నెరవేరిన మాజీమంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సంకల్పం

ఎన్‌ టీఆర్‌ నగర్‌–టిడ్కో  గృహ సముదాయంలో సకల సౌకర్యాలు

ప్రైవేటు బ్యాంకుల నుంచి రుణ సదుపాయానికి విశేష స్పందన..

సమస్యల పరిష్కారానికి కమిటీల ఏర్పాటు..

నూతన గృహ ప్రవేశాలతో సందడిగా మారిన టిడ్కో గృహ సముదాయం





చిలకలూరిపేట: 

రాష్ట్రానికే ఆదర్శంగా ఎన్‌ టీఆర్‌ నగర్‌– టిడ్కో గృహ సముదాయాన్ని తీర్చిదిద్దేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.  పేదలకు సొంతింటి కల సాకారం చేసే దిశగా  52.6 ఎకరాల సువిశాలమైన భూమిలో 5520 మంజూరు చేయించారు. ఇందులో 4512 ఇళ్లను పూర్తి  చేసి అప్పట్లోనే గహ ప్రవేశాలు కూడా చేయించారు.  1008 ఎప్రిల్‌ నెల చివరిలో పూర్తిగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే నాడు మంత్రిగా ఉన్న సమయంలో  ఇళ్ల మంజూరు చేయించి, నిర్మాణాలు కూడా పూర్తి చేసుకున్న ఇళ్ల సముదాయంలో   తిరిగి ఎమ్మెల్యేగా ప్రత్తిపాటి పుల్లారావు గెలుపొందిన అనంతరం మాత్రమే సకల సదుపాయలు కూరుతున్నాయి. బ్యాంకుల నుంచి రుణమంజూరు నిలిచిపోవడటంతో ప్రైవేటు బ్యాంకుల ద్వారా రుణాలు కూడా ఇప్పించటంతో టిడ్కో గృహాల లబ్దిదారుల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది. 

  గృహ సముదాయంలో సకల సౌకర్యాలు.. 



గతంలో 2014లో టీడీపీ ప్రభుత్వం పేదలకు సొంతిళ్లు అందించి వారి కలలను నిజం చేయాలనే  సదాశయంతో  కేంద్రప్రభుత్వ సహకారంతో పట్టణంలోని 52 ఎకరాల్లో  టిడ్కో గహాల నిర్మాణం చేపట్టింది.  4512 ఇళ్లు పొందిన వారికి  రిజిస్ట్రేషన్‌ కూడా  చేయించారు  80 నుంచి 90శాతం వరకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి రాజకీయాలకు అతీతంగా..ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో డ్రా తీసి లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందచేయడం జరిగింది. కాని ప్రభుత్వం మారిన అనంతరం పరిస్థితి మారి పోయింది. ఈ ప్రాంతంలో మౌలిక వసతులు కరువ్వడంతో  సుమారు 1500 మంది మాత్రమే నివాసం ఉండసాగారు. కూటమిప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే  మాజీ మంత్రి, ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే టిడ్కో గహాల సదుపాయాలు, వసతుల కల్పనపై ప్రత్తిపాటి పుల్లారావు దష్టి సారించారు. రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణను కూడా ఈ ప్రాంతానికి తీసుకువచ్చి, స్థానికంగా ఉన్న టిడ్కో గహ లబ్దిదారులను ప్రత్యక్షంగా చూపారు. దీంతో  అసంపూర్తిగా ఉన్న టిడ్కో గహాల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.  గతంలో దెబ్బతిన్న ఇళ్లకు మరమ్మతుల చేయించారు. ఈ ప్రాంతంలో  మౌలిక వసతుల కల్పనతోపాటు.. ప్రార్థనామందిరాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సచివాలయ భవనాలు, కులవత్తుల వారికి ప్రత్యేక గదులు, శ్మశానాల ఏర్పాటు వంటివి టిడ్కో గహ సముదాయం వద్ద చేపట్టారు. జిల్లా విద్యాశాఖాధికారితో మాట్లాడి ప్రాధమిక పాఠశాలను ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయనున్నారు.  రాకపోకలకు ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతో ఆటో యూనియన్‌ నాయకులతో సంప్రదించి టిడ్కో గహసముదాయం నుంచి ఎన్‌ఆర్‌ టీ సెంటర్‌ వరకు రూ. 20 చార్జీగా నిర్ధారించారు. వైఎస్సార్‌ కాలనీ నుంచి టిడ్కో గహసముదాయం వరకు రాత్రి వేళల్లో నిరంతరం విద్యుత్‌ సరఫరా జరిగేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో అసాంఘీక కార్యక్రమాలను కట్టడికి 24 గంటలు పనిచేసే విధంగా పోలీస్‌ పికేట్‌ ఏర్పాటు చేయించారు.  సీఎస్‌ఆర్‌ నిధుల కింద  ఓఎ¯Œ జీసీ సంస్థ సహకారంతో అసిస్ట్‌ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత తాగునీటి ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ ప్రాంతంలోనే రేషన్‌ డిపోను ప్రారంభించనున్నారు. ఈ ప్రాంతంలో ఉండి దుకాణాలు ఏర్పాటు చేసుకొనే వారి కోసం మున్సిపాలిటీ తరుఫున దుకాణాల నిర్మాణించటంతో పాటు, వారు వ్యాపారాలు నిర్వహించుకోవడానికి రుణసదుపాయం కల్పిస్తున్నారు. 

ప్రైవేటు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం..



అనేక కారణాలతో టిడ్కో సముదాయంలో ఉన్న లబ్దిదారులకు రుణ సౌకర్యం కల్పించలేదు. సంవత్సరాల తరబడి సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. మొత్తం 520 లబ్దిదారులకు రుణ సదుపాయం నిలిచిపోయింది.  బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసినా  ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వారి నిబంధనల మేరకు రుణాలు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో యుద్ద ప్రాతిపదికన అద్దె ఇళ్లలో మగ్గుతున్న వారి కష్టాలను పరిగణలోకి తీసుకొని ప్రత్తిపాటి పుల్లారావు ప్రైవేటు బ్యాంకులను సంప్రదించటంతో వారు అంగీకారం తెలిపారు.  ఈజీ హౌసింగ్‌ ఫైనా¯Œ ్స, ఐ.ఐ.ఎఫ్‌.ఎల్‌ ఫైనాన్స్‌ సంస్థలు టిడ్కో లబ్ధిదారులకు రుణాలి వ్వడానికి ముందుకు రావడంతో ఈ ప్రక్రియ వేగవంతమైంది. ప్రారంభించిన అనతి కాలంలోనే  ఇప్పటి వరకు 72 మంది లబ్దిదారులకు రుణసదుపాయం కల్పించారు. 

సమస్యల పరిష్కారానికి కమిటీల ఏర్పాటు... 

స్థానికంగా ఎదురయ్యే సమస్యలు పరిష్కరించుకోవడానికి టిడ్కో గహ లబ్దిదారులతో కమిటీలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ప్రతి అపార్ట్‌మెంట్‌కు ఒకరు చొప్పున కమిటీ సభ్యులుగా , మొత్తంకమిటీ సభ్యులు కలసి చైర్మ¯Œ ను ఎన్నుకోనున్నారు. దీని వల్ల ఆయా ప్రాంతాల్లో నొలకొన్న సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించుకొనే వీలు కలుగుతుందని భావిస్తున్నారు. 

టిడ్కో సముదాయంలో సందడి.. 



ఎన్‌ టీఆర్‌ నగర్, టిడ్కో గృహ సముదాయంలో సకల సదుపాయాలు కలగజేస్తూ ఉండటం, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ రఫాని, కూటమి నేతలు నిరంతర పర్యటనలు, రుణ సదుపాయం కల్పించటంతో అనేక మంది లబ్దిదారులు ఇళ్లలోకి గహ ప్రవేశాలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో సందడి నెలకొంది. వచ్చే ఉగాది నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిడ్కో ఇళ్లను  లబ్ధిదారులకు కేటాయించాలనే కత నిశ్చయం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అడుగులు వేస్తున్నారు.  మొత్తం 5,520 ఇళ్లల్లో  ఏప్రియల్‌ నాటికి గహప్రవేశాలు జరిగేలా కార్యాచరణ చేపట్టారు.   ఇళ్లు పొందిన లబ్ధిదారులు వాటిలో నివాసముండకపోతే.. వారు అర్హులైన ఇతరులకు వాటిని అప్పగించటానికి సిద్దమౌతున్నారు. . నివాసం ఉండకపోతే నీటి పంపులు, మరుగుదొడ్లు, పైపులు, ఎలక్ట్రిక్‌ వ్యవస్థ పాడవతాయని, ప్రభుత్వంపై అదనపు భారం పడకూడదని, నిజమైన లబ్దిదారులకు కేటాయించాలని యోచిస్తున్నారు. 

మొత్తం మీద మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సంకల్పం నెరవేరనుంది.పేదల సొంతింటి కల సాకారం కానుంది. 


 


 

Next
This is the most recent post.
Previous
Older Post
Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: