చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించి రెండు ప్రధాన అభివృద్ది పనులకు మంత్రి మండలి ఆమోదం తెలపటంతో పేట ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి పారిశ్రామిక అభివృద్దికి సంబంధించిన విషయం అయితే , మరోకటి ఆరోగ్యానికి సంబంధించినది కావటం గమనార్హం. చిలకలూరిపేట మండలం గోపాళంవారిపాలెం గ్రామంలో 50 ఎకరాల ప్రాంగణంలో నిర్మిస్తున్న టెక్స్‌టైల్ పార్కు అభివృద్దికి ప్రభుత్వం ఎకరా భూమికి రూ. 18లక్షల, 15వేలు కేటాయించటానికి నిర్ణయించింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో పత్తి ఆధారిత పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో జిన్నింగ్, స్పిన్నింగ్ పరిశ్రమల్లో వేలాది మందికి ఉపాధి దొరకుతుంది. ఈ క్రమంలోనే టైక్స్‌టైల్ పార్కు కూడా అందుబాటులోకి వస్తే 2,500 మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది. ఇది చిలకలూరిపేటలో వస్త్ర పరిశ్రమలో ఒక ముందడుగు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో పట్టణ పరిధిలో ఒకే ఒక 30 పడకల ఆసుపత్రి మాత్రమే ఉంది. ఇది చిలకలూరిపేట, పట్టణం, మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలకే అందుబాటులో ఉంది. మిగిలిన యడ్లపాడు, నాదెండ్ల మండలాల ప్రజలకు పీహచ్‌సీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు గుంటూరు-చిలకలూరిపట మధ్య రోడ్డు ప్రమాదాల సంబవించినప్పడు సైతం చిలకలూరిపేట కమ్యూనిటి హెల్త్ సెంటరే దిక్కుగా మారింది. ఈ క్రమంలో నాదెండ్ల మండలం చిరుమామిళ్ల లో రూ. 4 కోట్ల అంచనాలతో నిర్మించనున్న 30 పడకల ఆసుపత్రికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇందువల్ల నాదెండ్ల మండల ప్రజలతో పాటు, యడ్లపాడు ప్రజలకు సైతం ఈ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
టెక్స్‌టైల్ పార్కు, 30 పడకల ఆసుపత్రి ల అభివృద్దితో ఉపాధి, ఆరోగ్యానికి పెద్ద పీట వేసినట్లైంది.


Post A Comment:
0 comments: