విజేతగా నిలిచిన తర్వాతే ఎవరైనా తలెత్తి చూస్తారు. ఆ విజయం సాధించటానికి ఒక వ్యక్తి పడిన కష్టం, ఆటుపోట్లు, నిద్రలేని రాత్రులు ఇవ్వన్ని ప్రతి విజేత జీవితంలో ఉంటాయి. అనుకున్న లక్ష్యం సాధించటానికి, తాను అనుకున్న మార్గంలోనే నడవటానికి ఎంతో సహనం, ఓర్పు అవసరమౌతుంది. చిలకలూరిపేటకు చెందిన ఎంతో మంది ఎన్నో విజయాలు సాధించి ముందంజలో నిలుస్తున్నారు. ఈ కోవలోనే నక్కా వీర బ్రహ్మం సినిమా రంగాన్ని నమ్ముకొని దర్శకుడి స్థాయికి ఎదిగాడు.కొద్ది రోజుల్లో తాను నిర్మించిన మొదటి సినిమా వర్మ రెడ్డి విడదల కానుంది. ఈ నేపథ్యంలో వీరబ్రహ్మం గురించిన వివరాలు, అతని ఎదుగుదల గురించి మీ కోసం ...
చిలకలూరిపేటకు చెందిన నక్కా బ్రహ్మానికి చిన్నతనం నుంచి సినిమా రంగమే ప్రపంచం. ఆయన తల్లిదండ్రులకు వ్యవసాయమే జీవనాధారం. పట్టణంలోని ఆర్‌వీఎస్‌సీవీఎస్ హైస్కూల్‌లో చదువుకొన్న ఇతనికి సినిమాలంటే పిచ్చి. ఈ సినిమా పిచ్చి ఇప్పుడు దర్శకుడ్ని చేసింది. ఇందుకోసం కోర్సును సైతం చేసినన ఇతనికి ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్‌రాయ్‌కు వీరబ్రహ్మం ఏకలవ్వ శిష్యుడు. దీంతో ఒకరాత్రి తాను పెద్ద దర్శకుడ్ని అయిపోదామని హైదరాబాద్‌కు ప్రమాణం కట్టాడు. సినిమా రంగం ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ గాడ్‌ఫాదర్ అనే వారు లేకుండా మనుగడ కష్టం. ఈ విషయం అందరిలాగే లేటుగా తెలిసివచ్చింది. ముందుగా జీవతాన్ని కొనసాగించటానికి ఒక మెడికల్ షాపులో పనిచేశాడు. అయినా సినిమాలో చేరాలన్న లక్ష్యం కుదురుగా కూర్చోనివ్వలేదు. ఇక్కడ పనిచేస్తూనే రామానాయుడు స్టూడియోలో యాడ్ డిపార్టెమెంట్‌లో చేరాడు. అక్కడి నుంచి వీర బ్రహ్మం అసిస్టెంట్ డెరెక్టర్‌గా మారాడు. లడ్డుకావాలా నాయన, దిక్కులు చూడకు రామయ్య, కాఫీబార్ ఇలా వరసగా అనేక సినిమాల్లో పనిచేశాడు
ఎక్కడ పనిచేసినా తాను దర్శకుడు కావాలన్న కల నెరవేరలేదు. ఈ దశలో ఐదు సంవత్సరాల నుంచి తాను అహర్నిశలు కష్టపడి తయారు చేసుకున్న కథకు సినిమాగా మలచటానికి నిర్మాత వివి మారుతి సహకరించారు. ఇంకేముందే తన కథకు మరింతమంది నిష్టాతులైన ప్రముఖులతో చర్చించి తుది రూపం ఇచ్చారు. మొత్తం కొత్తవారితో ఈ సినిమా షూటింగ్ వైజాగ్ భీమిలి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పూర్తి చేసుకుని విడదలకు సిద్దమైంది. తాను అనుకున్న లక్ష్యాన్ని ఇలా సాధించాడు. కొత్తవారితో సినిమా తీసినప్పుప్పటికి నాణ్యతలోనూ, సినిమా మేకింగ్‌లోనూ రాజీ పడలేదని చెప్పుకొచ్చారు. వర్మ రెడ్డి సినిమా ట హర్రర్, సస్పెన్స్ ఎంటరైటలర్‌గా అలరించనుందని, సినిమా అన్ని వర్గాల ప్రజలకు నచ్చే విధంగా తీర్చిదిద్దినట్లు చెప్పుకొచ్చారు.
తాను కలలు కన్న లక్ష్యాన్ని నెరవేర్చుకొని చిలకలూరిపేట వాసి వీరబ్రహ్మం ఈ సినిమాకు స్క్రిన్‌ప్లే,కద, దర్శకత్వం వహించాడు. సెన్సార్ తదితర అన్ని రకాల అంశాలు పూర్తి చేసుకొని ఈ సినిమా ఫిబ్రవరికి విడదల కానుంది. చిలకలూరిపేట కుర్రాడు, కొత్త దర్శకుడికి అభినందనలు చెబుదామా... అల్ ది బెస్ట్ వీరబ్రహ్మం ...



Post A Comment:
0 comments: