చిలకలూరిపేట ప్రజలరా ..
చిలకలూరిపేట నియోజకవర్గం జాతీయ రహదారిపై విస్తరించి ఉండటంతో రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారి దేహాలు పోస్టుమార్టం నిమిత్తం ముప్పిపడకల ప్రభుత్వ ఆసుపత్రి. మార్చురీకి వస్తుంటాయి. దీంతోపాటు ఇతర కేసుల్లోనూ మృతదేహాలు ఇక్కడకు రావడం సాధారణం. ప్రభుత్వాసుపత్రి ఆధునీకరణ మాట దేవుడెరుగు. శవాగార మరమ్మతులకు నోచుకోకపోవడం అత్యంత బాధాకరంగా మారింది. ప్రమాదాల్లో ప్రాణం కోల్పోయిన వారి వృతదేహాలకు సకాలంలో అంతక్రియలు నిర్వహించాలి. ఎక్కువ సమయం ఉంచాలంటే తగిన వసతులు ఉండాల్సిందే. కాని ప్రభుత్వాసుపత్రిలో ఆ వసతి లేకపోవటంతో ఇటు వైద్యులు, మృత్యువాత పడినవారి బంధువులు ఇబ్బందులు పడుతున్నారు.
ఏదో ఒక ప్రమాదంలో మరణించిన వారి బంధువులకు సమాచారు అంది బంధుమిత్రులు వచ్చే సరికి మృతదేహాలు కుళ్లిరూపురేఖలు కోల్పోతుంటాయి. కళ్లముందు తీయగాడే మనిషి ప్రమాదంలో నిర్జీవమైతే ..చనిపోయిన వ్యక్తిని కడసారి చూపుకు నోచుకోకపోతే బంధువులు, కుటుంబ సభ్యులు పడే వేదన వర్ణణాతీతం. పట్టణంలోని చీల రోడ్డులో ఉన్న 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లోని శవాగారంలో మృతదేహాలు భద్రపరిచటానికి వసతులు లేకపోవటంతో చివరిచూపుకు నోచుకోక ఆనవాళ్లు కోల్పోయి కుటుంబ సభ్యులకు ఆవేదన మిగులుస్తున్నాయి. మృతదేహాలను భద్రపరిచేందుకు ఆసుప్రతిలో ఉన్న ఒకే ఒక్క ఏసీ బాక్సు ఉంది. అదీ తరచు మరమతలకు గురిఅవుతుంటుంది. ఒకేసారి ఒకటికి మించి మృతదేహాలు మార్చురీకి వచ్చినపుడు 'సమస్యాత్మకంగా మారుతోంది. చిలకలూరిపేట కమ్యునిటీ హెల్త్ సెంటర్ గుంటూరు, ప్రకాశం జిల్లాల మధ్య వారధిలా ఉంటుంది. చిలకలూరిపేట నియోవర్గంలోని ప్రజలతో పాటు ప్రకాశం జిల్లా మార్జురు, పర్చూరు, యద్దనపూడి తదితర ప్రాంతాలకు చెందిన వారు కూడా చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి వస్తుంటారు. ఈ ప్రాంతంలో జరిగే రోడ్డు, ఇతర ప్రమాదాలలో గాయపడి మరణించిన వ్యక్తులకు సంబంధించిన పోస్ట్ మార్టం ఈ ప్రభుత్వాసుపత్రిలోనే జరుగుతుంది. సగటున రోజుకు ఒక మృత దేహం ప్రభుత్వాసుపత్రి మార్చూరికి వచ్చి చేరుతుంది. ఇవి కాక పట్టణ పరిసరప్రాంతాలలో ఆనాధలుగా మృతి చెందిన వారి మృతదేహాలు కూడా శవాగారంలో నిలువ ఉంటాయి.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ప్రమాదంలో మరణించినా,గుర్తు తెలివారు మరణించినా వారి తాలుకు బంధువులు వచ్చే వరకు మృతదేహాలు నిల్వ ఉంచే పరిస్థితి లేకపోవట భాదితులు అనేక ఇబ్బందులకు పడుతున్నారు.ప్రభుత్వాసుప్రతిలో ఉన్న శవాగారాన్ని యుద్ద ప్రాతిపదికన ఆధునీకరించాలని కోరుకుందామా...?


Post A Comment:
0 comments: