రాజకీయాలకు కొత్త. ఎన్ఆర్ ఐ గెలిచిన తరువాత ఇక్కడ ఉంటుందా..? మా సమస్యలపై అవగాహన లేదంటాగదా..? పార్టీలో ఉన్న అంతర్గత సంక్షోభాన్ని ఎలా తట్టుకుంటుంది..? మహిళ గదా ప్రజల్లోకి చొచ్చుకోపోతుందా...? ఇవే ప్రశ్నలు చిలకలూరిపేట నియోజకవర్గంలో విడదల రజని కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికల తరువాత, ముందు వినిపించాయి. ఆమె ఎమ్మెల్యేగా గెలిచి ఆరు నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు ప్రజలు ఆ విడదల రజని గురించి ఎమనుకుంటున్నారు. ఆమె పాలనపై ప్రజలకు ఉన్న అభిప్రాయం ఏమిటి..? తెలుసుకొనే ప్రయత్నం చేసింది చిలకలూరిపేట న్యూస్.
చిలకలూరిపేట రాజకీయాలు, మిలిగిన నియోజకవర్గ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి. తమకు మేలు చేస్తే ఎంతగా పైకి ఎత్తుకుంటారో...? తప్పు చేస్తే ఆ పరిణామాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. ఈ విషయం గత పరిశీలిస్తే స్ఫష్టమౌతాయి. అసలు విడదల రజని ఎవరు.? అనే ప్రశ్న వేసుకుంటే. పురుషోత్తమపట్నానికి చెందిన మాజీ మార్కెట్‌యార్డు ఛైర్మన్ విడదల లక్ష్మీనారాయణ కోడలు. విడదల కుమారస్వామి భార్య ఒక్కప్పుడు ఇంతే తెలుసు. మార్కెట్‌యార్డులో జరిగిన ఒక కార్యక్రమానికి తెలుగుదం ఉట్టిపడేలా రూపురేఖలతో విడదల లక్ష్మీనారాయణతో పాటు హాజరైన ఆమెను ప్రజలు ఆసక్తిగా గమనించారు.
కొన్ని విషయాలలో కొందరిని స్పూర్తి గా తీసుకోవాలి. సాధారణ గృహిణి, ఐటీ రంగమే ప్రపంచం. భర్తతో కలసి వ్యాపారాన్ని విస్తరించుకొనే పనిలో ఉండే విడదల రజని అనుహ్యంగా రాజకీయాల్లో ప్రవేశించారు. విడదల పౌండేషన్ ద్వారా సేవా కార్యాక్రమాలు చేస్తూ వచ్చిన విడదల రజనికి టీడీపీకి ఆమె కుటుంబం రాజీనామా చేయటం, చిలకలూరిపేట వైసీసీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆమె పేరు ప్రకటించటం అనూహ్యంగా జరిగిపోయాయి. అప్పుడే తేలిపోయింది అప్పటి రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఒక మహిళ ఎదుర్కొబోతున్నారని.
చిలకలూరిపేట చరిత్ర, రాజకీయ పరిణమాలు, నైసర్గిక స్వరూపం, కులసమీకరణలు, ఓట్లు, తమతో కలిసి వచ్చే నాయకులు తదితర విషయాలను అప్పటికే రజని మరిది విడదల గోపినాధ్ సేకరించి పెట్టారు. గోపి గతం నుంచి కాంగ్రెస్‌పార్టీ,టీడీపీలో పనిచేసిన అనుభవం,వ్యూహాలు ఆమెకు కలసొచ్చాయి. బ్యాక్‌గ్రౌండ్ సిద్దమైంది. ఎన్నికలలో పోటీ చేయటానికి వైసీసీ అధిష్టానం ఆమెకే టికెట్ కేటాయించారు.
ఇక ప్రజల్లోకి వెళ్లాలి. ప్రచారం నిర్వహించాలి. అప్పటికే మూడు పర్యాయాలు నియోజకవర్గంలో గెలుపొంది మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు తన గెలుపు నల్లేరుపై నడక అని భావించారు. ప్రత్యర్ధిని తక్కువగా అంచనా వేశారు. ఈ క్రమంలోనే విడదల రజని అనూహ్యంగా ప్రచారం ప్రారంభించారు. రోడ్లపై నుంచి చేతులు ఊపుకుంటే, అభివాదం చేసుకుంటూ ఎన్నికల ప్రచారం ముగిసిందను కొనే రాజకీయవే్త్తలకు భిన్నంగా ప్రజల ఇళ్లలోకి వెళ్లారు. కూలీలు పనిచేస్తుంటే పొలం పనుల్లో వారిని కలిసి వారు పెట్టిందే తిన్నారు. అన్నీవర్గాల ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో తమ ఇంటి ఆడపడుచుగా భావించారు. ఇదంతా ఎన్నికల కోసం చేసే నటనగా , రాజకీయ ఎత్తుగడగా ప్రత్యర్ధి పార్టీ భావించి ప్రచారం చేస్తే, ప్రజలు మాత్రం మనస్పూర్తిగా ఆమెతోనే తమ జీవితాల్లో మార్పు వస్తుందని నమ్మారు. మరోవైపు బీసీలు తమకు లభించిన అరుదైన అవకాశంగా భావించి ఓట్లు వేసి గెలిపించారు.
ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రత్యర్ధి పార్టీ చేసిన విమర్శలకు ఆమె పుల్‌స్టాఫ్ పెట్టారు. గెలిచిన వెంటనే విడదల రజని నియోజకవర్గ ప్రజలకు దూరం కాలేదు సరికదా మరింత దగ్గరయ్యారు. ప్రజలు, నాయకులు, కార్యకర్తల శుభకార్యాలకు ప్రతి నిత్వం హాజరౌతునే ప్రజల్లోనే ఉంటున్నారు.చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ది నిధులు తీసుకురావాటానికి కృషి చేస్తున్నారు. ఇక్కడే మనం మరో విషయం చెప్పుకోవాలి. పంతాలు,పట్టింపులు, వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారని విమర్శల నుంచి బయట పడాల్సి ఉంది. కార్పోరేట్ సెక్టార్‌లో పనిచేసిన అనుభవం రాజకీయాల్లో పనికి రాదన్న విషయం గుర్తు పెట్టుకోవాలి . కార్పోరేట్ కంపెనీ ప్రతినిధిగా ఉద్యోగులతో ఉన్న విధంగా ప్రజలతో ఉంటే ప్రజలు సహించరు. ప్రజాప్రతినిధిని కలవటానికి మధ్యలో ఉండే ఆటంకాలు ప్రజలు ఇష్టపడరు. మహిళగా కొంత ప్రతిబంధకాలు అడ్డుగా ఉన్న మాట వాస్తవమే అయినా ఎన్నికల సమయంలో తామతో ఉన్న రజనమ్మలా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Post A Comment:
0 comments: