ఇతను మన ఊరి పిల్లాడే. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినా పేట ప్రజలంటే మక్కువ. జన్మనిచ్చిన ఊరికి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలిచిన నిగర్వి ఇతను. అతనే ఆరా మస్తాన్.
రాష్ట్ర, దేశ రాజకీయాలల్లో ఖచ్చితత్వానికి, విశ్వసనీయతకు పెట్టింది పేరు ఆరా చేపట్టిన ఎన్నికల సర్వేలు. ఈ సంస్థ యజమాని షేక్ మస్తాన్‌వలి స్వగ్రామం చిలకలూరిపేట మండలం మద్దిరాల గ్రామం. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి , అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి అతను. దేశ ,రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే మస్తాన్‌వలి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి లా పట్టాతో పాటు పొలిటికల్ సైన్స్‌లోనూ పట్టా అందుకున్నారు. ఈ దశలోనే విద్యార్ధి సంఘ నాయకుడిగా విద్యారంగ సమస్యలపై పోరాటం చేసిన మస్తాన్ అనంతరం రాజకీయ పరిశోధనలపట్ల ఆసక్తితో పూనెలో శిక్షణ పొందారు. అనంతరం హైదరాబాద్ కేంద్రంగా ఆరా సంస్థను స్థాపించిన ఆయన అనతి కాలంలోనే చేసిన వివిధ సర్వేలతో సంస్థ పేరునే ఇంటిపేరుగా మారిపోయింది.
నేడు అనేక సంస్థలు చిలక జ్యోసం లాంటి సర్వేలు వెలువరిస్తుండగా స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఆరా మస్తాన్ శాస్త్రియ పద్దతిలో కొనసాగిస్తున్న ఎన్నికల సర్వేలు ఖచ్చితత్వానికి ట్రెడ్‌మార్కుగా నిలుస్తాయి. 2018లో తెలంగాణా ఎన్నికలల్లో అన్ని సర్వేలు టీఆర్ ఎస్ ఓడిపోతుందని, టీడీపీ , కాంగ్రెస్‌పార్టీ విజయం సాధిస్తుందని డంకా మెగించి చెప్పినా, సుస్పష్టమై న మెజార్టీతో టీఅర్ ఎస్ గెలుస్తుందని చెప్పిన ఆరా సర్వేనే నిజమైంది. ఇవే కాదు అనేక సర్వేలు ఆరా మస్తాన్ విశ్వసనీయతకు అద్దం పట్టాయి. 2016 ఎన్నికల్లో తమిళనాడు ఎన్నికలల్లోనూ, గుజరాత్, జార్కండ్,కర్ణాటక ఎన్నికలతో ఆరా సంస్థ చేసిన సర్వేలు అక్షర సత్యాలుగా మిగిలాయి. 2019 ఏపీ ఎన్నికల్లో ఆరా మస్తాన్ ఉహించినట్లే వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. కౌంటింగ్ రోజు ఇంకా ఫలితాలు వెలువడని తరుణంలోనూ మస్తాన్ తన సర్వేకు కట్టబడి మాట్లాడటం, వెనువెంటనే ఫలితాలు ఆరా సంస్థ అంచనాలకు సరితూగటం తెలిసింది.
ఎదిగే కొద్ది ఒడిగి ఉండాలన్న పెద్దల మాటకు ఆరా మస్తాన్ ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తారు. చిన్ననాటి మిత్రులో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందంజలో నిలుస్తారు. చదువు కొన్న పాఠశాలను లక్షల రూపాయలు వెచ్చించి అభివృద్ది చేయటంలోనూ మస్తాన్ ముందంజలో నిలిచారు. కోటప్పకొండ తిరునాళ్ల భక్తుల సేవలలోనూ, పొతవరం అబ్దుల్లాబాషా ఉరుసులో ఏటా అన్నదానం చేయటం, విద్యా సంబంధ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం ఆరా మస్తాన్‌కు ఇష్టమైన వ్యాపకాలు. విద్యారంగంలో రావలల్సిన మార్పుల గురించి నిరంతరం అధ్యయనంం చేస్తుంటారు ఇందుకే ఆయనకు మౌలానా అబ్దుల్‌కలాం అజాద్ కేంద్రియ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యుడుగా నియమించారు.
దేశ,రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా నిలిచిన చిలకలూరిపేట వ్యాస్థవ్యుడు ఆరా మస్తాన్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.
ఈ విషయంపై విడియో కొరకు చూడండి..https://www.youtube.com/watch?v=p3QcHrV7F-g&t=19s
ఈ విషయంపై విడియో కొరకు చూడండి..https://www.youtube.com/watch?v=p3QcHrV7F-g&t=19s




Post A Comment:
0 comments: