ఈ విపత్తుయైనా చెప్పిరాదు. కాని విపత్తు ద్వారా సంబంవించే ప్రమాదాలను ముందుగానే పసిగట్టడం, అమ్రత్తంగా వ్యవహరించటంలోనే ఆయా శాఖల ప్రతిభ దాగి ఉంటుంది. నియోజకవర్గంలో సోమవారం ఈదురుగాలులుతో వాన కురిసింది. ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు పడిపోవటం, చిన్నచెట్లు కూలిపోవటం జరిగే పని. ఇక్కడ విద్యుత్ స్థంబాలు నెలకొరిగాయి. ట్రాన్స్‌ఫార్మర్ కోసం వేసి స్థంబం పడిపోయింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో విద్యుత్ గతం కంటే మెరుగ్గానే ఉంది. మెరుగైన నిరంత విద్యుత్ కోసం వేలుకాదు, లక్షలు కాదు.. కోట్లు ఖర్చుచేశారు. మరి కోట్ల ఖర్చు పెట్టిన మేర ప్రయోజనం ఉండాలికదా.. అలా ఉందా..?
నెలచివర్లో బిల్లులు కట్టలేదని , బకాయి ఉందని ముక్కుపిండి మరి వసూలు చేసే విద్యుత్ సిబ్బంది సేవల విషయంలో పూర్తిస్థాయిలో విఫలమౌతున్నారు. ఫీజ్ఆఫ్ కాల్ సమస్యకు ఎంత మంది స్పందిస్తున్నారు. అసలు విద్యుత్ శాఖలో ఒక్కలైన్‌మెన్ అయినా స్థంబం ఎక్కే పరిస్థితి ఉందా..అంటే లేదనే చెప్పాలి. ప్రతి లైన్‌మెన్ ఒకరికి మించి ఇద్దరు ముగ్గురు ప్రైవేటు సిబ్బంది ఏర్పాటు చేసుకుంటారు. ఫీజ్ఆఫ్ కాల్స్ సమస్య వచ్చినప్పుడు ప్రైవేటు సిబ్బంది పనిపూర్తి చేసి డబ్బులు దండుకుంటారు. వాస్తవంగా లైన్‌మెన్ ఉద్యోగంలో ప్రధానం చూసేది స్థంబం ఎక్కగలదా లేదా అన్నదే మొదటి అంశం. ఇక ప్రైవేటు సిబ్బంది విద్యుత్ ను నిలిపివేయటం లాంటి పనులు చేయటం నేరం. కాని ఎవరి ఇష్టానుసారం వారు విద్యుత్ నిలిపివేసి పనులు చేసుకోవటం మామూలే. ఈ క్రమంలో వారు ప్రమాదాలకు గురిఅయినప్పుడు ఇందుకు లైన్‌మెన్లదే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
అసలు విషయానికి వద్దాం. ఒక చిన్నపాటి వర్షానికే నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాలో గంటల కొద్ది అంతరాయం సంబవిస్తే రానున్న వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. వర్షం వెలిసినా రాత్రి పొద్దుపోయే వరకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మెరుగు పడలేదు. గ్రామాల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. నాసి రకం స్థంబాలవల్ల ఇలా జరిగిందా... లేదా మరేదైనా అవినీతి జరిగిందా అన్నది విచారణలో నిగ్గు తేలాల్సిన నిజం.



Post A Comment:
0 comments: