బాల సాహిత్య సేవ‌లో కొన‌సాగుతున్న దార్ల‌  బుజ్జిబాబు ప్ర‌స్థానం 

17న  బాలసాహితీ రత్నజాతీయ బాల సాహిత్య పురస్కారం 



బాలల మనసు ఏమీ రాయని తెల్లకాగితం వంటిది” అంటాడు ఓ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త.అటువంటి తెల్ల‌కాగితాలపై మ‌నం ఏది నేర్పిస్తే అలా వారి భావి జీవితాలు తీర్చిదిద్ద‌బ‌డ‌తాయి. చిన్న‌త‌నంలో అమ్మ‌లు, నాన‌మ్మ‌లు  వారికి చక్కని నీతి కథలు కూడా చెబుతూ కొన్ని పద్దతుల ద్వారా వాళ్లకు ఎలా నడుచుకోవాలో నేర్పేవారు. కాని నేటి ఉరుకుల ప‌రుగుల జీవితంలో చిన్నారుల‌కు క‌థ‌లు దూర‌మ‌య్యాయి. క‌థ‌లు చెప్పేవారు. క‌థ‌లు వినే స‌మ‌యం లేదు. ఈ లోటును తీర్చ‌టానికి చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణానికి చెందిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌, బాల‌సాహితీవేత్త డాక్ట‌ర్ దార్ల బుజ్జిబాబు జీవితాన్నే వెచ్చించారు. బాల‌ల‌కు అవ‌స‌ర‌మైన సాహిత్యాన్ని సృష్టిస్తూ,వారిని బాల‌సాహిత్యం వైపు ఆక‌ర్షింప చేస్తూ ఒక ఉద్య‌మం కొన‌సాగిస్తున్నారు. పిల్ల‌ల్లో సృజ‌నాత్మ‌క శ‌క్తిని పెంచే విధంగా అనేక కార్య‌క్ర‌మాలు రూపొందించారు. ఒక‌వైపు సిటీ కేబుల్‌లో ఉద్యోగ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూనే, బాల‌సాహిత్య ప్ర‌స్థానాన్ని కొన‌సాగిస్తున్నారు.   ఈ నెల 17వ తేదీ  బాలసాహితీ రత్న  'పెండం జగదీశ్వర్ స్మారక జాతీయ బాల సాహిత్య పురస్కారం ను నల్గొండలో అందుకోనున్నారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌త్యేక క‌థ‌నం. 

 బుజ్జిబాబు బాల‌సాహితీ ప్ర‌స్థానం ..

పేరుకు త‌గ్గ‌ట్లే బుజ్జిబాబు చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపే బాల‌సాహిత్యాన్ని ఎంచుకున్నారు. బుజ్జిబాబు త‌ల్లిదండ్రులు  శాంతమ్మ, ఆశీర్వాదం . బుజ్జిబాబు వృత్తి జ‌ర్న‌లిస్టు కాగా,  ప్ర‌వృత్తి బాల సాహిత్యం. గ‌త 27 ఏళ్ళు సంవ‌త్స‌రాలుగా క‌థ‌లు, గ‌ల్పిక‌లు, గేయాలు, విజ్ఞాన‌విశేషాలు, జీవిత‌చ‌రిత్ర‌లు ఇలా అనేక ర‌చ‌న‌లు కొన‌సాగించారు. ఒక పుస్త‌క ప‌ఠ‌నం క‌రువైన నేటి రోజుల్లో బాల‌బాలిక‌ల కోసం వంద‌ల పుస్త‌కాలు వెలువ‌రించారు. వాటిలో బుజ్జి పిల్లలకు కథా వాచకాలు. కోతి తిప్పలు, జింక మానవత్వం (2004),కోడిపుంజు పట్టుదల.  (2004),.ఏడు గొప్ప, మూర్కపు నెమలి (2004), కుందేలు ఉపాయం. (2004) చెప్పుడు మాటలు(2004), మంత్రపు నాణాలు. (2004), పావురాయి స్నేహం. (2004),. ఉడుత పరుగు.  (2004), చిట్టి చీమ తెలివి(2022), తాబేలు - తాటికాయ (2023) ,ఏనుగును కాపాడిన ఎలుక (2023), ఊర్లోకి వచ్చిన పులి   (2023), అపాయంలో ఉపాయం(2023), ప్రాణం విలువ (2023) మాయమైన నీళ్లు (2023), పాలుకార్చే వేపచెట్టు (2021),పొగడ్తల కోడి పుంజు  (2023),శాకాహారం చేసే మేలు.(2023), అసలు రూపం  (2023) పిల్లి పెళ్లి (2023) పారిపోయిన రౌడీ కోతి (2023) వెలువ‌రించారు. వీటితో పాటు  బుజ్జిపిల్లలకు   కథల సంపుటాలు వెలువ‌రించారు. వాటిలో  పుచ్చకాయ సంచారం (24 కథలు)2021, దొంగను పట్టిన చెట్టు   (24 కథలు)2021,  పెళ్ళికెళ్లిన నక్క. (24 కథలు)2021 ఇలా పుస్త‌కాలు ప్ర‌చురించారు. దీంతో పాటు కార్ధు క‌థ‌లు,  బుజ్జి పిల్లలకు బాల గేయాలు,బుజ్జిపిల్లలకు విజ్ఞాన పుస్తకాలు, పెద్ద పిల్లలకు.. కథావాచకాలు,   పెద్ద పిల్లలకు కథా సంపుటాలు, పెద్ద పిల్లలకు బాలగేయలు,    పిల్లల నవలలు, వ్యక్తిత్వ వికాస పుస్త‌కాలు,  జీవిత చరిత్రలు, దేశ‌భ‌క్తి గేయాలు ప్ర‌చురించారు. 

కొన‌సాగుతున్న బుజ్జిబాబు   బాల సాహిత్య సేవలు:



2006లో రాజీవ్ విద్యా మిషన్ వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాల సాహిత్య పుస్తక ప్రచురణల విభాగంలో రాష్ట్ర సంపాదక మండలి సభ్యులుగా వున్నారు.  గుంటూరు జిల్లా ప్రచురణల విభాగంలో సంపాదకునిగా సేవ‌లు అందించారు.. 2008లో  గుంటూరు జిల్లా బాలల రచయితల సంఘం ఆధ్వర్యంలో వెలువడిన 'బాల వెన్నెల'  మాసపత్రికకు ప్రధాన సంపాదకునిగా పనిచేశారు. .2014 లో విజయవాడ నుండి వెలువడిన బాలల బొమ్మరిల్లు, బాలల చంద్ర ప్రభ  మాస పత్రికలకు రెండేళ్ల పాటు  సంపాదకునిగా పనిచేశారు. 2015లో  చిలకలూరిపేట కేంద్రంగా రావూరి భరద్వాజ బాలల విజ్ఞాన పీఠం స్థాపించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా బాల సాహిత్యం సృష్టిస్తున్న రచయితలను గౌరవిస్తూ, వారికి అవార్డులు ఇస్తున్నారు..  వివిధ ప్రాంతాల్లో బాల సాహిత్య కార్యశాలలు, సదస్సులు, నిర్వహిస్తూ బాల సాహిత్య సేవ చేస్తున్నారు.   పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి నూతనంగా విడుదలైన  గ్రంథాలను చదివిస్తూ వారిలో పఠనాసక్తి  క‌లిస్తున్నారు.   ప్రభుత్వ పాఠశాలలల్లో చదివే వేలాదిమంది బాలబాలికలకు ఉచితంగా పుస్తకాలు అందించారు. ఆయా పాఠ‌శాల‌ల్లో  గ్రంథాలయాలు ఏర్పాటు చేయిస్తున్నారు. 2008లో గుంటూరు జిల్లా ఖాజీ పాలెంలో  కవుల ఎండోమెంట్ ఫర్ లైబ్రరీ అండ్  ఇన్ఫెర్మషన్  అద్వర్యంలో బాలల పుస్తక ప్రచురణ సధస్సులో పాల్గొని పత్రసమర్పణ చేశారు. 2013లో  విశాఖపట్నంలో కేంద్రసాహిత్య అకాడమీ నిర్వహించిన బాలల నీతికథలు సదస్సులో పాల్గొని పత్రసమర్పణ చేశారు. 2015లో  తూ. గో. జిల్లా మలికిపురంలో నన్నయ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో  సాహిత్యంలో బాల్యచిత్రణ అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొని పత్రసమర్పణ చేశారు. 

2012 లో గుంటూరులో రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ మాడ్యూల్స్ రూపకల్పనలో విషయ నిపుణుడిగా  పాల్గొన్నారు. 2016లో తెలంగాణ సిరిసిల్లలో కేంద్రసాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాల సాహిత్య కార్యసాలలో విషయ నిపుణునిగా శిక్షణ ఇచ్చారు.   ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్.సి.ఇ. ఆర్.టి. విజయవాడలో  నిర్వహించిన పాఠ్య పుస్తకాల రూపకల్పనలో   పాల్గొని సూచనలు, సలహాలు అందించారు.  2020 లో సమగ్ర శిక్ష అభియాన్ పుస్తక ప్రచురణలకు రచన సహకారం అందించారు. 2020లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'చదవడం మాకిష్టం' కార్యక్రమంలో విషయ నిపుణునిగా అనేక ప్రాంతాలలో స్వచ్చందగా పాల్గొన్నారు. 

 దార్ల బుజ్జిబాబు పొందిన  పురస్కారాలు:



  2011 తెనాలిలో.. సమతారావు బాలాసాహిత్య పురస్కారం. హైదరాబాద్ లో... జాతీయ బాలసాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో  కాకుల కలివిడి కుక్కల కలహం గేయ కథల పుస్తకానికి  ఉత్తమ గ్రంథ అవార్డు,  చిలకలూరిపేటలో రోటరీ క్లబ్ ఇంటర్నేషల్ వారి వృత్తి సేవా పురష్కారం, తెనాలిలో  పద్మభూషణ్ గుర్రం జాషువా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో జాషువా బాల సాహితీ పురష్కారం,. లయన్స్ క్లబ్ ఇంటర్నేషల్ ఆధ్వర్యంలో పౌరసేవ పురష్కారం , చిలకలూరిపేటలో... ఏ.ఎమ్.జి. ఇండియా ఇంటర్నేషల్ రిపబ్లిక్  డే అవార్డు, ఎడ్లపాడులో... పుచ్చలపల్లి సుందరయ్య కళా పీఠం వారి పుచ్చలపల్లి సుందరయ్య కళా పురష్కారం (ఓల్గా గారితో పాటు) ,  చిలకలూరిపేటలో.... మహాత్మాగాంధీ సేవా పురస్కారం అప్ప‌టి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేతులమీదుగా ,  తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో.. కృష్ణ పుష్కర పురష్కారం మంత్రి పల్లె రఘునాథరెడ్డి చేతుల మీదుగా , హైదరాబాద్ లో...  డా. వేదగిరి రాంబాబు తొలి బాలసాహిత్య పురష్కారం (ఆయన చేతులమీదుగానే) అంద‌కున్నారు. అయ్యంకి వెంకట రమణయ్య తొలి గ్రంథాలయ పురష్కారం,  విజయ నగరంలో.... బండారు బాలనంద సంఘం  ఆధ్వర్యంలో 'బాల సేవక్' పురష్కారం. న్యూఢిల్లీలో.... ఆదిలీల ఫౌండేషన్, ప్రవాసాంధ్ర నాటక అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో "ఉగాది" పురష్కారం,   శ్రీకాకుళంలో.... బాలరంజని వారి 'బాలమిత్ర' పురష్కారం ,  గుంటూరులో రాష్ట్ర గ్రంథాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వెలగా వెంకటప్పయ్య  స్మారక అవార్డు ,  విశాఖ పట్నంలో  తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో జాతీయ యువసేవా పురష్కారం వాగ్గేయ కారులు వంగపండు చేతుల మీదుగా  అందుకున్నారు.  చెన్నైలో....తెలుగువెలుగు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 'తెలుగువెలుగు' పురష్కారం పొందారు.  విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ  'తెలుగు భాష విశిష్ట పురష్కారం'  ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ చేతుల మీదుగా స్వీక‌రించారు.  బాలల దినోత్సవం సంధర్బంగా  హైదరాబాద్ లో బాలల గోకులం అద్వర్యంలో  'బాలల నేస్తం' పురస్కారం కొలకలూరి ఇనాక్  చేతుల మీదుగా అంద‌కున్నారు. 2020 అక్టోబర్ లో "బ్రంప్టన్ ఇంటర్నేషల్ యూనివర్సిటీ ( కెనడా)" నుండి బాల సాహిత్యానికి చేసిన సేవకు గాను 'గౌరవ డాక్టరేట్' అందుకున్నారు. ఇలా ఎన్నో అవార్డులు, పుర‌స్కారాలు అందుకున్న బుజ్జిబాబు చిల‌క‌లూరిపేట‌లో జ‌న్మించ‌టం పేట ప్ర‌జ‌ల అదృష్టం. 

            చిల‌క‌లూరిపేట‌ క‌ళ‌ల‌కే కాదు. ర‌చ‌యిత‌ల‌కు, సాహితీకారుల‌కు పుట్టినిల్లు. ఇటువంటి బాల‌సాహిత్య కారుడు బుజ్జిబాబును  మ‌రింత‌గా ప్రోత్స‌హించ‌టానికి ప్ర‌తి ఒక్క‌రు ముందుకు రావాలి.  బాలసాహితీ రత్న  'పెండం జగదీశ్వర్ స్మారక జాతీయ బాల సాహిత్య పురస్కారం ను అంద‌కోనున్న మిత్రుడు దార్ల బుజ్జిబాబుకు అభినంద‌న‌ల‌తో ... 


Axact

చిలకలూరిపేట న్యూస్

నిజం.. నిష్పక్షపాతం మా నైజం నిగ్గు తేల్చే నిజాల కోసం.. నిక్కచ్చైన విశ్లేషణల కోసం

Post A Comment:

0 comments: