మున్సిపల్ కార్యాలయంలో ఫైళ్ల మాయంపై మంత్రి ప్రత్తిపాటి సీరియస్
లక్ష్యాలు అధిగమిస్తారా.... ?
చిలకలూరిపేట పట్టణంలో అభివృద్ధిపనులు శరవేగంగా జరగే అవకాశం ఉందా...? జనవరిలో 15 తేదీ లోగా కొనసాగుతున్న 140 కోట్ల పనులు పూర్తి చేస్తారా.. అవుననే అంటున్నారు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే మంత్రి ప్రత్తిపాటి పెండింగ్ పనులు పూర్తి చేయటానికి చేపట్టిన వ్యూహం ఏమిటి.. ఈ ప్రశ్నలకు మంత్రి శుక్రవారం సమాధానం చెప్పారు.
గత కొంతకాలంగా నిధులు ఉండి కూడా పట్టణ పరిధిలో నత్త నడక కొనసాగుతున్నాయి. ఈ విధంగా ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ వెలవడే నాటికి పనులు పూర్తి చేయటం అసాధ్యం. ఈ విషయాన్ని గ్రహించిన మంత్రి ప్రత్తిపాటి కాంట్రాక్టర్ల సమావేశం ఏర్పాటు చేసారు. వారి సమస్యలు తెలుసుకొనే ప్రయత్నం చేశారు. బిల్లులు ఎందుకు అలశ్యమౌతున్నాయి, ఇందుకు ఎవరు బాధ్యులన్న విషయాలను కూడా తెలుసుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఫైళ్లు మాయమైన విషయం తెలుసుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యడైన రమణపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఉన్నతాధికారులను ఆదేశించారు. వారం రోజులు లోగా తగు చర్యలు తీసుకోవాలని, ఆ అధికారిదే తప్పైతే వెంటనే అతనిని సస్పెండ్ చేయాలని సూచించారు. కాంట్రాక్టర్లు అభివృద్ధిపనుల వేగం పెంచాలని, జనవరి 15 టార్గెట్‌గా పెట్టుకొని ముందుకు సాగాలని కోరారు. ఇందుకు సంబంధించి వారం వారం సమీక్ష సమావేశాలు నిర్వహించటం జరుగుతుందని, సమస్యలు ఉంటే నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని కోరారు.
నేరుగా మంత్రే కలగజేసుకొని అభివృద్ది పనుల వేగం పెంచాలని ఆదేశించటంతో జరుగుతున్న, జరగనున్న అన్ని పనులు శరవేగంగా కొనసాగుతాయని ప్రజలు ఆశిస్తున్నారు.


Post A Comment:
0 comments: