మరికొన్ని రోజుల్లో మున్సిపల్ పాలన ముగియనుంది. మనం ఎన్నుకున్న మున్సిపల్ కౌన్సిలర్లు ఆయా వార్డుల్లో ఎం చేశారు..? చేయాలనుకొని నిలిచిపోయినపనులు ఏవి..? ప్రజా సమస్యలపై అతను స్పందించే తీరు ఎలా ఉంటుంది..? ఇలా 34వార్డుల సమగ్ర కథనాలు మీకు అందజేస్తున్నాం. ఇందులో భాగంగా పట్టణంలోని ఐదో వార్డు పై ప్రత్యేక కథనం.
అతను ప్రశ్నించే ప్రజల గొంతుకు స్వరంగా నిలుస్తాడు. సమస్యలు ఎక్కడుంటే అక్కడ వాలిపోతాడు. ఆ సమస్య పరిష్కారం అయ్యేవరకు నిద్రపోదు. అనునిత్యం ప్రజలతో మమేకమై నిలిచే వ్యక్తి షేక్ అబ్దుల్‌రౌఫ్. పట్టణంలోని ఐదో వార్డుకు ఒక ప్రత్యేకత ఉంది. అత్యధిక మంది ముస్లింమైనార్టీలు నివసించే ప్రాంతం ఇది. ఈ వార్డు నుంచి చిలకలూరిపేట మున్సిపాలిటికి వైఎస్సార్ సీపీ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న రౌఫ్, మున్సిపల్ డిప్యూటి ఫ్లోర్‌లీడర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. రౌఫ్‌ది విలక్షణమైన శైలీ. వార్డు పరిధిలోగాని, పట్టణంలోగాని ఏదైనా సమస్య వస్తే అందరిలా ఆ సమస్య పరిష్కరించాలని వెంటనే అధికారులను విజ్ఞప్తి చేయరు. ఆ సమస్య పూర్వపరాలు గురించి పూర్తిగా అధ్యయనం చేస్తారు. అప్పుడే ఆ సమస్యపై పోరాడతారు. ఆ పోరాటం అధికారులకు విజ్ఞప్తి మొదలుకొని, న్యాయపోరాటం వరకు కొనసాగుతుంది.
గత మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరుపున షేక్ అబ్దుల్ రౌఫ్ కు 841 ఓట్లు లభించగా సమీప ప్రత్యర్ధి టీడీపీకి చెందిన షేక్ కమాల్‌బాషా కు 778 ఓట్లు లభించాయి. దీంతో 63 ఓట్ల మెజార్టీతో రౌఫ్ విజయం సాధించారు. అనంతరం పార్టీ ఆయనకు మున్సిపల్ డిప్యూటి ఫ్లోర్ లీడర్‌గా అవకాశం కల్పించింది. వార్డు పరిధిలో ప్రజలకు ఏ సమస్య ఉన్నా ఆయన అండగా ఉండేవారు. పారిశుధ్యం, తాగునీటి సమస్య, రోడ్లు, కల్వర్ట నిర్మాణం, వీధి దీపాలు ఇలా ఏ సమస్య ఉన్నా అందుబాటు ఉండి పరిష్కరించేవారు. ప్రతిపక్షంలో ఉన్నా అర్హులకు రేషన్‌కార్డులు, ఫించన్ కోసం అధికారులతో పలు సందర్బాలలో ఘర్షణకు దిగిన సంఘటనలు కోకొల్లలు.వార్డులో మంచినీటి సమస్య శాశ్విత పరిష్కారం కోసం జాకీర్‌హుస్సేన్ వీధిలో మూడు బజార్లకు పైపులైన్ ఏర్పాటు చేయించారు. మొత్తం వార్డు పరిధిలో రూ. 30 లక్షల మేర అభివృద్ది పనులు చేపట్టారు. వార్డు పరిధిలో మంజూరైన సీసీరోడ్డు ఎన్నికల కోడ్‌తో నిలిచిపోయి ఉంది. దానిని పూర్తి చేయించటానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.
మున్సిపల్ డిప్యూటి ఫ్లోర్ లీడర్‌గా కూడా అబ్దుల్ రౌఫ్ చురుకైన పాత్ర పోషించారు. మున్సిపల్ సమావేశాలలో అధికారులను, ఇటు పాలక పక్షాన్ని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేవారు. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం, నిర్మాణాత్మక చర్చ కోసం పట్టుబట్టేవారు. డంపింగ్ యార్డులో అనుమతిలేని కొబ్బరిపీచు పరిశ్రమను నిలిపివేయటానికి కృషి చేశారు. పట్టణంలో షిల్ట్‌తీత పేరుతో జరిగిన అవినీతిని, రెవిన్యూ సెక్షన్‌లో బిల్లుల మాయంపై, చెరువుకు నీళ్లు నింపే విషయంలో జరిగిన అవినీతిపై, ట్యాంకర్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై రౌఫ్ రాజీలేని పోరాటంమే చేశారు.
తాను చేసిన అభివృద్ది కార్యక్రమాలు, ప్రజలకు చేసిన సేవ, తిరిగి మున్సిపల్ ఎన్నికల్లో తనకు విజయం అందిస్తాయని రౌఫ్ నమ్ముతున్నారు.



Post A Comment:
0 comments: