భారతరత్న డా॥APJ అబ్దుల్ కలాం 87 వ జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్.వి.యస్.సి.వి.యస్.హైస్కూలు  హెచ్ఎం ఉప్పలపాటి వేంకటేశ్వరరావు కు అతి ప్రతిష్టాత్మకమైన "భారతరత్న డా॥APJ అబ్దుల్ కలాం ఎక్కే లెన్సీ అవార్డు వ‌రించింది.. ఈ అవార్డును ఈ నెల 14 వ తేదీన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ నందు CBI మాజీ డైరక్టర్ V.V లక్షీనారాయణ, మాజీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి P.రమాకాంతరెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.ఇప్ప‌టికే  ఉప్ప‌ల‌పాటి . చేసిన  కృషికి పలు అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. 2008 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2010లో ఏపీ సార్వత్రిక విద్యాపీఠం జిల్లా ఉత్తమ కోఆర్డినేటర్ అవార్డు, 2012లో రాష్ట్ర | ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2013లో మదర్ థెరిస్సా సేవా ఆవార్డు, 2014లో గోబల్ పీస్ అవార్డు, 2015లో గ్లోబల్ టీచర్ రోల్ మోడల్ అవార్డులు లభించాయి. వీటితో రాష్ట్రస్థాయిలో పలు విద్యారంగ ప్రముఖుల ప్రశంసలు పొందారు. .. అలోచనలే ప్రగతిని సాధిస్తాయి. భవిష్యత్తును దివ్యంగా దర్శింపచేస్తాయి... అన్న భారత రాష్ట్రపతి స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం మాటలను స్పూర్తిగా తీసుకొన్న ఉప్పలపాటి మంచి జీవితానికి మంచి ఆలోచనలే పునాది' అని బలంగా నమ్ముతారు. 

.
పఠతో నాస్తి మూర్ఖత్వమ్...చదువు వల్ల మూర్ఖత్వం పోతుంది .. ఉపనిషత్ .అక్షరం ఉత్తమ గమ్యానికి దారి చూపుతుంది. పుస్తకం లక్ష్యాలను దరి చేరుస్తుంది. విద్యార్థులకు చదువు ఒక్కటే సరిపోదు. వారి జీవన గమణాన్ని నిర్దేశించటానికి మంచి పుస్తకం ఒక దిక్సూచిగా ఉపయోగపడుతుందని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి ఉప్పలపాటి వెంకటేశ్వరరావు. ఒకవైపు పట్టణంలోని ఆరవీఎస్ సీవీఎస్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయునిగా విద్యార్థులకు చదువు,క్రమశిక్షణతో పాటు పరీక్షల్లో ఉత్తమఫలితాలు సాధించేందుకు అహర్నిశలు కష్టపడుతూ, మరోవైపు వ్యక్తిత్వ వికాస పుస్తకాలు రచిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నారు.

  ఈ పుస్తకాలు విద్యార్థులకే కాదు ప్రతి ఒక్కరులో ఆత్మన్యూనత భావాన్ని ప్రారదోలి, ఆత్మవిశ్వాసం నింపి వారివారి లక్ష్యాలను చేరుకోవటానికి దోహదపడున్నాయి . విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో, సగటు మనిషిలో వ్యక్తిత్వ వికాసానికి పూనాది వేయటానికి పలు పుస్తకాలు రచించారు. గతంలో ‘జనగనమన జయహో' అంటూ జాతీయ గీతం గురించి వివరించే పుస్తకాన్ని వెలువరించిన ఆయన “జీవనక', 'గమ్యానికి మార్గం', 'వెలుగురేఖలు' మంచిమాట-ప్రగతికి బాట అనే పుస్తకాలను వెలువరించారు. ప్రతి పుస్తకం ప్రతి ఒక్కరికి హస్తభూషణంలాలా వీటిని రూపుదిద్దారు. ఈ పుస్తకాల్లో పునాది నుంచి మహోన్నత వ్యక్తిగా మారటానికి ఎవరికివారు ఎలా తీర్చిదిద్దుకోవాలో సవివరంగా పేర్కొన్నారు.

  చదువు వంద శాతం మార్కులకే కాదు.. పరిపూర్ణవ్యక్తిత్వం కోసం డిగ్రీలు, పీజీలు ఇతర విద్యాపట్టాలు పట్టుకొని విద్యాసంస్థల నుంచి బయటకు వచ్చే విద్యార్థులు పరిపూర్ణవ్యక్తిత్వంతో ఉండాలన్నదే ఉప్పలపాటి వెంకటేశ్వరరావు ఆకాంక్ష. విద్య అనేది వంద శాతం మార్కులే కాదని, వంద శాతం పరిపూర్ణ వ్యక్తిత్వం కోసమని బలంగా నమ్మొ ఈ ఉపాధ్యాయుడు అందుకు తగ్గట్లు అనేక కార్యక్రమాలను పాఠశాలలో నిర్వహిస్తుంటాడు. జాతీయ నాయకుల జయంతి,వర్ధంతులు, ప్రపంచ ప్రఖ్యాత దినోత్సవాలు, వాటి ప్రాముఖ్యతలను తెలియజేస్తుంటారు. చిలకలూరిపేట పట్టణంలో జాతీయ గీతం జనగణమణ వందేళ్లు నిండిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా స్థాయిలో పాఠశాల కీర్తిని చాటింది. . ఎవరు తక్కువ కాదు. ఎవరు ఎక్కువ కాదు. మనం నిర్దేశించుకున్న అలవాట్లు ,ఆలోచనలను ఎలా మలుచుకోవాలో వివరించే ప్రయత్నం చేశా....  విద్యార్థుల మనస్సు తెల్లకాగితం. వారి మనస్సులో ఏది చొప్పిస్తే అది శాశ్వితంగా ఉండి పోతుంది. విద్యతో పాటు వారిలో క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొదించేందుకు ఈ చిరుప్రయత్నం చేస్తున్నా అంటూ వివ‌రించారు. 
ఆయ‌న మ‌రిన్ని అవార్డులు అందుకోవాల‌ని ఆకాంక్షిస్తూ... 
-
Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: