గ్రేడ్‌లోనే కాదు.. సమస్యల్లోనూ చిలకలూరిపేట మున్సిపాలిటి గ్రేడ్-1గా ఉంటుంది. గతం నుంచి ఇక్కడి అధికారులు ఎవరికివారే యమునాతీరే అన్నట్లు వ్యవహరిస్తుంటారు. ప్రజా సమస్యలు పట్టవు. అధికారులకు , ప్రజాప్రతినిధుల కు మధ్య సమన్వయం ఉండదు. ఇదంతా చిలకలూరిపేట మున్సిపాలి కీ తీరు. ఐదు సంవత్సరాల్లో ఎంతో అభివృద్దిని సాధించామని పాలక పక్షం చెబుతుంటే, అభివృద్దిలో కాదు అవినీతిలో ముందంజలో నిలిచారని విపక్షం ఎదురుదాడి చేస్తుంటది. విచిత్రమైన విషయం ఏమిటంతే గడిచిన ఐదేళ్లలో ఒక్క మున్సిపల్ సమావేశంలో కూడా ఎజెండాలోని అంశాలపై ప్రయోజనాత్మకమైన చర్చ జరిగిందిలేదు. తిరిగి ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఐదేళ్ల పాలనలో మున్సిపల్ పాలకులు సాధించింది ఏమిటి..;? ఏఏ వార్డుల్లో ఎంతంత అభివృద్ది కొనసాగింది. ఈ అంశాలపై వరస కథనాలు, ఆయా వార్డుల కౌన్సిలర్ల ఇంటర్వ్యూలు మీ చిలకలూరిపేటన్యూస్‌లో ప్రచురించనున్నాం. ఈ కధనాల్లో ముందుగా చిలకలూరిపేట మున్సిపాలిటి గురించి కొన్ని విషయాలు మీ కోసం
పంచాయతీగా ఉన్న చిలకలూరిపేట 1964 జనవరి 30వ తేదీన మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. 1980 ఏప్రిల్ 28వ తేదీ సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అయ్యింది. 2001 మే 18 తేదీన గ్రేడ్-1 మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ పాందింది. 1964లో మున్సిపాలిటీ గా ఆవిర్భవించిన చిలకలూరిపేటకు 1967 లో తొలిసారి పురపాలక సంఘ ఎన్నికలు జరిగాయి. తొలి చైర్మన్ గా శ్రీకృష్ణవేంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. పదవిలో కొనసాగుతునే మృతి చెందటంతో ఆయన స్థానంలో బచ్చురామలింగం చైర్మన్ అయ్యాడు. 1973 నుంచి 1981 వరకు స్పెషల్ ఆఫీసర్ పరిపాలన సాగింది. 1881లో ఎన్నికలు నిర్వహించగా ఓసీహెచ్ స్వామినాయక్ చైర్మన్ అయ్యారు. నాలుగు సంవత్సరాలు పైబడి పదవి నిర్వహించాక ఏపీపీఎసీసీ గ్రూప్ సెలక్షన్ కావటంతో పదివికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఉసర్తి నాగయ్య చైర్మన్ పదవి అలంకరించారు. కొన్నాళ్లు స్పెషల్ ఆఫీసర్ పరిపాలన కొనసాగింది. 1987 నుంచి 1992 వరకు మా జేటి వెంకటేశ్వర్డు చైర్మన్ గా కొనసాగారు. కొంతకాలం ప్రత్యేక అధికారి పాలన అనంతరం 1995 నుంచి 2000 వరకు తవ్వా విజయలక్ష్మీ తొలి మహిళ చైర్ పర్సన్ గా పనిచేశారు. 2000 నుంచి 2005 వరకు బింగి రాముర్తి , 2005 నుంచి 2010 సెప్టెంబర్ వరకు జరపల కోటీశ్వరి చైర్ పర్సన్ గా వ్యవహరించారు. ప్రస్తుతం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా టీడీపీ కి చెందిన బీసీ మహిళ గంజి చెంచుకుమారి వ్యవహరిస్తున్నారు.
లక్షకు పైగా జనభా కలిగి 34 వార్డులు గా పట్టణం విస్తరించి ఉంటుంది. ప్రజలకు క్షిత మంచినీటిని అందించాలన్న లక్ష్యంతో 1970లోనే మొదటి క్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు.2001వ సంత్సరంలో రెండవ మంచినీటి చెరువు ద్వారా నీటిని నిల్వ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. పాతచెరువు కెపాసిటీ 950 మిలియన్ లీటర్ల కాగా, నూతన చెరువు కెపాసిటీ 2.6 90 మిలియన్ లీటర్లు. పట్టణంలో 87 కిలోమీటర్ల మేర విస్తరించిన వాటర్ పైపులైన్లలలో అప్పుడప్పుడు సంభవిస్తున్న లీకులు, ఇటు ప్రజలను, అటు అధికారులను ఇబ్బందులకు గురిచేస్తుంటాయి.
చిలకలూరిపేట పట్టణంలో రోజుకు పట్టణ ప్రజల ద్వారా 46 మెట్రిక్ టన్నుల చెత్త, బయట నుంచి వచ్చే సందర్శకుల ద్వారా మరో 15 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. గతంలోనే రాష్ట్రంలోనే తొలిసారిగా పారిశుధ్యాన్ని స్వచ్ఛందసంస్థలను అప్పగిస్తూ పేట మున్సిపాలిటీ ప్రయోగాత్మకంగా నిర్ణయం తీసుకౌన్నారు. రోజుకు పట్టణంలో 80 లక్షల లీటర్ల మురుగునీరు విడుదల అవుతుండగా ప్రధాన కాల్వలన్నీ శిధిలావస్థకు చేరటంతో చినుకపడితే చాలు మురుగునీరు వీధులలో పాంగి ప్రవహిస్తుంది. కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన ఆండర్‌డ్రైనేజీ వ్యవస్థ ఇంతవరకు అమలుకు నోచుకోలేదు
ఇలా అనేక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఐదేళ్లు గడిచిపోయాయి. ఈ ఐదేళ్ల కాలంలో చిలకలూరిపేట మున్సిపాలిటి సాధించిన అభివృద్ది ఏమిటి..? ఏ సమస్యలు పరిష్కారానికి నోచుకున్నాయి.. తదితర అంశాలపై వరస కథనాలు త్వరలో...



Post A Comment:
0 comments: