ఇక్కడ అధికారులు ఎవరికివారే యమునాతీరే అన్నట్లు వ్యవహరిస్తుంటారు. ప్రజా సమస్యలు పట్టవు. అధికారుల మద్య సమన్వయం ఉండదు. ఇదంతా చిలకలూరిపేట మున్సిపాలిటీ తీరు.ఇప్పుడు కౌన్సిల్ పదవికాలం పూర్తియైన తరువాత ప్రజాప్రతినిధులు లేరు...ప్రజలను అధికారులే పట్టించుకోవల్సిన పరిస్థితుల్లో పురపాలక సంఘంలో బాధ్యతలు స్వీకరించే నూతన కమిషనర్ అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఎన్నికలకు ముందు బాధ్యతలు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన శివరామకృష్ణ బదిలీపై వెళ్లటంతో ఆయన స్థానంలో నెల్లూరు కార్పోరేషన్ డిప్యూటి కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న సీహచ్ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించనున్నారు. లక్షకు పైగా జనభా కలిగి. 34 వార్డులు గా విస్తరించి. గ్రేడ్-1 మున్సిపాలిటీ గా ఉన్న పట్టణంలో పలు సమస్యలు నూతన కమిషనర్‌కు సవాళ్లుగా మారనున్నాయి.
మంచినీటి సమస్యే మొదటి సవాలు..
పట్టణ ప్రజలకు క్షిత మంచినీటిని అందించాలన్న లక్ష్యంతో 1970లో మొదటి మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. 2001వ సంత్సరంలో రెండవ మంటి చెరువు ద్వారా నీటిని నిల్వ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. పాతచెరువు చెపాసిటికీ9 50 మిలియన్ లీటర్లు కాగా, నూతన చెయవు చెపాసిటీ 2.690 మిల్లీ లీటర్లు. ప్రస్తుతం ఊ్న పెడు చెరువులను రోజు మంచినీరు సరఫరా చేయ టానానికి అనుగుణంగా 2031 సంవత్సరం వరకు వినియోగించుకొనే వీలుంది. పట్టణంలో 87 కిలోమీటర్ల మేర విస్తరించిన వాటర్ పైపులైన్లలలో అప్పుడప్పుడు సంభవిస్తున్న లీకులు, ఇటు ప్రజలను, అటు అధికారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పలు ప్రాంతాలలో పైపులైన్లు ఏర్పాటు చేసి సుమారు దశాబ్దాలు గడుస్తున్నాయి. 14 సంవత్సరాల కాలపరిమితికే పైపులైన్ల లను మార్చాల్సి ఉండగా ఇప్పటివరకు పైపులైన్లను మార్చకపోవటం విశేషం. ఒక కిలోమీటర్ పరిధిలో 25 లీకులు ఏర్పడటం, వాటిని సరిచేసేలోగా మరో చోట లీకులు ఏర్పడం ఆనవాయితీగా మారింది.కొత్త కమిషనర్‌కు తాగునీటి సమస్యే ప్రధాన సమస్యగా మారనుంది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు కేవలం 20 రోజులకే సరిపడే అవకాశం ఉంది. పట్టణ ప్రజలకు తాగునీటి అవసరరాలు తీర్చటానికి ప్రత్యామ్నయ మార్గాలు లేకపోవటంతో గతంలో నీటి ఎద్దడి తలెత్తినప్పుడు ఓగేరువాగు నీటిని సరఫరా చేసి విమర్శల పాలయ్యారు. ఆగస్టువరకు సాగర్ జలాలు విడదల కాకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో నీటి కష్టాలు తప్పేటట్లు లేవు.
మెరుగుపడని పారిశుధ్యం..
. చిలకలూరిపేట పట్టణంలో రోజుకు పట్టణ ప్రజల ద్వారా 46 మెట్రిక్ టన్నుల చెత్త, బయట నుంచి వచ్చే సందర్శకుల ద్వారా మరో 15 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. పారిశుధ్యం కోసం తీసుకుంటున్న చర్యలు పట్టణంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమౌతున్నాయి. శివారు కాలనీలో మురుగునీటి వ్యవస్థ కూడా అధ్వానంగా తయరైంది. రోజుకు పట్టణంలో 80 లక్షల లీటర్ల మురుగునీరు విడుదల అవుతుండగా ప్రధాన కాల్వలన్నీ శిధిలావస్థకు చేరటంతో చినుకుపడితే దాలు మురుగునీరు వీధులలో పొంగి ప్రవహిస్తుంది. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ప్రధాన డ్రైన్లల నిర్మాణం జరగకపోవటంతో ఇరువైపులా ఉన్న ప్రజలకు కష్టాలు తప్పటం లేదు. దీంతో పాటు పట్టణంలో ఉన్న 14 కాల్వలపై అక్రమణలతో కనీసం పూడికలు తీసే అవకాశం లేదు.
ఇక పట్టణంలోని పార్కులు అభివృద్ధికి నోచుకోక ప్రజలకు ఆహ్లాదం కరువైంది.పాలిథిన్ కవర్ల నిషేదం అటకెక్కింది. రోజు రోజుకు అక్ర్రమణలు ప్రజలకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. టౌన్‌ప్లానింగ్, మెప్మా విభాగాలలో అవినీతి అరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీంతో పాటు పురపాలక సంఘ ఉద్యోగుల ఆంతర్గత వివాదాలు ప్రజలకు శాపంగా మారుతున్నాయి. రానున్న మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీనివాస్ ఈ సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తారో..? అని ప్రజలు ఎదురుచూస్తూన్నారు.



Post A Comment:
0 comments: