సోషల్ మీడియా ... ఈ పేరు వింటే చాలు చిలకలూరిపేటలో అనేక మందికి నిద్రపట్టడం లేదు. ఎప్పుడు ఏ వార్త దావానంలా వ్యాప్తి చెందుతుందో, ఫేసబుక్, వాటప్స్ ఎక్కడ ఎవరిపై ఎవరు విరుచుకుపడతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియా వాలెంటర్లను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. మరోవిధంగా చెప్పాలంటే ఈ విషయంలో పోలీసులు తమ హద్దులు కూడా దాటి ప్రవర్తిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే కొంతమంది ఆధికారులు కూడా ఈ విషయంలో బలిపశువులుగా మారనున్నారన్నది వాస్తవం. అసలు చిలకలూరిపేట నియోజకవర్గంలో ఏం జరుగుతుంది...? హద్దులు దాటి వ్యక్తిగత దూషణలకు ఎందుకు దిగుతున్నారు..? సోషల్ మీడియాలో వీరికి లక్ష్మణ రేఖ లేదా ..?
చిలకలూరిపేట నియోజకవర్గంలో కాని, మరెక్కడైనా కాని రాజకీయపార్టీలకు అనుగుణంగానే సోషల్ మీడియా ఉంటుంది. వైరి పక్షాలు ఇందు కోసం ప్రత్యేకించి కొంతమంది సోషల్ మీడియా టీమ్లు కూడా ఏర్పాటు చేసుకుంటుంటారు. ఎన్నికలకు ముందు గతం కన్నా భిన్నంగా ఈ సారి సోషల్ మీడియా టీమ్లు విస్తతమయ్యాయి. గత టీడీపీ ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇవ్వటం, కొంతమంది ఫుల్టైమ్ పార్ట్ టైమ్ వ్యక్తులను ఏర్పాటు చేసుకోవటం జరిగింది. కాని వాస్తవంగా ఎన్నికలకు ముందు టీడీపీ టీమ్ చతికిల పడగా వైసీపీ టీమ్ స్వచ్చందంగా ముందంజలో నిలిచింది. సరే ఎన్నికలు ముగిసాయి. రాష్ట్రంలోనూ, చిలకలూరిపేట నియోజకవర్గంలోనూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వ్యక్తిగత,పార్టీల దూషణలతో మునిగిపోయిన సోషల్ మీడియా టీమ్ కు విరామం లభించింది. ఎన్నికలకు ముందు జరిగిన కొన్ని పరిణామాలు, సోషల్ మీడియా టీమ్లో ఉన్న కొంతమంది వ్యవహించిన తీరును ఆప్పట్లోనే చిలకలూరిపేట న్యూస్ ఖండించింది.(https://www.chilakaluripetnews.com/2018/10/blog-post_27.html) అక్టోబర్ 27,218 పోస్టింగ్ లో సోషల్‌మీడియాకు మన నైతిక విలువలే ఎడిటింగ్. సమన్వయంతో వ్యవహరించటమే లక్షణరేఖ. ఎక్కవమంది హుందా వ్యవహరిస్తుండగా కొంతమంది వ్యక్తిగత దూషణలకు పాల్పడటం, రాగవిధ్వేషాలను రెచ్చగొట్టేలా పోస్టింగులు పెట్టడం చేస్తున్నారు. ఇందువల్ల పలువివాదాలకు కారణమౌతున్నాయి. శృతి మించితే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న విషయం తెలుసుకోవాలి. ... అంటూ హెచ్చరించాం .
వ్యక్తిగత విమర్శలకు పాల్పడటం, కుల,మత,వర్గాలను రెచ్చగొట్టే విధంగా పోస్టింగులు పెట్టడం ఇదంతా ఎన్నికలలో హోరులో కలిసి పోయింది. కాని ఎన్నికలు ముగిసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదులు అందటం, పోలీసులు కొంతమందిని ఎంపిక చేసి వారిని కౌన్సిలింగ్ నిర్వహించటం జరిగింది. అనంతరం టీడీపీకి చెందిన వారిని, వైసీపీ లో మరో వర్గానికి చెందిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేయటం కొనసాగింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ప్రాముఖ్యత, చిలకలూరిపేటలో వివాదాలకు కారణమౌతున్నతీరు, ఇందులో రాజకీయ పార్టీలు, పోలీసుల పాత్ర తదితర అంశాలను చర్చించుకుందాం. ఇందులో భాగంగానే చిలకలూరిపేట సోషల్ మీడియాకు ఉద్యోగులు ఎందుకు భయపడుతున్నారు...! సోషల్ మీడియా కారణంగా ఇక్కడ ఉద్యోగం చేయనని వెళ్లిన అధికారి ఎవరు..! సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్ల కారణంగా జరిగిన వివాదాలు, ఘర్షణలు... సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్ కు ఓ రాజకీయనాయకుడు ఏం చేశాడు తదితర అంశాలపై సమగ్ర కథనాలు త్వరలో....


Post A Comment:
0 comments: