బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలోనటుడు,టీడీపీ నాయకుడు,పొలిట్ బ్యూరో సభ్యులు నందమూరి హరికృష్ణ కు చిలకలూరిపేట టీ డీపీ కార్యాలయంలో గురువారం అభిమానులు, నాయకులు, కార్యకర్తలు శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతికలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కరిముల్లా,రాజేష్ నాయుడు, రెహ్మాన్, సమద్ ఖాన్, సదాశివరావు, భక్తవత్సలం,ముద్దన నాగేశ్వరరావు,గంజి మోహన్,అజారుద్దీన్, రసూల్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులున్నారు.హరికృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)

Post A Comment:
0 comments: