కొందరి జీవితాలు స్పూర్తి నిస్తాయి.అలా ఎదిగిన వ్యక్తి మన ప్రాంతానికి చెందిన వారు అనే భావన ఆ వ్యక్తిపై అభిమానాన్ని, ప్రేమను మరింతగా ఇముదింపచేస్తాయి.
చిలకలూరిపేటకు చెందిన ఎంఎం నాయక్(ఎం మల్లిఖార్జుననాయక్) రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా నియమితులయ్యారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక దశలవారిగా మద్యపాన నిషేదం పక్కాగా అమలు చేయటానికి సిద్దమైంది. ఈ దిశల్లో సమర్దవంతమైన అధికారిగా పేరు పొందిన ఎంఎం నాయక్‌ను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా నియమించటం విశేషం. ప్రస్తుతం ఏపీఎస్‌పీడీసీఎల్ సీఈవోగా వ్యవహరిస్తున్న ఎంఎం నాయక్ ఇకపై ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా వ్యవహరించనున్నారు. చిలకలూరిపేట సుగాలికాలనీకి చెందిన ఐ.ఏ.ఎస్. అధికారి మూడావతు మల్లిఖార్జున నాయక్ కోటప్పకొండ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారిగా పదవీ విరమణ చేసిన మూడావతు బలరాం నాయక్, లలితాబాయి దంపతుల పెద్ద కుమారుడు. లక్ష్యాలను ఏర్పరుచుకోవటం,అందుకు తగ్గ కార్యదీక్ష ఎవరినైనా ఉన్నత శిఖరాలకు చేరుస్తుందన్న విషయానికి నిదర్శనంగా నిలుస్తారు ఎంఎం నాయక్.
చిలకలూరిపేటలోని ఆర్‌వీఎస్‌సీవీఎస్ హైస్కూలో పదో తరగతి వరకు చదువుకొన్న ఎంఎం నాయక్ ఇంటర్మీడియట్ విద్యను నాగార్జునసాగర్ ఏపీఆర్‌జేసీలో పూర్తి చేశారు. అనంతరం ఆంధ్రయూనివర్శటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి కొద్ది కాలం రోడ్లు భవనాల శాఖలో జేఈగా, ఫ్యాక్టరీ ఇన్సెపెక్టర్‌గా ఉద్యోగాలు చేశారు. 2015 సివీల్స్ రాసి ఐఏఎస్‌కు సెలక్ట్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసిస్టెంట్ కలెక్టర్‌గా మచిలీపట్నం సబ్ కలెక్టర్‌గా,శ్రీశైలం ఐటీడీఏ పీవోగా , ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ గా ,గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా, రాష్ట్ర మీ సేవా డైరెక్టర్‌గా , విజయనగరం కలెక్టర్‌గా పనిచేస్తూ,ఏపీఎస్‌పీడీసీఎల్ సీఈవోగా పనిచేశారు.
చిలకలూరిపేటకు చెందిన ఎంఎం నాయక్ రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని పేట ప్రజల తరుపున కోరుకుంటూ

Post A Comment:
0 comments: