political party,politics,political,political leaders,party politics,political leaders jumping,political heat in ap,political leaders personal issues d

 వేలం వెర్రిగా మారిన‌  పార్టీల్లో చేరిక‌లు 

ఫార్టీ ఫిరాయింపు దారుల‌కు ఎన్నిక‌ల పండుగ 

చిల‌క‌లూరిపేట‌న్యూస్‌: 
ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌కు వ‌స్తోంది. అధికార వైఎస్సార్ సీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ-జ‌న‌సేన కూట‌మిల మ‌ధ్య వార్ మొద‌లైంది. ఇందుకు త‌గ్గ‌ట్లుగానే చిల‌క‌లూరిపేట‌లోనూ పూర్తిగా ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వ‌చ్చేసింది. ఐదేళ్ల‌కు ఒక‌సారి వ‌చ్చే ఎన్నిక‌లంటే కొంద‌రికి పండుగ‌.  ఎన్నిక‌లు ముగిసేవ‌ర‌కు ఆయా పార్టీల్లో ఉండే కొంత‌మందికి నిత్య‌క‌ళ్యాణం ప‌చ్చ‌తోర‌ణ‌మే. ఫ‌ల‌నా పార్టీ నుంచి ఇంత మంది జాయిన్ అయితే, మ‌రుస‌టి రోజు.. అంత స‌మ‌యం కూడా ఉండ‌టం లేదు. సాయంత్రానికే త‌మ పార్టీలో అంత మంది జాయిన్ కావాల్సిందే. ఇందుకు ఈ నాయ‌కులు ప‌నికివ‌స్తారు. ఇటువంటి  నాయ‌కుల‌కు పార్టీలలో  ప్ర‌త్యేక‌మైన గుర్తింపు కూడా ఉంటుంది. వీరితో పాటు జంప్ జిలానిల‌కు ఎన్నిక‌ల అయిపోయేవ‌ర‌కు పండుగే మ‌రి. 
లెక్క స‌రిపోయిందా...? 
లెక్క స‌రిపోవాలి.. లేదా ప్ర‌త్య‌ర్ధి పార్టీ కంటే ఎక్కువ‌గా ఉంటే మ‌రి మంచిది. కండువాలు క‌ప్పుకొనేవారికి .. అంటే పార్టీలు మారేవారికి ప్ర‌త్యేక స‌దుపాయాలు కూడా ఉంటాయి. అప్ప‌టి వ‌ర‌కు అనామ‌కులుగా ఉన్న వారు నాయ‌కులుగా మారిపోతారు. హామీలు  ఉంటాయి. అయితే గ‌తంలో మాదిరి హామీలు న‌మ్మ‌క‌పోవ‌డం వ‌ల్ల అప్ప‌టిక‌ప్పుడు ఫ‌లానా పార్టీ నుంచి 20 కుటుంబాలు ప‌త్య‌ర్ధి పార్టీలో చేరార‌ని స‌మాచారం రావ‌టం ఆల‌శ్యం వెంట‌నే లెక్క స‌రిచేసుకోవాల‌న్నఆత్రం ప్ర‌త్య‌ర్ధిలో మొద‌లౌతుంది. అంతే వెంట‌నే ప్ర‌త్య‌ర్ది వారు వెంట‌నే త‌మ పార్టీలో 22 కుటుంబాలు చేరాయ‌ని, త‌మ పార్టీ  కండువాలు  వేసి హ‌మ‌య్య అనుకుంటారు. అయ‌తే ఇలా ఆయా పార్టీల‌లో చేరుతున్న వారిలో కొంత‌మంది  సొంత‌పార్టీ మ‌నుషులే కావ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తుంది. రాను ఇదో త‌ర‌హ వేలం వెర్రి ప్ర‌క్రియ‌గా మారిపోవ‌డంతో ఎవ‌రు ఏ పార్టీలో చేరినా, పార్టీలు మారినా ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవడం మాని వేశారు. అయినా పార్టీని బ‌లోపేతం చేయ‌డం అంటే ఇలానా అని ఆయా పార్టీల సీనియ‌ర్లు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. 
-------------------



Next
This is the most recent post.
Previous
Older Post
Axact

చిలకలూరిపేట న్యూస్

నిజం.. నిష్పక్షపాతం మా నైజం నిగ్గు తేల్చే నిజాల కోసం.. నిక్కచ్చైన విశ్లేషణల కోసం

Post A Comment:

0 comments: