ఎన్నికల వస్తున్నాయి. నాయకులు కొత్త కొత్త హామీలలో మన ముందుకు రాబోతున్నారు. గతం నుంచి చిలకలూరిపేటకు వచ్చి గెలిచిన ప్రతి ఎంపీ చిలకలూరిపేటకు రైల్వే లైన్ అనే హామీ ఇచ్చినవారే. కాని తిరిగి ఎన్నికలు వస్తున్నాయి. ఈ హామీ మాత్రం నెరవేరలేదు. మిత్రులు కొంతమంది సోషల్ మీడియా వేదికగా చిలకలూరిపేటకు రైల్వేలైన్ అంశంపై పోరాటానికి సిద్దమయ్యారు. వారికి అభినందనలు . ఈ సందర్బంగా చిలకలూరిపేటకు రైల్వే లైన్ అవశ్యకత, గతంలో రైల్వేలైన్ కోసం జరిగిన పోరాటం గురించి తెలుసుకుందాం.
జిల్లాలో పారిశ్రామిక కేంద్రంగా విరాజిల్లుతున్న చిలకలూరిపేటలో రైలు కూత వినబడటం లేదు. ఇక్కడ రైల్వేలైను కావాలన్న ఈ ప్రాంత వాసుల కల కలగానే మిగిలిపోతున్నది. ప్రతి ఏడాది కేంద్రంలో రైల్వేబడ్జెట్ ప్రవేశ పెడుతున్నప్పుడల్లా పేటవాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. బడ్జెట్లో చిలకలూరిపేటకు రైల్వే లైను ప్రస్తావన ఉంటుందన్న ఆశపై ఏయేడాదికి ఆ యేడాది ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతూ బడ్జెట్లో రైల్వేలైన్ ప్రస్తావన కనింపించదు.
ఎన్జీ రంగా హయాం నుంచి ....
ఈ ప్రాంతానికి రైల్వేలైను ఏర్పాటు చేయాలని గతం నుంచి ఎన్నో ప్రయత్నాలు కొనసాగాయి. ఎంపీలుగా ఎన్నికయ్యే ప్రతి ఒక్కరూ రైల్వేలైను ప్రస్తావన లేకుండా, హామీ ఇవ్వకుండా గెలిచిన దాఖలాలు లేవు. దశాబ్దాల కిందటే నాటి చిలకలూరిపేట ఎమ్మెల్యే గా ఉన్న స్వర్గీయ సోమేపల్లి సాంబయ్య నాటి గుంటూరు ఎంపీ ఆచార్య ఎన్జీ రంగా దృష్టికి రైల్వే ఆవశ్యకత తీసుకువెళ్లారు.ఆప్పట్లో చిలకలూరిపేట ఆసెంబ్లీ నియోజకవర్గం గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉండేది. ఇరువురు నాయకులు ఆనాటి రైల్వేమంత్రి ఘనిఖలాన్ చౌదరిని కలిసి రైల్వేలైను ఏర్పాటు చేయడం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. ఆనాటి నుంచి నేటి వరకు ఆనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్వచ్చంధ సంస్థల నిర్వాహకులు ఏళ్ల తరబడి రైల్వే లైన్ కోసం ప్రయత్నాలు చేసినా కార్యరూపం మాత్రం దాల్చలేదు.
బహుళ ప్రయోజనాలు...
కాటో సిటీగా (కాటన్ ఆండ్ టుబాకో) పేరున్న చిలకలూరిపేట ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో ఆభివృద్ధి చెందింది. స్థానిక పరిశ్రమల నుంచి ఇతరా రాష్ట్రాలకు ఎగుమతులు, దిగుమతులు నిత్యం కొనసాగుతుంటాయి. ఇక్కడ నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాలోని చీరాల ,ఒంగోలుకు వెళ్లి ఆక్కడ నుంచి రైలు మార్గాన సరుకులను రవాణా చేస్తుంటారు. సరకు రవాణాతో పాటు ఈ ప్రాంతంలో రైల్వేలైను ఏర్పడితే చీరాల నుంచి బాపట్ల, పొన్నూరు, తెనాలి, గుంటూరు, నరసరావుపేట తదితర ప్రాంతాలకు చేరేందుకు ఈ ప్రాంతవాసులకు వ్యయప్రయాసలు తగ్గే ఆవకాశం ఉంది. చిలకలూరిపేటలోని స్పిన్నింగ్ మిల్లులు, పొగాకు పరిశ్రమ, ప్రకాశం జిల్లాపర్చూరు, మార్టూరు గ్రానైట్ పరిశ్రమల నుంచి ఎగుమతులు, దిగుమతులు ఆయ్యే ఆవకాశం ఉంటుంది. స్థానికంగా ఉన్న స్పిన్నింగ్, ఆయిల్ మిల్లులు తమ సరుకులను దూరప్రాంతాలకు రవాణా చేయడానికి ఏటా సుమారు రూ. 100 కోట్లు పైబడి వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న పలు పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు ఇతరా రాష్ట్రాలకు చెందిన వారే. వారి ప్రయాణ సౌకర్యానికి రైల్వేలైను ఎంతో ఆవసరం. దీంతో పాటు పర్యాటక రంగం ఆభివృద్ధి చెందుతున్న దృష్ట్యా కొండవీడు వంటి చారిత్రక ప్రదేశాలకు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు చేరుకోవడానికి ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. పిడుగురాళ్ల, నరసరావుపేట, చీరాల ప్రాంతాలను కలుపుతూ చిలకలూరిపేట మీదుగా కొత్తలైనును ఏర్పాటు చేయాలని, గతంలో పలువురు స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ మార్గంలో రైల్వేలైను ఏర్పాటు చేయాలని ఇందుకు సంబంధించిన అనేక ఆధారాలను, ప్రజాభిప్రాయాలను సేకరించి ఆప్పట్లోనే ప్రజాప్రతినిధులతోపాటు రైల్వేఆధికారులకు సైతం నివేదికలను అందించడం జరిగింది. ఆన్ని వర్గాల ప్రజలకు లాభం చేకూర్చే ఈ రైల్వే లైను ఏర్పాటు విషయమై పార్టీల రహితంగా ప్రజాప్రతినిధులు, ప్రజలు సంఘటితం ఆవ్వాల్సిన ఆవసరం ఎంతైనా ఉంది.
--



Post A Comment:
0 comments: