నాయ‌కుడంటే ప్ర‌జ‌లు గుండెల్లో గుడి క‌ట్టుకొని నిలవాలి. క‌ష్టాల్లో క‌న్నీళ్లు తుడిచి నేనున్నాన‌ని భ‌రోసా ఇవ్వాలి. రాజ‌కీయం కొంద‌రికి పార్ట్‌టైమ్ వ్య‌వ‌హారం. ఓట్ల కోసం వేసే నాట‌కాలకు నాంది. రాజ‌కీయం అంటే మ‌రి కొంద‌రికి వ్యాపారం. రాజ‌కీయాన్ని అడ్డం పెట్టుకొని అంద‌లం ఎక్కే వ్యాపార ర‌హ‌స్యం. కాని రాజ‌కీయం అంటే వృత్తి, ప్ర‌జ‌ల‌కు సేవ చేసే అరుదైన అవ‌కాశంగా భావిస్తారో వారినే ప్ర‌జలు ఆద‌రిస్తారు. పార్ట్ టైమ్ పొలిటిష‌న్ల‌కు, రాజ‌కీయాల‌ను వ్యాపారంగా మార్చే నాయ‌కుల‌కు ఉండే ఆద‌ర‌ణ కొన్ని గంట‌లు మాత్ర‌మే. జ‌నం మ‌ధ్య‌లో ఉండే వారికి, జ‌నం బాధ‌ల‌తో మ‌మేక‌మైన నాయ‌కుల‌కు ప్ర‌జాదార‌ణ శాశ్వితం

 ఎన్టీఆర్‌, వైఎస్సార్ , సోమేప‌ల్లి సాంబ‌య్య లాంటి నాయ‌కుల‌ను ఇప్ప‌టికి త‌లుచుకుంటారు. సోమేప‌ల్లి వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన మ‌ర్రిరాజ‌శేఖ‌ర్ అంటే జ‌నం. పేద‌ల లాయ‌ర్‌గా  అప్ప‌టికే జ‌నంలో ఉన్న ఆయ‌న సోమేప‌ల్లి వార‌సుడుగా రాజ‌కీయాల్లో ర‌మ్మ‌ని ఆహ్వానించింది ఆ ప్ర‌జ‌లే ఇండి పెండెంట్ అభ్య‌ర్ధిగా రంగంలో దించారు. వారి ఆశ‌ల‌ను వ‌మ్ముచేయ‌కుండా ఎమ్మెల్యేగా రాజ‌శేఖ‌ర్ పేట ప్ర‌జ‌లకు చేరువ‌య్యారు.ప‌ద‌వులు ఉన్నా, లేకున్నా..అధికారంలో ఉన్నా లేకున్నా... రాజ‌శేఖ‌ర్ మాత్రం ప్ర‌జ‌ల్లో ఉన్నారు. ఆయ‌న ఎప్పుడు రాజ‌కీయాలను వ్యాపారంగా మార్చుకోలేదు. సోమేప‌ల్లి స‌న్నిహితులు వైఎస్సార్ అధికారంలో ఉన్నా వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోసం తాప‌త్ర‌య‌ప‌డ‌లేదు. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ది కోస‌మే పాటు ప‌డ్డారు. నియోజ‌క‌వ‌ర్గంలో అంత‌ర్గ‌త రోడ్లు, లోలెవ‌ల్ చాప్టాలు, ప‌సుమ‌ర్రు, న‌ర‌స‌రావుపేట‌, చిరుమామిళ్ల లాంటి పెద్ద బ్రిడ్జిలు మ‌ర్రి తో సాధ్య‌మైంది.

ఈ రోజు ఆయా పార్టీల‌లో నాయ‌కులుగా చెల‌మ‌ణి అవుతున్న నాయ‌కుల‌ను తీర్చిదిద్ది ప‌ద‌వులు ఇచ్చిన ఘ‌న‌త మ‌ర్రిదే అన్న విష‌యం వారు మ‌ర‌చిపోయినా ప్ర‌జ‌లు మ‌రిచిపోలేదు.రాజ‌శేఖ‌ర్ పార్ట్ టైమ్ రాజ‌కీయ నాయ‌కుడు కాదు. ఆయ‌న జీవితంలో అత్య‌ధిక భాగం ప్ర‌జ‌ల‌తో గ‌డిపిన వ్య‌క్తి. కుటుంబాన్ని త్యాగం చేసి ప్ర‌జాసేవ‌లోనే మునిగి పోయిన త్యాగ‌ధ‌నుడు. గ‌తంలోనూ కాంగ్రెస్ పార్టీ త‌ప్పుచేసి చేసిన త‌ప్పును స‌రిదిద్దుకొని రాజ‌శేఖ‌ర్‌నే మ‌ద్ద‌తు ప‌లికింది.  మ‌న నాయ‌కుడే రేప‌టికి కాబోయే ఎమ్మెల్యే, మంత్రి నో డౌట్‌. చివ‌ర‌గా ఒక్క మాట‌. దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ ఒక్క బ‌హిరంగ స‌భ‌లో చెప్పిన మాట‌లే మ‌ర్రిరాజ‌శేఖ‌ర్ మ‌చ్చ‌లేని వ్య‌క్తిత్వానికి, ప్ర‌జ‌ల కోసం ప‌రిత‌పించిన విధానాన్ని స్ప‌ష్టం చేస్తుంది. .... మ‌ర్రిరాజ‌శేఖ‌ర్ ప్ర‌తి రోజు చెవిలో జోరిగలా సొద‌పెడుతుంటాడు. ఎప్పుడు త‌న నియోజ‌క‌వ‌ర్గం గురించి, ఇక్క‌డి అభివృద్ది గురించే చెబుతుంటాడు. ఇటువంటి ఎమ్మెల్యే మీకు ఉండ‌టం అధృష్టం ... మ‌హానేత కితాబు చాల‌దా .  మ‌ర్రిరాజ‌శేఖ‌ర్ ఎలాంటి  వాడో చెప్ప‌టానికి ...కాబోయే మంత్రి రాజ‌శేఖ‌ర్‌కు శుభాకాంక్ష‌ల‌తో 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: