నాలుగు సంవ్స‌రాల  కాలంలోనే  చిల‌క‌లూరిపేట నియోజక‌వ‌ర్గంలో ముగ్గురు విలేక‌ర్లు కార‌ణాలు  ఏమైనా  నిండు నూరేళ్లు బతికాల్సినోళ్లు అయిదు పదుల వయస్సైనా దాటకముందే కుటుంబాలకు అన్యాయం చేసి వెళ్లిపోయారు. య‌డ్ల‌పాడు ఆంద్ర‌ప్ర‌భ విలేక‌రి కోటేశ్వ‌రరావు సోమ‌వారం ఉద‌యం క‌న్నుమూసారు. అతి చిన్న‌వ‌య‌స్సులోనే మృత్యువుకు చేరువ‌య్యాడు. చిల‌క‌లూరిపేట‌లో ఇదో విషాదం. అంద‌రి గురించి ప‌ట్టించుకొనే మా విలేక‌ర్ల గురించి ప్ర‌జ‌ల‌రా ఒక్క‌సారి ఆలోచించండి...మా జీవితాల వెనుకున్న చీక‌టిని, క‌న్నీటి త‌డిని కొద్ది గా  అర్ధం చేసుకోండి. ల‌క్ష‌లాది రూపాయ‌లు వ‌చ్చే ఉద్యోగాలు వెనుక ప‌డ‌కుండా ఈ వృత్తిలో కొన‌సాగాల‌ను కుంటున్న మా విలేక‌ర్ల‌కు మ‌ద్ద‌తు ప‌ల‌కండి. ప్ర‌తి వ్య‌వ‌స్థ‌లోనూ త‌ప్పులు ఉన్న‌ట్లే ఇందులోనూ త‌ప్పులు ఉండ‌వ‌చ్చు.అర్ధం చేసుకోండి..


ఆహా జర్నలిస్టు అంటే ఏం జీవితం.. భలే ఉంటోంది. ఎక్కడికెళ్లిన పనులు జరుగుతాయి. డ‌బ్బులు తెగ‌వస్తాయి.. ఎవడైనా భయపడాల్సిందే అంటారు. ఇవన్నీ ఉత్త క‌బుర్లే. ఇంకొందరు అంటారు జర్నలిస్టు అంటే లగ్జరీ లైఫ్.సంపాదన ఫుల్లు..ఎవడికి ఫోన్ కొట్టిన పైసాలు రాలుతాయని తెగ వాగేస్తుంటారు. కానీ జర్నలిస్టు జీవితం అంటే ఎన్ని కష్టాలుంటాయో వాళ్లకేం తెలుసు..అందరి కష్టాలు వినేటోడు..తమ కష్టాల్ని కడుపులో పెట్టుకుంటాడు. కష్టనష్టాన్ని తనే భరించి కుటుంబంతా సంతోషంగా ఉండాలనుకుంటాడు.అప్పు చేసైనా బతుకు బండిని లాగిస్తాడు. ఉద్యోగ భద్రత లేని లైఫ్. చేసేది పేరుమోసిన కంపెనీనైనా,మామూలు సంస్థైనా ఇంతే. ఉద్యోగాన్ని కాపాడుకునేందుకు రోజు ఆలోచించాల్సిందే.  రెండు, మూడు నెలల వరకు జీతాలు అందక ఇబ్బందులు పడేవారు. ఇలా ఇంటా బయటా ఎన్నో కష్టాలు.
అందరి గురించి ఆలోచిస్తాడు..అందరికీ న్యాయం జరగాలి..పొద్దున లేస్తే జనం ఆవేదనలు వింటాడు..అర్థం చేసుకుంటున్నాడు. వాళ్లకు ఏదైనా పరిష్కారం చూపించాలనుకుంటాడు..అందరూ బాగుండాలనుకుంటాడు. అందరి బాగోగులు చూసుకుంటాడు..కానీ ఈ హడావుడిలో తన ఆరోగ్యం గురించి మరిచిపోతాడు..ఆరోగ్యం గురించి ఆలోచించే టైమ్ ఉండదు.టైమ్ ఉన్నా..ఆలోచించేలోపే మరో పిలుపు. గడియారం ముల్లు ఒకటి రెండు నుంచి పన్నెండుదాకా తిరిగితే..జర్నలిస్టు లోకం చుట్టు తిరుగుతాడు.


24 గంటలు అదే ధ్యాస..పేరుకు డ్యూటీ 8 గంటలే అయినా..బుర్ర మాత్రం నిద్రపోనంతవరకు సమాజం చుట్టే తిరుగుతుంది. ఎక్కడకి వెళ్లాలి..ఏ స్టోరీ పేలిపోతోంది..?బాస్ దగ్గర శభాష్ అనిపించుకోవాలంటే ఏలాంటి స్టోరీలు చేయాలి..?కళ్ల ముందు ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించేలా ఎలా ప్రెజెంట్ చేయాలి..?స్పీడ్ రిపోర్టింగ్ లో పోటీని ఎలా తట్టుకుని నెగ్గాలి..? స్టోరీలో ఏ యాంగిల్ తీసుకోవాలి..? అని బుర్ర వేడెక్కిపోయేలా ఆలోచిస్తుంటాడు. ఇలా ఆలోచించి ఆలోచించి అనారోగ్యం కొని తెచ్చుకుంటాడు..తనకు తెలియకుండా స్లో పాయిజన్ బాడీ మొత్తం ఎక్కేస్తోంది.ఇలా అందరి గుండెచప్పుళ్లు వినే జర్నలిస్టులు..తమ గుండె గురించి ఆలోచించడం మానేశారు. ఫలితంగా ఎంతో మంది జర్నలిస్టుల గుండెలు ఆగిపోతున్నాయి
. ప్ర‌జ‌ల‌రా..మా తోటి జ‌ర్న‌లిస్టు మిత్రుల‌పై కాస్తంత గౌర‌వం. మీ ప్రేమ, మ‌ద్దుతు ప్రక‌టించండి.. చ‌నిపోయిన మా  కోటేశ్వ‌ర‌రావుకు అశృనివాళితో ... 


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: