అధికారులు పనులు చేయటం లేదని ఛైర్‌పర్సన్ ఆవేదన..
ఫించన్ల పంపిణి విధానంలో లోపాలపై కౌన్సిలర్ల నిలదీత
చిలకలూరిపేట మున్సిపల్ సమావేశం ఎప్పటిలాగే పేర్కొన్న సమయం కంటే ఆలశ్యంగా నే ప్రారంభమైంది. నాలుగున్నర సంవత్సరాల కాలంలో తాను సూచించిన అనేక సమస్యలు పరిష్కారం కాలేదని ఛైర్‌పర్సన్ గంజి చెంచుకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ఏ వార్డుపై తనకు చిన్న చూపులేదని , 34 వార్డుల్లో పనులు చేయాలని చెబుతున్నా అధఙకారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. రానున్న మున్సిపల్ సమావేశం లోగా గడియారస్థంబం పునరుద్దన పనులు ప్రారంభించాలని లేకుంటే తనతో పాటు 34 మంది కౌన్సిలర్లు సమావేశానికి రామని హెచ్చరించారు. ఫించన్ల పంపిణి లో ఆలశ్యం జరుగుతుందని, వేలి ముద్రలు పడని వారికి ఫించన్లు నిలిపివేస్తున్నారని వైసీసీ కౌన్సిలర్లు ఆరోపించారు.
ఆస్తిపన్ను పెంపు వలన సామన్యులు ఇబ్బంది పడే అవకాశం ఉందని టీడీపీ కౌన్సిలర్ తెలిపారు. ఇందుకు మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు మాట్లాడుతూ ఫించన్లపంపిణి 98 శాతం పూర్తి చేస్తున్నామని , ఇళ్లకు వెళ్లి ది్వ్యాంగులకు ఫించన్లు పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. వేలిముద్రలు పడపోయినా తగిన ధృవీకరణ పత్రాలు తీసుకొని ఫించన్లు అందజేస్తున్నట్ల తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం జియోలాజికల్ సర్వే జరిపి గతంలో కన్నా మెరుగ్గా , నిక్కచ్చిగా భవనాల కొలతను బట్టి పన్నుల విధింపు జరుగుతుందన్నారు. మొత్తం సమావేశంలో పలు ప్రజా సమస్యలపై చర్చించారు. ఇటీవల పార్టీ మారిన విడదల లక్ష్మినారాయణ వైసీసీ కౌన్సిలర్ల వైపు కూర్చోవటం ఆసక్తిగా మారింది. సమావేశంలో మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ నజిరున్సీసాబేగం, వైసీసీ ప్రతిపక్ష నాయకుడు నాయుడు వాసు, అన్ని వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.




Post A Comment:
0 comments: