విగ్రహం అంటే రాతిపై చెక్కిన ఆకృతి కాదు. అవి ప్రజల హృదయాలలో నిలిచే ప్రతి రూపాలు. ప్రజలు తాము ఆరాధించే వ్యక్తులను స్మరించుకోవటానికి ఏర్పాటు చేసిన స్మృతి చిహ్నాలు . చిలకలూరిపేటలో నరసరావుపేట సెంటర్ నుంచి పాత గవర్నమెంట్ ఆసుపత్రి వరకు డివేడర్‌పై ఏర్పాటు చేసిన విగ్రహాలు మరో ట్యాంక్ బండ్‌ను తలపింపచేస్తున్నాయి.
నరసరావుపేట రోడ్డులోని అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్‌టీఆర్, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం,ఏకల్వవుడు, మహత్మగాంధీ, శాలివాహన చక్రవర్తి, నేతాజి సుభాష్‌చంద్రబోష్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్య, ఏఎంజీ వ్యవస్థాపకులు డాక్టర్ జాన్‌డేవిడ్ విగ్రహాలు ఉన్నాయి. ఇక పట్టణంలోని సుగాలికాలనీలో మొట్టమొదటిసారిగా జాన్‌డేవిడ్ విగ్రహాన్ని స్థానిక ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రాంతంలోనే ఎన్‌టీఆర్, ఇందిరాగాంధీ, కేబీరోడ్డపై రాజీవ్‌గాంధీ,ఇందిరాగాంధీ, వంగవీటి మోహనరంగా విగ్రహాలు ఉన్నాయి.తహశీల్దార్ కార్యాలయం ఎదుట బాబు జగ్జవన్‌రామ్, అంబేడ్కర్ విగ్రహాలు ఉన్నాయి. వీటితో పాటు శ్రీకృష్ణదేవరాయులు, మౌలానా అబుల్ కలాం అజాద్ , విగ్రహాల ఏర్పాట్లకు రంగం సిద్దం చేస్తున్నారు. వీటితో పాటు పట్టణంలోని తూర్పుమాలపల్లె, సంజీవగనర్ ప్రాంతాలో భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలు ప్రతిష్టించుకున్నారు.
మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవటమే కాదు. ఆయా మహానాయకుల సంస్మరణల సందర్బంగా వారిని స్మరించుకుంటూ ఘనంగా నివాళలు అర్పించటం కొనసాగుతున్న సత్‌సంప్రదాయం .



Post A Comment:
0 comments: