ఎన్నికల ఫలితాలకు సమయం ఆసన్నమైంది. గతంలో ఎన్నడు లేని విధంగా ఫలితాల కోసం సుదీర్ఘ కాలం వేచి చూడాల్సి పరిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్ర రాజకీయాల చర్చల్లో చిలకలూరిపేట నియోజకవర్గం కేంద్రబిందువుగా మారింది. పలు పోలింగ్ బూత్‌ల్లో మండుటెండలల్లో ఏ విధంగా ఓటు వేయటానికి ఓటర్లు సిద్దమయ్యారో అర్ధరాత్రి వరకు ఇదే ట్రెండ్ కొనసాగింది. మహిళా ఓటర్లు, కొత్త ఓటర్లు ఓటు వేయటానికి ఆసక్తి కనపరచటం, గతానికి భిన్నంగా వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు,వ్యాపారాలు చేస్తున్న వారు సైతం ఓటు వేయటానికి చిలకలూరిపేట కు రావటం విశేషం. ఓటర్లలో పెరిగిన చైతన్యం ఏ పార్టీకి అనుకూలం అన్న విషయంపై ఆయా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఎవరుకు వారు రాజకీయవిశ్లేషకుల అవతారమెత్తారు. టీ కొట్ల నుంచి బార్ షాపుల వరకు గెలుపుపై లెక్కలు వేసుకుంటు కాలక్షేపం చేశారు.
మరోవైపు బెట్టింగ్ రాయుళ్లకు ఈ ఎన్నికలు మంచి అవకాశంగా కనిపించాయి. కౌంటింగ్ సయయం ఉండటంతో కోట్లలో బెట్టింగులు కొనసాగాయి. కౌంటింగ్ కు సమయం దగ్గరపడేకొద్ది బెట్టింగుల జోరు పెరిగింది. కోట్లలో బెట్టింగులు కొనసాగుతున్నాయి. విశేషమేమిటంతే కోట్లలో బెట్టింగులు కాసేవారు స్వయంగా చిలకలూరిపేటలో సర్వేలు చేయించుకున్నారట. చిలకలూరిపేట నియోజకవర్గంలోని పట్టణం ప్రాంత ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపారు, యడ్లపాడు, చిలకలూరిపేట, నాదెండ్ల మండలాల ఓటర్లు ఏ పార్టీకి ఓటేసారు అనే అంశాలపై సమగ్ర సర్వే చేయించుకున్నారని సమాచారం. సర్వేల అనంతరమే నియోజకవర్గంలో కచ్చితంగా ఫలానా పార్టీ గెలుస్తుందని అంచనాకు వచ్చారట. అయితే మూడు మండలాల ఓటర్లతో సరిసమానంగా ఉన్న పట్టణ ఓటర్ల తీర్పే ఈ ఎన్నికల్లో కీలకం కానుంది. పట్టణ ఓటర్లే ప్రస్తుత ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్దేశించనున్నారు.
ఈ ఎన్నికల్లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గెలిస్తే హ్యటిక్ విజయం సాధ్యమౌతుంది. అదే విడదల రజని గెలిస్తే మొట్టమొదటి బీసీ మహిళ విజయం సాధించినట్లు అవుతుంది. చూద్దాం పేట ఓటర్ల నాడి పట్టే నాయకుడు ఎవరో .. ?


Post A Comment:
0 comments: