ఎన్నికలకు నగార మోగింది. ఎన్నికలకు నెలల కాలం కాస్తా రోజుల్లోకి వచ్చింది. అభ్యర్దులకు ప్రతి క్షణం అమూల్యమైనదే. ఇందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఓటర్ దేవుడ్ని ప్రసన్నం చేసుకోవటానికి సిద్దమౌతున్నారు.
ఈ క్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గం గురించి కొన్ని విషయాలు ...
ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గం ప్రత్తిపాడు, నరసరావుపేట, తాడికొండ, ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గాలు సరిహద్దులుగా కలిగి ఉంది.
చిలకలూరిపేట నియోజకవర్గంలో 12 సార్లు ఎన్నికలు నిర్వహించారు.
నియోజకవర్గం సుమారు 506 చదరపు కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉంది.
జరిగిన 12 శాసన సభ ఎన్నికల్లో ఇరువురు డాక్టర్లు గెలుపొందారు. వీరు ఇరువురు టీడీపీ తరుపునే గెలవటం విశేషం. 1983 లో టీడీపీ ఆవిర్బావం తరువాత డాక్టర్ కాజా కృష్ణమూర్తి విజయం సాధించగా, 1989 ఎన్నికల్లో డాక్టర్ కందిమళ్ల జయమ్మ విజయం సాధించారు. నియోజకవర్గం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు నియోజకవర్గంలో కందిమళ్ల జయమ్మ తొలి మహిళ ఎమ్మెల్యే. ప్రస్తుతం వైసీపీ తరుపున మహిళ అభ్యర్దిగా విడదల రజని తన అదృష్ణాన్ని పరీక్షించుకోనున్నారు.
1952లొ ఈ నియోజకవర్గం పేరుతో ఎన్నికలు నిర్వహించినా, 1957,1962లో ప్రకాశం జిల్లాలో అంతర్బంగా ఉంది. తిరిగి 1962లో చిలకలూరిపేట నియోజకవర్గంలోనే ఎన్నికలు నిర్వహించారు.
సీపీఐ, స్వతంత్ర్యపార్టీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీల అభ్యర్దులకు నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టారు.
నియోజకవర్గ పరిధిలో ఎన్నడు లేని విధంగా కాంగ్రెస్‌పార్టీ ప్రజాభిప్రాయానికి తలొగ్గి 2004 ఎన్నికల్లో టికెట్ ఇచ్చిన అభ్యర్ధిని కాదని , ఇండిపెండెంట్ అభ్యర్ది మర్రిరాజశేఖర్‌కు మద్దతు పలికింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్ధి బరిలో ఉన్నా , మర్రిరాజశేఖర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
వరుసగా ఒకే అభ్యర్ధి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాంప్రదాయం లేదు. కాని ఈ సంప్రదాయాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే , మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బ్రేక్ చేశారు.
నియోజకవర్గ పరిధిలో అప్పట్లో సోమేపల్లి సాంబయ్య, ప్రస్తుతం ప్రత్తిపాటి పుల్లారావు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేలు వ్యవహరించారు.
--


Post A Comment:
0 comments: