కరోనా మన కుటుంబాల్లో ఒక విస్పోటనాన్ని, విద్వాంసాన్నిసృష్టిస్తోంది. 'కరోనా వైరస్' రోజూ పలు కుటుంబాల్లో విషాదం నింపుతోంది. నియోజకవర్గం ఇప్పుడు కోవిడ్ -19 వైరస్ గుప్పిట చిక్కుకొని ఉంది. చిలకలూరిపేటలో చాలా మంది తీవ్ర ముప్పులో ఉన్నారు.రాజూ.. పేదా తేడా లేదు. ప్రాంతం.. పరిధీ లేనేలేదు.కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తున్నది. కరోనా నివారణలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న పోలీసులు, వైద్యులు, పారిశుధ్య సిబ్బంది, జర్నలిస్టులు కూడా కరోనా బారిన పడ్డారు.
లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలోనే నియోజకవర్గంలో కరోనా వ్యాప్తి శరవేగంగా కొనసాగుతోంది. కుటుంబాలకు కుటుంబాలు కరోనా బారిన పడుతున్నాయి. ఉదాహరణకు గత రెండు రోజలు నుంచి నియోజకవర్గంలో పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్న పరిణామాలు వైరస్ వ్యాప్తి తీవ్రతకు అద్దం పడుతోంది. తాజాగా శుక్రవారం పట్టణంలో 8 కేసులు నమోదయ్యాయి. ఒక్కప్పుడు ఎక్కడో ఒక చోట కేసు నమెదు అయితే ఫలానా చోట కరోనా వచ్చిందంటా అని ఆ చుట్టుపక్కలకు వెళ్లటానికి ప్రజలు భయపడేవారు. ఇప్పుడు కరోనా నియోజకవర్గంలోని ప్రతి వాడను చుట్టేసింది. ప్రతి పల్లే దీని బారిన పడింది. ఈ తీవ్రత ఇప్పట్లో తగ్గేలా లేదు.
ఈ పరిస్తితి మనకే వస్తే...
ఎప్పుడు భయపడకూడదో కాదు, ఎప్పుడు భయపడాలో కూడా తెలియాలి. కరోనా ఇన్‌ఫెక్షన్ (కొవిడ్-19) విషయంలో ఇప్పుడిలాంటి భయమే కావాలి. కాని ప్రజల్లో భయం మరోలా ప్రస్పుటమౌతుంది. ఇప్పుడు ఎవరైనా సాధారంగా చనిపోయినా ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. చనిపోయిన మనిషి ఎవరైనా సరే గౌరవంగా సాగనంపటం, అంతిమ వీడ్కొలు పలకటం మన సాంప్రదాయం, సంస్కృతి. ఇప్పుడు ఆ విలువలు కోల్పోయారు.కనీసం పాడే మోయటానికి కూడా నలుగురు రాని దుస్థితి. మరో వైపు అసలు భౌతికకాయం తమ వాడల్లో వద్దని ప్రజలు ఎదురుతిరగటం, అనాధ శవాల్లో మున్సిపాలిటి, పంచాయతీ వారు తీసుకువెళ్లటం అనాధశవాల్లా మనకు తెలిసిన వారిని సాగనంపటం ఎంతటి దయనీయం. ఈ ఆలోచనా ధోరణి మారాలి. కరోనా మహమ్మారి ఎవరికైనా సోకవచ్చు. ఎవరో ఒకరో మన కుటుంబ సభ్యులో, మిత్రుల్లో కరోనా బారిన పడి మరణిస్తే ఇలాగే ప్రవర్తిస్తామా,.. అలోచించండి..మనం తీసుకొనే జాగ్రత్తలే కరోనా వ్యాప్తి నివారణకు మందు . ఈ దిశగా చర్యలు తీసుకుందామా.. ప్రభుత్వం, అధికారులు చెప్పే సూచనలు పాటిద్దామా...:!.


Post A Comment:
0 comments: