చిలకలూరిపేట నియోజకవర్గానికి అత్యంత కీలకమైనది పట్టణం. నియోజకవర్గానికి కేంద్రంగా ఉన్న పట్టణం ఏ అభివృద్దికి నోచుకోకపోయినా ఆ ప్రభావం మొత్తం నియోజకవర్గంపై పడే అవకాశం ఉంది. ఒక్కప్పడు ఇదే పట్టణంలో రోడ్లు గోతుల మయంగా ఉండి తటాకాలను తలపింపచేసేవి. పారిశుధ్యం అటకెక్కి చిన్న వర్షం కురిసినా పేద ప్రజలు ఆసుపత్రుల పాలయ్యేవారు. ఇళ్లలోకి వర్షపునీరు, మురుగునీరు వచ్చే చేరేవి. కాని ఇదంతా గతం. కాని నేటి పరిస్థితి పూర్తి భిన్నం . ఒకవైపు పట్టణౄభివృద్దికి నిదులు తీసుకురావటానికి రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక శ్రద్ద చూపితే ఆ నిధులను ప్రధాన్యత క్రమంలో వెచ్చించటానికి కౌన్సిల్ ,అధికారుల సమన్వయ కృషి అవసరం. ఎక్కడ చిన్న తప్పు జరిగినా ఉన్న ఆ ప్రభావం పట్టణాభివృద్దిపై పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో పట్టణాభివృద్దిలో కీలకంగా ఉన్న మున్సిపల్ కమిషనర్ నామా కనకారావుతో ముఖాముఖి.....
కమిషనర్ సవాల్ ...
పట్టణాభివృద్ది విషయంలో విపక్ష వైసీసీ కౌన్సిలర్ల వార్డులపై చిన్నచూపు చూసారన్న ఆరోపణలు వస్తున్నాయి. పలు మున్సిపల్ సమావేశాలలో ఇదే అంశంపై వైసీసీ కౌన్సిలర్లు ఆరోపణలు సంధించారు. ఈ విషయంపై కమిషనర్ నామా కనకారావు స్పందిస్తూ ....
ఏ వార్డు విషయంలో తాను విపక్ష చూపటం జరగలేదన్నారు. పట్టణంలో ఉన్న 34 వార్డులు కూడా తనకు ఒకటే నని , ఆయా వార్డుల సమస్యల ప్రాధాన్యత క్రమంలో అభివృద్ది చేస్తున్నట్లు వివరించారు.విపక్ష సభ్యులు చేస్తున్న ఆరోపణలు వాస్తవ విరుద్దమన్నారు. ఆయా వార్డుల సంబంధించిన అభివృద్దిపై తన వద్ద సమాచారం ఉందని , అలా కాదని ఏవరైనా ఆరోపిస్తే నిరూపించటానికి సిద్దంగా ఉన్నానని సవాలు చేశారు.
ఛైర్‌పర్సన్‌తో విభేదాలు లేవు....
మున్సిపల్ ఛైర్‌పర్సన్‌తో తనకు ఎటువంటి విభేదాలు లేవని కమిషనర్ స్పష్టం చేశారు. అటు వంటి విభేదాలే ఉంటే పట్టణాభివృద్ది సాధ్యపడేదా... అని ప్రశ్నించారు.
విద్యలో పురోగతి ...
గతం కన్నా మిన్నగా విద్యకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించటంతో విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలలో చేరటానికి ఆసక్తి చూపుతున్నారని ,తల్లిదండ్రులు సైతం పాఠశాలకు వచ్చి స్వయంగా పరిశీలించి మరి తమ పిల్లలను పాఠశాలల్లో చేరుస్తున్నరని వివరించారు.గత విద్యాసంవత్సంలో 1220 మంది విద్యార్ధులు మాత్రమే ఉండగా ఈ ఏడాది ఇందుకు రెట్టింపుస్థాయిలో 3వేలమంది విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 10 కి పది గ్రేడ్ పాయింట్లు కూడా సాధించి కార్పోరేట్ పాఠశాలలకు తీసిపోని విధంగా విద్యబోదన కొనసాగుతుందని పేర్కొన్నారు.
పారిశుధ్య నిర్వహణకు ప్రధమ ప్రాధ్యాన్యత...
తాను చిలకలూరిపేటకు బదలిపై వచ్చే సమయంలో పారిశుధ్యానికి ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నానని కమిషనర్ నామా కనకారావు పేర్కొన్నారు. పట్టణంలో పూర్తిస్తాయిలో పరిశీలన జరపటం, గతంలో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకొన్నామని తెలిపారు. మురుగునీటి వ్యవస్థ అస్థవ్యస్థంగా ఉండేదని, పట్టణంలోని మురుగునీరు వెలుపలికి వెళ్లకుండా పట్టణంలోని పల్లెపు ప్రాంతాలకు ప్రవహించే దన్నారు.ఈ క్రమంలోనే పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవటంతో ప్రజలు అంటువ్యాధుల బారిన పడ్డారు. ఈక్రమంలోనే యజ్ఞంలా బావించి పనులు పూర్తి చేయబట్టే గతం తాలుకు కష్టాల నుంచి విమూక్తి లభించిందని తెలిపారు.
కౌన్సిల్ పూర్తి సహకారం
కౌన్సిల్ సభ్యులు అందరి సహకారం అందించారని ,ఇటువంటి సహకారంతో చిలకలూరిపేట పట్టణాభివృద్ది సాధ్యమైందన్నారు. వారికి తన కృతజ్ఞతల తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు వెంటనే పరిష్కరించటానికి అత్యధిక ప్రధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు కొనసాగనున్నాయని తెలిపారు.



Post A Comment:
0 comments: