చిలకలూరిపేట నియోజకవవర్గంలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్దమౌతుంది. నియోజకవర్గ పరిధిలో ఉన్న పంచాయతీల్లో ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి విజయం సాధించిన వైసీసీ తన సత్తా చాటతానికి సిద్దం అవుతుంది. మరోవైపు తన ఆధిపత్యాన్ని నిరూపించుకొని గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతానికి సర్పంచ్ ఎన్నికల్లే కీలకమని టీడీపీ భావిస్తుంది.
ఇందుకు తగ్గట్లే అధికారులు పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితాను ప్రచురించిన అధికారులు, సామాజిక గణనలో నిమగ్నమయ్యారు. ఈ నెల 20న కులాల వారి ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్నారు. పోలింగ్ కేంద్రాలను గుర్తించి అభ్యంతారాలు స్వీకరించారు. అభ్యంతరాలను పరిష్కరించి 18వ తేదీన పోలింగ్ కేంద్రాల జాబితా విడదల చేయనున్నారు. ఈ ఎన్నికలను ఎప్పటిలాగే బ్యాలెట్ పద్దతిలో నిర్వహించనున్నారు. సర్పంచ్ అబ్యర్దులకు గులాబి, వార్డు సభ్యులకు తెలుపురంగు బ్యాలెట్ పత్రాలు కేటాయించనున్నారు. తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో నోటా గుర్తును కూడా బ్యాలెట్ పత్రంలో ముద్రించనున్నారు. మొత్తం మీద సర్పంచ్ ఎన్నికల హడావిడి మొదలైంది.


Post A Comment:
0 comments: