సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది... ప్రతి విషయాన్ని తమ పార్టీకి అనుకూలంగా మలుచుకోవటంతో రాజకీయపార్టీలు సమాయుత్తం అవుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్దంతిని నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ సమన్వయ కర్త విడదల రజని, మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రిరాజశేఖర్ లు వేర్వేరుగా పోటాపోటీగా నిర్వహించారు. ఇరువర్గాల ర్యాలీలు ,అన్నదాన కార్యక్రమాలు కొనసాగాయి.
ఇక్కడే ఆసక్తికరమైన అంశం వెలుగుచూసింది. ఈ ర్యాలీలు, కార్యక్రమాలకు సంబంధించిన విశేషాలను రెండు బృంధాలుగా వచ్చిన సర్వే టీములు రికార్డు చేయటం , తటస్తుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.సాదారణంగా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగినప్పుడు ప్రభుత్వ నిఘా వర్గాలు సమాచారాన్ని పంపటం సహజమే. ఎంత మంది హాజరయ్యారు. పాల్గొన్నవారి పేర్లు, నాయకుల వివరాలు ఇలా వారి సమాచారాన్ని సేకరించటం జరుగుతుంది. కాని వైసీసీలో ఉన్న రెండు వర్గాల కు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది ఎవరు...? ఎందుకు సేకరించారు ,. ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
Post A Comment:
0 comments: