వలస వెళ్లే పక్షులకు, జంప్ జిలానీలకు మంచి సమయం. అలకలు,బుజ్జగింపు, పలకరింపులతో నేతలు సతమతమౌతున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో రాజకీయాలు హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి.గతం ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల వాతావరణం ముందే వచ్చేసింది. బలప్రదర్శనలు, వ్యూహాలు ప్రతి వ్యూహాలు మొదలయ్యాయి. ఒక పార్టీకి చెందిన వారు ఫలానా ప్రాంతంలో పర్యటించారంటే మరసటి రోజు ప్రత్యర్ధి పార్టీ నేతలు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలు తెలుసుకోవటం, దాని కంటే హామీలు మేము ఇస్తమని చెప్పటం జరుగుతున్నతంటే. కులాలు, మతాల ఎన్నికలపై ఉండదని ఆయా పార్టీలు పైకి చెప్పుకున్నా పూర్తిగా కులాలు, మతాలను మభ్యపెట్టే విధంగానే ఎన్నికలు జరుగుతాయన్నది బహిరంగ రహస్యమే. ఫలానా కులానికి కమ్యునిటి భవనం, ఫలానా మతానికి ప్రార్ధన మందిరం, స్మశానవాటికల అభివృద్ది ఇది హామీల వరస. అయితే గెలిచిన తరువాత అనే హామీని ప్రజలు విశ్వసించటం లేదు. తప్పని సరిగా ముందుగానే ఇందుకు సంబంధించిన డబ్బులు కులపెద్దల వద్ద పెడితేనే తమ వర్గం ఓట్లు... అంటూ నాయకులను నేరుగానే నిలదీస్తున్నారు.
రాజకీయ నిరుద్యోగులకు చేతి నిండా పని దొరికింది. ఫలానా పార్టీ నుంచి ఇన్ని కుటుంబాల వారు జాయిన్ అవుతున్నారని, వారి కోరికల చిట్టా చదవటం, మరుసటి పార్టీ కండువాలు కప్పటం పరిపాటిగా మారింది. లెక్కలు సరిచేసుకోవటానికి నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇక రోజు కండువాలు కప్పుటం ఫలానా పార్టీ నుంచి తమ పార్టీలోకి ఇంతమంది జాయన్ అయ్యారని లెక్కలు సరిచూసుకుంటున్నారు.
మరోవైపు ఒకటి రెండు ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఉన్న సీనియర్లకు మంచి సమయం వచ్చింది. గత ఎన్నికలల్లో తమ పార్టీ బలబలాలను, ప్రత్యర్ధి పార్టీ బలహీనతలను బూత్ స్థాయిలో విశ్వేసించేపనిలో పడ్డారు.అక్కడ పార్టీ బలహీనంగా ఉండి అక్కడ దృష్టి పెట్టండి.. అక్కడ ఆ వర్గం వ్యతిరేకంగా ఉండి వారిని సరిచేసుకోండి...ఇదండి వరస. మీకుచిలకలూరిపేటలో ఎన్నికల వాతావరణం కనిపిస్తుందా... ?


Post A Comment:
0 comments: