ఆర్ వి ఎస్ సి వి ఎస్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఉప్పలపాటి వెంకటేశ్వరరావుకు మూడు దశాబ్దాలకు పైగా విద్యా సాంస్కృతిక మరియు సామాజిక రంగా లో సేవలందించినందుకు గాను గ్లోబల్ క్రియేటివిటీ ఆర్ట్ అకాడమీ ఇన్ కార్పొరేషన్ యు.ఎస్.ఏ మరియు ఫిలాన్‌త్రోపిక్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా స్వామి వివేకానంద ఎమినెంట్ పర్సనల్ ఆఫ్ 2019 జాతీయ ప్రతిభా అవార్డులు ప్రకటించడం జరిగింది ఈ అవార్డు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ ఎన్టీఆర్ ఆడిటోరియం నందు ఈనెల 12వ తేదీన స్వామి వివేకానంద 158 జన్మదిన సందర్భంగా జరిగిన సభలో ఈ అవార్డు ప్రముఖులు వచ్చే అందుకోనున్నారు
తాను చేస్తున్న పని ఇంతే అని దులుపుకొని పోయే రకం కాదు ఆయన. విద్యార్దులు భవిష్యత్తు నిర్ధేశకులు అని ఆ దిశగా తన జీవితాన్ని వారి కోసం త్యాగం చేస్తున్న వ్యక్తి అతను. ఉపాధ్యాయుడు తలుచుకుంటే విద్యార్దుల జీవితాల్లో ఎలా వెలుగులు నింపగలదో చేసి చూపుతున్న ఆదర్శ ఉపాద్యాయుడు ఆయన. పట్టణంలోని ఆర్‌వీఎస్‌సీవీఎస్ హైస్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తున్న ఉప్పలపాటి వెంకటేశ్వరరావు ది విలక్షణమైన శైలి.
విద్యార్ధి జీవితం తెల్లకాగితం లాంటిదని, దానిపై మనం ఏది రాస్తే అదే అతని జీవితమౌతుందని బలంగా నమ్మతారాయన. వందమార్కులు, ర్యాంకులు జీవితంలో ఒక భాగమేనని విద్యార్ది పరిపూర్ణజీవిత వికాసానికి అవసరమైన విద్య అవసరమన్నది ఆయన భావన. ప్రతి విద్యార్ది భావి భవిష్యత్తులో ఎదగాలని, అత్యున్నత స్థాయిలో నిలవాలన్నదే ఆయన అకాంక్ష. ఇందుకు అనుగుణంగానే ఉప్పలపాటి విద్యార్దులతో మమేకమౌతారు.
ఆర్‌వీఎస్‌సీవీఎస్ హైస్కూల్ అనగానే పేద,మధ్య తరగతికి చెందిన విద్యార్దులు అత్యధికంగా ఉంటారు. మద్యతరగతి, పేద విద్యార్దుల జీవిత విధానం, వారి మనస్థత్వం వేరుగా ఉంటుంది. తామేమి సాధించలేమన్న ఆత్మన్యూనత భావం ఎక్కువగా ఉంటుంది.ఈ విషయం పాఠశాల హెచ్ఎంగా ఉప్పలపాటికి తెలుసు. అందుకే విద్యతో పాటు మహనీయుల జీవితాలను ప్రముఖులు, ఆయా రంగాలలో నిష్ణాతులైన వారితో వివరించి ఆత్మవిశ్వాసం నింపుతుంటారు.
వీటితో పాటు విద్యార్దుల వ్యక్తిత్వ వికాసం కోసం,వారి జీవిత పరిపూర్ణ వికాసం కోసం ఉప్పలపాటి ప్రతి విద్యాసంవత్సరంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో, సగటు మనిషిలో వ్యక్తిత్వ వికాసానికి పూనాది వేయటానికి పలు పుస్తకాలు రచించారు. గతంలో ‘జనగనమన జయహో' అంటూ జాతీయ గీతం గురించి వివరించే పుస్తకాన్ని వెలువరించిన ఆయన “జీవనక', 'గమ్యానికి మార్గం', 'వెలుగురేఖలు' మంచిమాట-ప్రగతికి బాట అనే పుస్తకాలను వెలువరించారు. ప్రతి పుస్తకం ప్రతి ఒక్కరికి హస్తభూషణంలాలా వీటిని రూపుదిద్దారు. ఈ పుస్తకాల్లో పునాది నుంచి మహోన్నత వ్యక్తిగా మారటానికి ఎవరికివారు ఎలా తీర్చిదిద్దుకోవాలో సవివరంగా పేర్కొన్నారు.
2008 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2010లో ఏపీ సార్వత్రిక విద్యాపీఠం జిల్లా ఉత్తమ కోఆర్డినేటర్ అవార్డు, 2012లో రాష్ట్ర | ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2013లో మదర్ థెరిస్సా సేవా ఆవార్డు, 2014లో గోబల్ పీస్ అవార్డు, 2015లో గ్లోబల్ టీచర్ రోల్ మోడల్ అవార్డులు లభించాయి. అతి ప్రతిష్టాత్మకమైన "భారతరత్న డా॥APJ అబ్దుల్ కలాం ఎక్కే లెన్సీ అవార్డు వరించింది... వీటితో రాష్ట్రస్థాయిలో పలు విద్యారంగ ప్రముఖుల ప్రశంసలు పొందారు.
చేసే పనిపట్ల నిబద్దత, కార్యదీక్ష, లక్ష్యాన్ని సాధించుకోవటానికి చేసే ప్రయత్నాలు ప్రతి మనిషిని మహోన్నతుడ్ని చేస్తాయి. పురస్కారం అందుకోబోతున్న ఉప్పలపాటికి అభినందనలు చెబుదామా... అల్‌ది బెస్ట్ సార్...


Post A Comment:
0 comments: