పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్దమౌతుంది.సర్పంచ్ ఎన్నికల హడావిడి మొదలైంది.నియోజకవర్గ పరిధిలో
త్వరలో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ ఎన్నికలు వరుసగా జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు ఏ ఊరిలో చూసినా ఇలాంటి చర్చలే జోరుగా సాగుతున్నాయి. ఆరున్నర ఏళ్ల తరువాత పంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. పలు పార్టీలకు చెందిన వ్యక్తులు తామే పోటీ చేస్తున్నామని ప్రకటిస్తుండటంతో గ్రామాల్లో పోటీతత్వం పెరుగుతుంది. అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయటం,రిజర్వేషన్లు కూడా ఖరారు కావటంతో ఎన్నికల ప్రక్రియ వేగం అందుకుంది. రాజకీయాల ద్వారా సామాజిక సేవ చేయాలని ఎన్నికల్లో పోటీకి యువతరం అసక్తి చూపుతోంది. ఈ సారి నాదెండ్ల మండలం గణపవరం,చిలకలూరిపేట మండలం మానుకొండవారిపాలెం, పసుమర్రు గ్రామాలు మున్సిపాలిటిలో విలీనం కావటంతో ఈ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఉండవు.
నియోజకవర్గ పరిధిలో ఉన్న పంచాయతీల్లో ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి విజయం సాధించిన వైసీసీ తన సత్తా చాటతానికి సిద్దం అవుతుంది. మరోవైపు తన ఆధిపత్యాన్ని నిరూపించుకొని గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతానికి సర్పంచ్ ఎన్నికల్లే కీలకమని టీడీపీ భావిస్తుంది. సర్పంచ్ అబ్యర్దులకు గులాబి, వార్డు సభ్యులకు తెలుపురంగు బ్యాలెట్ పత్రాలు కేటాయించనున్నారు. తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో నోటా గుర్తును కూడా బ్యాలెట్ పత్రంలో ముద్రించనున్నారు.
అగస్టు ఒకటో తేదీ 2018 పంచాయతీల పదవీకాలం ముగియడంతో అప్పటి టిడిపి ప్రభుత్వం పంచాయతీ పాలన కుటుంటు పడకుండా ప్రత్యేక అధికారులను నియమించి నేటికీ 17 నెలల కావస్తుంది. ప్రత్యేక అధికారులు సక్రమంగా గ్రామాలకు రాకపోవడం, నిధులు సక్రమంగా విడుదల కాకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. గ్రామాల్లోని ప్రజలు సమస్యలపై ప్రభుత్వానికి స్పందన కార్య క్రమంలో వినతులు అందచేస్తునే ఉన్నారు. పారిశుధ్యం, అంతర్గత రహదార్లు, వీధి దీపాలు నిర్వహణ కుంటుపడింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా పంచాయతీలకు రావాల్సిన నిధులు రావడం లేదు. ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటలా తయారు అయ్యింది. అధికారులు కూడ పూర్తి స్థాయిలో లేకపోవడం, ఒక అధికారికి మూడు నాలుగు గ్రామాల బాధ్యతలు ఉండటం ఇబ్బందికరంగా మారింది. దీంతో సమస్యలు నెలలతరబడి పెండింగ్‌లోకి వచ్చాయి. ప్రభుత్వ అధికారుల పాలనతో విసుగెత్తిపోయిన ప్రజలకు ప్రభు త్వం ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెల కొంది.



Post A Comment:
0 comments: