జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు భిన్నంగా చిలకలూరిపేటలో ర్యాలీలు పెరిగిపోయాయి. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల వాతావరణం అంతగా వెడక్కలేదు. ఆయా పార్టీల అధిష్టానం అదేశిస్తే తప్ప నాయకులు రోడ్లక్కటం లేదు. కాని నియోజకవర్గ పరిధిలో ప్రతి పార్టీ , ప్రతి వర్గం ర్యాలీలతో తమ తమ ప్రతాపాన్ని చూపటానికి ఆసక్తి చూపుతున్నాయి. ప్రదర్శన అంటే సహజంగా గతంలో ఎన్నికల సమయంలో జరిగే ప్రచారం. ఆయా పార్టీలకు చెందిన నాయకులు నామినేషన్ వేసే సమయంలో తన అనుచరులతో కలిసి ర్యాలీ నిర్వహించటం, ఎన్నికల వేళ ప్రచారం నిర్వహించటం పరిపాటి. ప్రస్తుతం అన్ని పార్టీలు ప్రతి విషయానికి ప్రజల ప్రదర్శలకే ప్రాముఖ్యత నిస్తున్నాయి.
ఎవరు కాదన్న అవునన్నా ర్యాలీలు బల ప్రదర్శనకు వేదికగా మారాయన్నది వాస్తవం. ఈ క్రమంలో ఎవరికివారు తమ బలాలను ప్రదర్శించుకోవటానికి ర్యాలీలను ఆశ్రయిస్తున్నారు,అయితే ఒక్క విషయం మాత్రం గుర్తించుకోవాలి. ర్యాలీల పేరుతో ట్రాఫీక్ నిలిపివేయటం, బైక్‌లపై విన్యాసాలు, బైక్‌లకు ఉన్న సైలెన్సర్ తీసి పెద్ద శబ్డాలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని ఈ సందర్బంగా విస్మరించలేం. బైక్‌ల విన్యాసాలు పలు సందర్బాలలో బైకులు నడిపే వారికే కాదు ఎదుటి వారికి ప్రమాదకరంగా మారుతున్నాయి.
ఇవి కాక ఫలానా వారిని కించపరిచారరో...తమ నాయకుడిపై దాడి చేశారనో, అరెస్టు చేశారనో చేసే ప్రదర్శనలు ,బందు కోసం జరిగే ర్యాలీలు కూడా వివాదానికి కారణమౌతున్నాయి.దేనికైనా ఒక హద్దు ఉంటుంది. శృతి మించితే ఇబ్బందే. భిన్నస్వరాలు తప్పుకాదు. ప్రజాస్వామ్యం లో హక్కులతో పాటు బాధ్యతులు కూడా ఉంటాయి. రాజకీయ పార్టీల నాయకులు ఈ దిశగా అలోచిస్తారా..?

Post A Comment:
0 comments: