు. స‌ర్కిల్ ప‌రిధిలో 3వేల నుంచి 4వేల వ‌ర‌కు డీల‌ర్లు ఉండ‌టం , జీఎస్‌టీ ఆదాయం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని నిర్ణ‌యించారు. మ‌రోవైపు ఆన్‌లైన్ వ్య‌వ‌స్థ వ‌చ్చిన త‌ర్వాత కార్యాల‌యాల‌తో సంబంధం లేకుండా అన్ని వాణిజ్య ప‌న్నుల‌కు సంబంధించి అన్ని  ర‌కాల  సేవ‌లు ఆన్‌లైన్‌లో కొన‌సాగుతున్నాయి. దీంతో కార్యాల‌యాలు ఎక్క‌డ ఉన్నా న‌ష్టం లేద‌ని అధికారులు వాదిస్తున్నారు. అయితే చిల‌క‌లూరిపేట విష‌యానికి వ‌స్తే గ‌తంలో వ్యాట్ ప‌ద్ద‌తి అమ‌లులో ఉన్న‌ప్పుడు అత్య‌ధిక ఆదాయం వ‌చ్చిన మాట వాస్త‌వ‌మేన‌ని, కాని జీఎస్టీ అమ‌లులోకి వ‌చ్చాక ఆ ప‌రిస్థితి లేద‌ని చెబుతున్నారు.


-----------------


chilkaluripet news, Latest News, Breaking News, Live News News Headlines




చిల‌క‌లూరిపేట‌:

ప్ర‌తి సారి ప్లాస్టిక్ నిషేదం, పాలిథిన్ క‌వ‌ర్లు వాడితే చ‌ర్య‌లు అంటూ అధికారులు స‌మావేశాలు ఏర్పాటు చేసి చెప్ప‌టం, తిరిగి అంతా మామూలుగానే జ‌రిగిపోవ‌టం జ‌రుగుతున్న తంతే.  నియోజ‌క‌వ‌ర్గంలో  ప్రతి మనిషి సగటున నాలుగు కేజీల పాలిథిన్‌ కవర్లు వాడుతున్నారని ఓ సర్వేలో తేలింది .క్యారీ బ్యాగులు, వాటర్‌ బాటిళ్లు, టీ కప్పులు ఇవ‌న్నీ క‌ల‌సి చిల‌క‌లూరిపేట మున్సిపాలిటి నుంచి వ్య‌ర్ధాల్లో ఐదు శాతానికి మించి ప్లాస్టిక్‌ వ్యర్ధాలు ఉంటున్నాయి. 


 పాలిథిన్  వాడకం పర్యావరణానికి, మనిషి ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని, అది క్యాన్సర్‌ కారణమని తెలిసినా, ప్లాస్టిక్‌ కవర్‌ నిషేధించటం లేదు. ప్రతి ఒక్కరూ కిరాణ, కూరగాయల, వివిధ రకాల కు ప్లాస్టిక్‌ కవర్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకున్న కొందరు ప్లాస్టిక్‌ వ్యాపారులు రూ.కోట్ల దందాను కొనసాగిస్తున్నారు. దీన్ని అదుపుచేయాల్సిన అధికారులు  చూసి చూడ కుండా వ‌దిలివేయ‌టంతో ప్లాస్టిక్‌ వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.

 ప్లాస్టిక్‌ వ్యర్థాలతో జరిగే నష్టాలు ఇవే.. 

ప్లాస్టిక్‌ వినియోగంతో వాతావరణ కాలుష్యంతో సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాలవల్ల భూమిని కాపాడే ఓజోన్‌ పొరకు భారీస్ధాయిలో చిల్లు పడుతుంది. దీని వల్ల భూమి పైన ఉన్న జీవరాశులు, మనుషుల్లో శ్వాస, చర్మ, సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు ఉంది. అంతేగాక గరం గరం చాయ్‌.. వేడి వేడి ఇడ్లీ, దోశ, పూరి లాంటివి ప్లాస్టిక్‌ కవర్లలోనే తీసుకొచ్చి తింటాము. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టలను పట్టించుకోరూ. అంతేగాక పర్యావరణానికి కూడా ఇవి హాని కలిగిస్తాయి. వర్షపు నీరు భూగర్భంలోకి చేరకుండా ప్లాస్టిక్‌ అడ్డుకుంటుంది. ప్లాస్టిక్‌ను తగలబెట్టడం వల్ల డ్రైయాక్సిన్‌ వాయువు గాలిలో కలిసి క్యాన్సర్‌ కారణమవుతుంది. పశుగ్రాసం లేనప్పుడు పశువులు, వివిధ జీవాలు ప్లాస్టిక్‌ వ్యర్థాలను తింటాయి. వాటి మాంసం మనం తినటం వల్ల పలు రోగాలు వచ్చే అవకాశం ఉంది. చెరువుల్లో, నదుల్లో ఈ వ్యర్థాలు వేయటంవల్ల చేపలు ఇతర జలచరాలు చనిపోతాయి.



 విస్తృత ప్ర‌చార‌మే మార్గం... 

పాలిథిన్ క‌వ‌ర్లు, ప్లాస్టిక్  వాడకాన్ని తగ్గించుకుంటేనే మంచిది. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించాలని బాధ్యతగా గుర్తించాలి. కవర్లు, కప్పులు, వాటర్‌ బాటిళ్లు బహిరంగా ప్రదేశాల్లో వేయరాదు. ప్రజలు ప్లాస్టిక్‌ నిషేధంపై చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. మున్సిప‌ల్ అధికారులు  కూడా ప్లాస్టిక్‌ వ్యర్థాల వాడకం వల్ల కలిగే నష్టాలను ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలి.


chilkaluripet news, Latest News, Breaking News, Live News News Headlines

 




చిలకలూరిపేట:

ప్రతిభగల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు' కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జవహర్ నవోదయ విద్యాలయం ప్రవేశానికి ఈ నెల 30న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ ఎన్ నరసింహరావు తెలిపారు. చిలకలూరిపేట మండలం మద్దిరాలలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో  2022-23. విద్యాసంవత్సరంలో ఆరోతరగతి ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రవేశ పరీక్షకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 4,397 మంది విద్యార్థులు హాజరు కానున్నారని వివరించారు. కొత్త జిల్లాల వారిగా చూస్తే గుంటూరు జిల్లా నుంచి 843. మంది, బాపట్ల జిల్లా నుంచి 679 మంది, పల్నాడు జిల్లా నుంచి 2,875 మంది ప్రవేశ పరీక్షకు హాజరౌతారన్నారు. ఆరో తరగతిలో మొత్తం 80 సీట్లు ఉంటాయని, వీటిలో ప్రవేశానికి సంబంధించి ఈ నెల 30న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు.

chilkaluripet news, Latest News, Breaking News, Live News News Headlines

 


                                      చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి యం రాధాకృష్ణ


చిల‌క‌లూరిపేట‌: 

ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు గాంధేయవాది ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చీరాల పేరాల ఉద్యమం విజయవంతంగా నిర్వహించి నూరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి యం రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు   రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు సాకే శైలజానాథ్ కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి జెడిశీలం గార్ల నాయకత్వం లో చీరాల లో సోమ‌వారం  సాయంత్రం జరుగనున్న ప్రజా ప్రదర్శనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు నాడు బ్రిటీష్ పాలకులు విధించిన అధిక పన్నులకు వ్యతిరేకంగా వినూత్న రీతిలో ఉద్యమించిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య   పోరాట పటిమ ను  ఆదర్శంగా తీసుకుని నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న అధిక పన్నులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావలసిన ఆవశ్యకత గురించి తెలియజెప్పే ఈ కార్యక్రమ విజయం ఆవశ్యం అని అన్నారు ఎఐసిసి ఉపాధ్యక్షులు కేంద్ర ప్రభుత్వ మాజీ  మంత్రి వర్యులు ముకుల్ వాస్నిక్ తో పాటు అనేక మంది జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొనే  చీరాల పేరాల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అందుకు గాను రేపు మధ్యాహ్నం మూడు గంటలకు  కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుండి బయలుదేరే  కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు

---------------