ముంపు ముంచుకొచ్చే వరకు కళ్లు తెరవపోవటం, తీరా అంతా అయిపోయాక దిద్దుబాటు చర్యలు చేపట్టడం అలవాటైన తంతే. కొద్ది పాటి వర్షానికి చిలకలూరిపేట పట్ఠణం ముంపుకు గురిఅవుతుందంటే కారణం ఎవరు..? శనివారం ఉదయం వర్షం కురిసింది. అనుకోని అతిధిగా వచ్చిన వర్షానికి పట్టణం తడిసిముద్దయింది. ఒక్క హైవే రోడ్డు మినహ అన్ని ప్రాంతాలలో వర్షపునీరు వచ్చి చేరింది. వర్షం పడినప్పుడు కాల్వల ద్వారా నీరు బయటకు వెళ్లాలి కదా రోడ్లపై ఎందుకు నిలబడుతుంది. .. ఇది సామాన్యుడిలో మెదిలే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం విన్న తర్వాత ఎవరిని నిందించాలో మీరే నిర్ణయించుకోండి...
పట్టణాన్ని సుందవనంగా తీర్చిదిద్దాం.. అన్ని వాడల్లో మౌలిక సదుపాయాలు కల్పించాం... అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు కావు ఇప్పడు కావల్సింది. పట్టణంలోని ప్రధాన కాల్వల దుస్థితికి కారణమెవ్వరు..? చిలకలూరిపేట మున్సిపాలిటిగా అవతరించి 50 సంవత్సరాలు నిండాయి. గ్రేడ్ -1గా ఉన్న పట్టణంలో రోజుకు 80 లక్షల మురుగునీరు విడదలౌతుంది. పట్టణంలోనూ, అవసరమైతే నిధులు ఖర్చుపెట్టడానికి పొలాల్లోనూ కాల్వలు నిర్మించి ఎవరికివారు బేష్ అంటూ తమకు తామే భూజాలు చరుకుకొనే పెద్దలు అస్థవ్యస్థ డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దటంలో వైఫలం చెందారు.
పట్టణంలోని అంతర్గత కాల్వల నిర్మాణం ఒకే కాని ఆ కాల్వల ద్వారా వచ్చే మురుగునీరు బయటకు వెళ్లే మార్గం ఉందా అనే విషయంలో వైఫల్యం చెందారు. పట్టణంలోని ప్రధాన కాల్వలు ఏళ్ల నాడే శిదిలావస్తకు చేరాయి. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ప్రధాన డ్రైన్లు ఏళ్లనాడే వాటి రూపు కోల్పాయాయి. ఇది ఇలా ఉంటే పట్టణంలో ఉన్న 16 ప్రధాన కాల్వలు సైతం ఆక్రమణకు గురియ్యాయి. అంటే ఈ ప్రాంతంలో కనీసం పూడికలు తీయలేని పరిస్థితి ఉంది. ఏ అధికారి యైనా కొంచెం ముందుకు అడుగు వేసినా రాజకీయాల వత్తిడిలు ఏలాగు ఉంటాయి. మన దౌర్బగ్యం ఏమిటంటే మంచి చేయటానికి ఏ రాజకీయపార్టీ నాయకుడు ముందుకు రాదు. ప్రజలరా అలోచించండి ..


Post A Comment:
0 comments: