ఇది చాలా చిన్న సమస్య అనుకోవచ్చుకాని ట్రాఫిక్ సమస్య రోజురోజుకు జఠిలంగా మారుతుంది. పట్టణంలో పార్కింగ్ స్థలాలు లేక రోడ్ల పార్కింగ్ స్థలాలుగా మారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ స్థలం లేకుండా వెలుస్తున్న వాణిజ్య సముదాయాలు, దుకాణాలతో ఈ సమస్య మరింత తీవ్రరూపం దాల్చుస్తుంది. అధికారులు చూసిచూడ కుండా వదలివేయటంతో రానున్న రోజుల్లో ట్రాఫిక్ సమస్యలు మరింతగా పెరిగిపోయే ప్రమాదం ఉంది.
పార్కింగ్ ఎక్కడా... ?
గ్రేడ్ -1 మున్సిపాలిటిగా ఉన్న చిలకలూరిపేట పట్టణం శరవేగంగా విస్తరిస్తున్నది. 18.13 చదరపు కిలో మీటర్ల మేర విస్తరించిన పట్టణంలో సుమారు లక్షకు పైగా జనా భా ఉన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల మధ్య సరిహద్దుగా ఉన్న చిలకలూరిపేట పట్టణానికి రోజు వివిధ గ్రామాల నుంచి తమ దైనందిన కార్యకలాపాలపై ప్రతి రోజు 20 వేల మంది ప్రజలు పట్టణాన్ని సందర్శిస్తున్నారు. అభివృద్ధితో పాటు విస్తరించని రోడ్లు, వాహనాలు, తోపుడుబండ్లు. పెరిగిన ఆక్రమణలు తో అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి నెలకొంటుంది. పండుగలు, ఇతర శుభకార్యాల సమయంలో పట్ట ణం జనసంద్రంగా మారుతుంది. నరసరావుపేట సెంటర్ మొదలు కళామందిర్ సెంటర్, చౌత్రా సెంటర్, గడియాశస్తంభం. మెయిన్ బజారు. స్టీల్ కాట్ల బజార్, చలివేంద్రం వీధి తదితర ప్రాంతాలలో ఉన్న వ్యాపార కూడళ్ల వద్ద వాహనాలు పార్కింగ్ స్థలాలు లేక రోడ్డుపైనే నిలపటం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వీటితో పాటు ఎస్ బీఐ,ఎల్ ఐసీ కార్యాలయలకు రోజుకు వేలాది మంది సందర్శిస్తుంటారు. సందర్శకులు తమ వాహనాలను సర్వీస్ రోడ్డుపైనే పార్కింగ్ చేయటంతో కార్యాలయ పనివేళల్లో రోడ్డుపై నడవటం దుర్భరంగా మారుతున్నది. పట్టణంలో ఉన్న పలు కళ్యాణమండపాలకు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసుకోలేదు. దీంతో వివాహాది శుభకార్యాలు నిర్వహించే సమయంలో ఆ వైపు రాకపోకలు స్థంబించి పోతుంటాయి.
పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల వైఫల్యం..
గత కొన్ని సంవత్సరాలుగా పట్టణంలోని అనేక వ్యాపార,వాణిజ్య సముదాయాలు రూపుదిద్దుకున్నాయి. వాడి వాణిజ్య పరమైన దుకాణాలకు అనుమతులు ఇచ్చే క్రమంలో ఆయా దుకాణాలకు పార్కింగ్ ఉందా లేదా అన్న అంశాలను పరిగణలోకి తీసుకొని అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. దుకాణాలు నిర్మించే క్రమంలో అనుమతుల మేర నిర్మాణాలు కొనసాగుతున్నాయా లేవా అనే అంశాలను అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. . కాని ఇక్కడ ఇవేమీ ఉండవు. పార్కింగ్ లేకపోవటంతో రోడ్ల పార్కింగ్ స్థలాలు మారుతున్నాయి. దీంతో పట్టణంలో అస్థవస్థమైన ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నది. పార్కింగ్ ప్రదేశాలు లేకపోవటంతో తరచు తలెత్తే సమస్యలు పోలీసులకు తలనొప్పిగా మారుతున్నాయి. ఆ ధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ విషయాలను దృష్టి సారించి పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


Post A Comment:
0 comments: