ఇప్పుడు దేశమంత‌టా కొత్త ట్రెండ్ న‌డుస్తుంది. ఆ ట్రెండ్‌ను చిల‌క‌లూరిపేట ఫాలో అవుతుంది. డిజిట‌ల్ మీడియా ప‌దం గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా వినిపిస్తున్నా..క‌రోనా వ్యాప్తి, లాక్‌డౌన్ స‌మ‌యంలో  మ‌రింత విస్తృత‌మైంది. అవ‌ధులులేని వార్త‌లు, స‌మాచారం మ‌న క‌ళ్ల‌ముందు అవిష్కృత‌మౌతుంది. అవును ఇప్పుడు చిల‌క‌లూరిపేట‌లో డిజిట‌ల్ మీడియా హ‌వా న‌డుస్తుంది.  

ఎన్నిక‌ల ముందు వేళ్ల‌మీద లెక్క‌పెట్టుకొనే విధంగా ఉండే న్యూస్‌వెబ్‌పోర్ట‌ర్లు నేడు విస్త‌రించాయి. లాక్‌డౌన్ స‌మ‌యంలో మెయిన్‌స్ట్రీమ్ మీడియా స్థానిక వార్త‌ల విష‌యంలో ప‌రిమితులు విధించ‌టం, ప‌త్రిక‌ల విష‌యంలో జోన్‌,టాబ్లాయిడ్‌లు తీసివేయ‌టంతో ఆ స్థానాన్ని డిజిట‌ల్ మీడియా అక్ర‌మించింది. నియోజ‌క‌వ‌ర్గంలోని స‌మాచారం, సంఘ‌ట‌న‌లు  అప్ప‌టి  వార్త‌లు అప్ప‌టిక‌ప్పుడు అంద‌జేయ‌టంతో స్థానిక వీక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందాయ‌ని చెప్ప‌వ‌చ్చు. దీంతో పాటు విదేశాల్లో ఉండే చిల‌క‌లూరిపేట వాస్త‌వుల‌కు త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌న్న ఆస‌క్తి కూడా వెబ్‌పోర్ట‌ల‌కు ఆద‌ర‌ణ పెర‌గ‌టానికి కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. 

దేశంలో https://thewire.in/‌, అంత‌ర్జాతీయంగా https://wikileaks.org ఎంత‌టి మ‌న్న‌న‌లు పొందాయో అందరికి తెలిసిందే. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో  రాని అనేక స‌మ‌స్య‌లు వెలుగులోకి తెచ్చాయి. స్థానికంగా ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో న‌డుస్తున్న వెబ్‌పోర్ట‌ర్ల‌తో లాభం , న‌ష్టం కూడా ఉంది.  ఈ వెబ్‌సైట్ల‌లో వ‌చ్చే వార్త‌ల‌కు విశ్వ‌స‌నీయ‌త ముఖ్యం. గాలిక‌బూర్లు, వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు తావివ్వ‌కుండా వీటిని న‌డ‌పాల్సి ఉంటుంది. త‌ప్పుడు స‌మాచారం వ‌ల్ల అనేక ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశం ఉంది. మెయిన్‌స్ట్రీమ్ మీడియా నుంచి మ‌న‌కు చేరే వార్త‌ల్లో వ‌డ‌పోత ఉంటుంది. స‌బ్ ఎడిట‌ర్‌, ఎడిట‌ర్ వ‌ర‌కు ప్ర‌చురించే వార్త ఎడిటింగ్ చేయ‌బ‌డి ప్ర‌చురించ‌బ‌డుతుంది. వెబ్‌సైట్‌ల‌లో ఆ వెస‌లు బాటు ఉండ‌దు. ఇక్క‌డ స్వ‌యం నియంత్ర‌ణే ముఖ్యం. వెబ్‌సైట్ న‌డిపే వ్య‌క్తికి వార్త‌ల విష‌యంలో క‌నీస ప్ర‌ధామిక అవ‌గాహ‌న అవ‌స‌రం. 

కొన్ని మార్పులు అనివార్యం . వ‌స్తున్న మార్పుల‌ను కంట్రోలు చేయ‌టం క‌ష్టం. నియోక‌వ‌ర్గంలో న‌డుస్తున్న వెబ్‌సైట్ల మ‌నుగ‌డ‌ .విశ్వ‌స‌నీయ‌తే గీటురాయి.అటువంటి వెబ్‌సైట్లే ప్ర‌జ‌ల‌కు చేరువౌతాయి. స‌రైన స‌మాచారం, వార్త‌ల‌ను అందించే విష‌యంలో వేగం వెబ్‌సైట్ల నిర్వ‌హ‌ణ‌లో ముఖ్యం. 


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

1 comments: