నిశబ్దవాతావరణం భయపెడుతుంది. ఉరుకుల పరుగుల జీవితం స్థంబించి పోయింది. వాహనాల రణ గొణ ధ్వనులు వినిపించటంలేదు.పోలీసు, అంబులెన్స్‌ల సైరన్లు, పోలీసు, వివిధ శాఖల అధికారుల హెచ్చరికలు ఇవే ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యాలు. మనం ఏదైతే మనదరికి రాకుడదని ఆశించామో.. చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా తాలుకూ ఒక్క పాజిటివ్ కేసు లేకుండా చూసుకోవాలనుకున్నామో అది విఫలమైంది . మన ఆశలు అడి ఆశలయ్యాయి. పట్టణంలోని కళామందిర్‌సెంటర్ ,శివాలయం వీధిలో మొదటి పాజిటివ్ కేసు నమోదైంది. ఇప్పుడే అత్యంత జాగ్రత్త అవసరం. ఇప్పుటి వరకు అధికారులు చేసిన ప్రయత్నాలు, ప్రజల అప్రమత్తత ఒక ఎత్తైతే, అసలు కథ ఇప్పుడే మొదలైంది.
కరోనా వ్యాప్తి చెందకుండా నియోజకవర్గ ప్రజలు ఒక్కటై నిలవాల్సిన అవసరం ఏర్పడింది. మరోక పాజిటివ్ కేసు చిలకలూరిపేటకు సోకకుండా ఉండాలంటే కొన్ని కష్టాలు , ఇబ్బందులు, కొన్ని త్యాగాలు అవసరం. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు మరిన్ని కష్టాలు వెంటాడనున్నాయి. పోలీసులు, వైద్యసిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, ఇతర శాఖల అధికారులు తమ కుటుంబాలను త్యాగం చేసి రోడ్లకే పరిమితమవుతున్నారు. కొంతమంది అధికారులైతే లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి ఇంటికే వెళ్లకుండా ఎక్కడో ఒక చోట తలదాచుకొని , ఏదో తింటూ ప్రజాసేవలోనే పరిమితమౌతున్నారు. ఇక్కడ ఎవరూ ఎక్కువ కాదు.. ఎవరూ తక్కువ కాదు . లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రతి అధికారి, మన ఎమ్మెల్యే విడదల రజని ప్రతి నిత్యం ప్రజల కోసమే పరితపిస్తున్నారు. వారు మన నుంచి కోరుతుంది ఒక్కటే అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండటమే. ఇందుకు ఎవరికివారు స్వీయ నియంత్రణ పాటించటమే.
చివరగా మరోక్క విషయం.. కరోనా ఎప్పుడు ఎలా వ్యాప్తిస్తుందో తెలియదు. కరోనా సోకగానే కొంపలు మునిగిపోయినట్లు, తమ జీవితాలు అంతమైనట్లు భావించటం తగదు. వ్యాధి సోకి చనిపోతున్న వారి కన్నా కోలుకొని ఆరోగ్యంతో బయటకు వస్తున్న వారే ఎక్కవ. కరోనా సోకిన వ్యక్తిపట్ల, వారి కుటుంబ సభ్యుల పట్ల కూడా కొంతమంది వివక్షతో వ్యవహరించటం మానవత్వం అనిపించదు. అదే విధంగా పాజిటివ్ సోకిన పరిసర ప్రాంతాల వారిని ఇంటికే పరిమితమవ్వాలని వైద్య అధికారులు సూచిస్తారు. అలా వారిపట్ల వివక్ష చూపటం సరికాదు. ఆశావాదా దృక్పధంతో ఉంటే కరోనా కాదు మరో ఎటువంటి విపత్తులైనా ధైర్యం ఎదుర్కొవచ్చు. ఆ ధైర్యం మీకు ఉందా..


Post A Comment:
0 comments: