కొంతమంది పరిచయాలు జీవితాంతం మరవలేం. ఆయా వ్యక్తుల జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతునే ఉంటాయి. అప్పట్లో ఓ చిన్నపత్రికలో విలేకరిగా ఏఎంజీ వ్యవస్థాపకులు డాక్టర్ జాన్‌డేవిడ్ అయ్యగారిని ఇంటర్వూ కోసం కలవటం జరిగింది. జాన్‌డేవిడ్ ఇంటి వద్ద ఎప్పుడు కోలాహలమే. నాతో మాట్లాడతారా... ? సంశయం..;? ఎక్కడి నుంచే ఎవరొవరో వస్తున్నారు.. పోతున్నారు..పిలుపువచ్చింది.
రమ్మంటున్నారు అంటూ .బెరుకుగానే ఆయన గదిలో అడుగుపెట్టాను.
కూర్చోమన్నారు.. సాదారంగా ఆహ్వానించారు.
పేరు అడిగారు.. ఫలానా వ్యక్తులు తెలుసా..? అంటూ కుశల ప్రశ్నలు అడిగారు.
వచ్చిన పని చెప్పా..నవ్వారు..
ముందు కాపీ తాగండి అంటూ కాఫీ తెప్పించారు. ఎవరొవరో వస్తున్నారు. వారితో మాట్లాడుతున్నారు. వారికి కావల్సిన అవసరాలు తీరుస్తున్నారు.
సార్ బీజీగా ఉన్నట్లు ఉన్నారు. వెళ్దామని లేచా...
మీరు కూచోండి నవాబు గారు... అన్న అయ్యగారి మాటలకు ఇంకా లేచే సాహాసం చేయలేకపోయా...
రాజమండ్రి నుంచి ఎవరో అమ్మాయి వచ్చింది..మీ దయవల్లే ఈ స్థాయికి వచ్చా.పెళ్లి కుదిరింది. ఆశీర్వదించండి అంటూ కాళ్ల మీదపడింది.
లే అమ్మా..అంటూ సొంత కుమార్తె కు వివాహాం నిశ్చయమైన తండ్రిలా అక్కున చేర్చుకున్నారు. ఏవరోనో పురామాయించి కొత్త బట్టలు, ఒక కవరు అందించారు. అబ్బాయిని తీసుకొని ఇంటికి రావాలని కోరి సాగనంపారు.
మరో దివ్యాంగుడు జాన్‌డేవిడ్ అయ్యగారిని కలవటానికి వచ్చాడు. విషయం అడిగి తెలుసుకొన్నారు. నీ వ్యక్తిత్వం కోల్పోకు అంటూ సున్నితంగా మందలించి టెలిఫోన్ బూత్ పెట్టుకో అంటూ మరో కవరు అందించారు. అవసమైతే మళ్లీ కలువు.. అంటూ ఆదేశించారు.
ఇలా కొన్ని గంటల సమయంలోనే ఆయన వల్ల నలుగురు వ్యక్తులు అంటే నాలుగు కుటుంబాలకు లబ్ది చేకూర్చారు.
మధ్యాహ్నం అయ్యింది. లేవండి భోజనం చేద్దాం .. డైనింగ్ హాలులోకి తీసుకువెళ్లారు. భయం తగ్గింది. చాల విషయాలు మాట్లాడారు. తన ప్రస్థానం గురించి వివరించారు. దేవుడు అనుగ్రహిస్తున్నాడు.. నేను చేస్తున్నాను. అంటూ తన నిడాంబరతను చాటు కున్నారు. వీడ్కొలు పలుకుతూ మీ ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయా ..అంటూ ప్రశ్నించారు.
ఇది మొదలు చాలా సార్లు ఆయనను కలిసా. గుర్తుపట్టి మాట్లాడేవారు. ఆయన వ్యక్తిత్వం, జాన్‌డేవిడ్ అయ్యగారి సేవా ప్రస్థానం ఆగిపోలేదు. ఆయన వారసులు ఇదే సేవానిరతిని కొనసాగిస్తున్నారు. ఏఎంజీ డైరెక్టర్ డాక్టర్ అరుణ్‌కుమార్‌మహంతి,జాన్‌డేవిడ్ కుమారుడు డాక్టర్ జెస్సీ ఎస్ బర్నబాస్‌లో జాన్‌డేవిడ్ అయ్యగారి లక్షణాలు, వ్యక్తిత్వం కనిపిస్తునే ఉంటుంది.
జనవరి 9 వతేదీ జాన్‌డేవిడ్ అయ్యగారు మనల్ని విడిచి వెళ్లిన రోజు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ ...షేక్ అల్లాబక్షు
ఎడిటర్



Post A Comment:
0 comments: