చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అధికారులకు పరిపాటిగా మారుతుంది. విపత్కర పరిస్థితులు చెప్పిరావు. కాని చిన్న పాటి అప్రమత్తత ప్రజలకు భరోసా కల్పిస్తుంది. ఒకటి రెండు రోజుల్లో వర్షాలు మొదలు కానున్నాయి. పట్టణంలో గమ్యం లేని కాల్వలు, కాల్వలను ఆక్రమించుకొని కట్టిన భవనాలు, పూడికలు తీయక వదిలివేయటం, శిధిలమైన కాల్వలతో ప్రజల జీవణ విధానం అస్తవ్యస్థమౌతుంది. చిన్నపాటి వర్షానికే కాల్వల ద్వారా పట్టణానికి దూరంగా వెళ్లిపోవల్సిన వరద నీరు రోడ్లపైకి, లోతట్టు ప్రాంతాలల్లో ఇళ్లలోకి ప్రవేశించటం ఇక్కడ పరిపాటిగా మారుతుంది. వర్షాలు మొదలు అయిన వెంటనే డ్రైన్లలో పూడికలు తీయించటానికి బయలు దేరి అధికారులు ముందుగానే పరిస్థితి అంచానా వేసి అప్రమత్తం అవ్వటం అనేది లేకుండా పోయింది.
ఒక సంఘటన నుంచి పాఠాలు నేర్చుకొని ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిన తరుణంలో చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం సర్వసాధారణం.
2013 అక్టోబర్‌లో వచ్చిన అకాలవర్షాలు పట్టణాన్ని ముంచెత్తాయి. జనజీవనం అస్థవ్యస్థమైంది. పట్టణ నడి బొడ్డున గడియారస్థంబం సెంటర్, మార్కెట్ సెంటర్‌లో సైతం వర్షపు నీరు దుకాణాల్లో చేరి లక్షలాది రూపాయాల నష్టం మిగిల్సింది. లోతట్టు ప్రాంతాలల్లో గుడిసెలు నీట మునిగి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. చిన్న వర్షానికే వర్షపునీరు రోడ్లపై నిలవటానికి కారణం ఎవరైనా రానున్న వర్షకాలంను దృష్టిలో ఉంచుకొని కాల్వల్లో పూడికలు తీయటం, వర్షపునీరు పారుదలకు అడ్డంకులు లేకుండా చూడటం మున్సిపల్ అధికారుల కనీస బాధ్యత.


Post A Comment:
0 comments: