ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అర్బన్‌సీఐ సూర్యనారాయణ చర్యలు ప్రారంభించారు. పెరిగి పోతున్న ఆక్రమలతో కుంచుకు పోతున్న రోడ్లు, వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలాలు లేకపోవటం, ట్రాఫిక్ నిబందనలపై ప్రజలల్లో కొరవడిన చైతన్యం సమస్యను జఠిలం చేస్తున్నాయి. ట్రాఫిక్ సమస్య ఒక్క పోలీస్లకు సంబంధించిన వ్యవహారమేనా...? మున్సిపాలిటి అధికారుల పాత్ర ఎంత... ? వ్యాపారుల పాత్ర ఎంత ..? పట్టణ ప్రజల పాత్ర ఎంత అనేది ఒక్కసారి విశ్లేషించుకుంటే మూలం ఎక్కడ ఉందో బోధపడుతుంది.
చిలకలూరిపేట పట్టణం అభివృద్ది చెందుతున్న ప్రాంతం. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలతో పాటు ప్రకాశం సరిహద్దుగా ఉన్న పలు గ్రామాలకు పట్టణం ఒక వ్యాపారకేంద్రం. దీంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ది చెందటంతో పలు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కార్మికులు తమ దైనందిక వ్యవహారాలలో భాగంగా పట్టణాన్ని సందర్శిస్తుంటారు. 2011 లెక్కల ప్రకారం పట్టణ జనాభ 1.05లక్షలు కాగా ఈ లెక్కలు ఇప్పటికి రెండింతలు అయ్యాయి. రోజుకు ఇతర ప్రాంతాలకు చెందిన 30వేల మంది కూడా పట్టణాన్ని సందర్శిస్తుంటారు. నానాటికి పెరుగుతున్న జనసందర్శనతో పట్టణంలో ట్రాఫిక్ సమస్య నానాటికి తీవ్రరూపం దాలుస్తుంది.
ట్రాఫిక్ సమస్య తీవ్ర రూపం దాల్చటానికి మున్సిపల్ అధికారుల నిర్వాకమే ప్రధాన కారణమని చెప్పవచ్చు. పట్టణ ప్రణాళిక విభాగం నిస్తేజంగా మారటం, గతం నుంచి పనిచేసిన అధికారులు అవినీతి పాల్పడటంతో రాత్రికి రాత్రే అక్రమణలు పెరిగి పోతున్నాయి.. వాణిజ్య సముదాయాలకు అనుమతులు ఇచ్చే సమయంలో పార్కింగ్ స్థలాలు ఉన్నాయా లేవా అన్న ప్రాధమిక విషయాన్ని కూడా విస్మరించటంతో ట్రాఫిక్ సమస్యకు మూలకారణంగా మారింది. పట్టణంలోని పలు కళ్యాణమండపాలకు సైతం పార్కింగ్ స్థలాలు లేకపోవటంతో వివాహాది శుభకార్యాల సమయంలో
సగటు మనిషి పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడులా మారిపోతాడు. బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు కేటాయించే సమయంలో, వాటిని పర్యవేక్షించే విషయంలోనూ నిర్లక్ష్యం పట్టణ ప్రజల పాలిట శాపంగా మారింది. వీరి నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఆక్రమణల కారణంగా 44 కాల్వలు పూడికలు తీసే పరిస్థితి కూడా లేదు. మరోవైపు పట్టణంలోని దుకాణాల ముందు తోపుడుబండ్ల, టిఫెన్ సెంటర్లు, చిరువ్యాపారాలు పెట్టుకోవటానికి అనుమతి ఇస్తూ అద్దె వసూలు చేస్తుంటారు. ఇందువల్ల కూడా ట్రాఫిక్ సమస్య పెద్దదౌతుంది. ఇక వాహనదారులు, ఆటో డ్రైవర్లు కూడా ట్రాఫిక్ సమస్యకు కారణమౌతున్నారు. అస్థవ్యస్థమైన పార్కింగ్, కీలక మలుపుల వద్ద ఆటోడ్రైవర్లు ఆటోలో పార్కింగ్ చేయటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ అంశాలపై దృష్టి సారించండి....
పట్టణంలో నిర్ధిస్థ సమయంలోనే పట్టణంలోకి భారీ వాహనాలు ప్రవేశించేలా చర్యలు తీసుకోవాలి.
లోడింగ్, అన్‌లోడింగ్ కు ప్రత్యేక సమయాలు కేటాయించాలి
తోపుడు బండ్లు, చిరువ్యాపారులకు, వారి జీవనోపాధి దెబ్బతినకుండా నిర్ధిస్టమైన స్థలంలోపే వ్యాపారులు నిర్వహించుకోవటానికి అనుమతి ఇవ్వాలి.
మార్కెట్ సెంటర్, ఇతర ప్రాంతాలలో తోపుడు బండ్ల వ్యాపారులకు కొన్ని హద్దులు సూచించి, ఆ హద్దులోనే వ్యాపారాలు నిర్వహించుకోవటానికి అనుమతి ఇవ్వాలి.ఈ ప్రాంతంలో పోలీసులు ఉన్నా పరిస్థితిలో మార్పు ఉండదు. కాబట్టి ఈ ప్రాంతాలలో సీసీ కెమోరాలు అమర్చి పర్యవేక్షించవచ్చు.
పట్టణంలో వన్‌వే ట్రాఫిక్ విధానం సమర్ధవంతంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలి.
పాఠశాలలు, కళాశాలలు వదలిసమయాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులను కేటాయించాలి.
మున్సిపల్ అధికారులు పార్కింగ్ ప్రదేశాలను కేటాయించాలి.
అక్రమణల నివారణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి.
చివరగా ఒక మాట చిరువ్యాపారుల జీవనోపాధికి అంతరాయం కలకుండా ...చిత్తశుద్ది కలిగి చేసిన చేసిన కార్యంబు కొంచమైనా కాని అది కొదవకాదు.. అన్నట్లు చిత్తశుద్దితో ట్రాఫిక్ సమస్యపై దృష్టిసారించిన అధికారులకు సహకరిద్దాం.



Post A Comment:
0 comments: