చిలకలూరిపేట జాతీయ రహదారిపై ముగ్గురు వ్యక్తులు రో్డ్డు ప్రమాదంలో మరణించారు. అయితే సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదలటం వేరు. కాని కొన ఊపరితో ఉండి కూడా ప్రభుత్వాసుపత్రిలో మృత్యువాత పడటం దయనీణం. ఇది వీరికే సంబంధించిన వ్యవహారం కాదు. గతం నుంచి జరుగుతున్న తంటే.
రోజువారి జాతీయ రహదారిపై కొనసాగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మంది కాళ్లు చేతులు, విరగటం, తల పగలటం పంటి కారణాలతోనే మృత్యువాత పడుతున్నారు. నియోజవర్గంలోని బోయపాలెం నుంచి ఇటు తాతపూడివరకు అక్కడి నుంచి 50 కిలో మీటర్ల మేర ఉన్న ప్రకాశం జిల్లాలోనూ సరైన ప్రభుత్వాసుపత్రి లేదు. చిలకలూరిపేటలో ఉన్న 30 పడకల కమ్యునిటీహెల్ట్ సెంటర్లో వసతుల కొరత వెక్కిరిస్తూ ఉంటుంది. చిన్న ప్రమాదమైనా వెంటనే గుంటూరుకు రిఫర్ చేసి ఇక్కడి వైద్యులు చేతులు దులుపుకుంటారు. తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందించే యూనిట్ఠాని, అందుకు అవసమైన నిణుపులైన వైద్యులు కాని లేకపోవటంతో తీవ్రగాయాలకు గుంటూరు కు తరలించటమే ఏకైక మార్గంగా ఉంది... ప్రమాదాల్లో బాధపడుతున్న వారికి తక్షణ వైద్య సహాయం అందించటానికి అప్పట్లో కేంద్రప్రభుత్వం ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. సుమారు 10 సంవత్సరాల కిందటే చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని అప్పట్లో పాలకులు ప్రయత్నించారు. రాజకీయ కారణాలతో అది కాస్తా గుంటూరుకు తరలిపోయింది.
. ట్రామాకేర్ సెంటర్‌తో ఉపయోగాలు ... ...
ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు వైద్యం అందించే మొదటి గంటసు గోల్డెన్ అవర్ గా వైద్య వర్గాలు పేర్కొంటారు. ఇటువంటి అముల్యమైన సమయంలో వైద్య సేవలు, సరైన శస్త్రచికిత్సలు నిర్వహిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. ప్రమాదాల్లో గాయపడిన వారికి తీవ్రమైన రక్తస్రావం, అంతర్గత రక్తస్రావం, తీవ్రగాయాలు, తీవ్రమైన మానసిక ఆందోళనకు గురిఅపతారు. ఇటువంటి వారికి గంటలోగా వైద్యశాలకు చేర్చి అంతర్గ రక్తస్రావాన్ని అరికట్టి, అవసరమైన శస్త్ర చికిత్సలు, ఆక్సిజన్ అందిస్తే ఏ శాతం మంది ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి సేవలు అందించే ప్రత్యేక వైద్య సిబ్బంది, అధునాతన వైద్య పరీక్షలు నిర్వహించే యూనిట్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
ప్రజలారా ఎన్నికలు వస్తున్నాయి. నాయకులు వస్తున్నారు. ట్రామా కేర్ సెంటర్ చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేయాలని కోరుదాం. చికిత్స లభించక ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడని విధంగా ట్రామ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయటానికి ముందుకు రావాలని కోరుకుందాం.



Post A Comment:
0 comments: