చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని తానేందో స్పష్టం చేసారు.తాను భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నారో, తన వ్యవహార శైలీ ఏమిటో అధికారులకు తెలిసివచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అన్ని విషయాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే రజని మరింత కఠింగా వ్యవహరించటానికి సిద్దమైనట్లు తెలిసిపోయింది.
కొన్ని నెలల పాలన కాలంలోనే నియోజకవర్గంలో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అలసత్వంపై అధికారులకు క్లాసులు తీసుకున్న ఆమె మొదటి సారిగా మున్సిపల్ శానిటరి ఇన్స్‌పెక్టర్ శివనాగేశ్వరరావుపై వేటు వేశారు. కావూరు పీహెచ్‌సీని సందర్శించి డాక్టరు,సిబ్బంది విధుల్లో లేకపోవటం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటం, చిలకలూరిపేట ఎంపీడీవో కార్యాలయం సందర్శించి అధికారులకు క్లాసు తీసుకోవటంతోనే తన పని ముగిసిందకోవటం లేదు.
ఇప్పుడు మున్సిపల్ శానిటరి ఇన్స్‌పెక్టర్ వ్యవహారంలోనూ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు అవినీతి అధికారులకు గుబులు రేపుతుంది. పలువార్డుల పరిధిలో పర్యటించి నప్పుడు పారిశుద్య సమస్యపైనే ప్రజలు ఫిర్యాదు చేయటం గమనించారు. జిల్లాలోనే డెంగీవ్యాధి ప్రబలటంలో చిలకలూరిపేట మున్సిపాలిటి ప్రధమ స్థానంలో నిలవటం గమనించదగ్గ విషయం. అప్పటికి ప్రజల నుంచి పారిశుధ్యంపై ఫిర్యాదులు వచ్చినా పలుమార్లు హెచ్చరించి వదలివేశారు. కాని ఏకంగా పారిశుద్య కార్మికులే శానిటరి ఇన్స్‌పెక్టర్‌పై ఫిర్యాదు చేయటం, అవినీతిని సాక్ష్యాధారాలతో బయటపెట్టడంతో శానిటరి ఇన్స్‌పెక్టర్‌ను విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు.ఇది ఒకరకంగా రజని పాలనలో అవినీతి అధికారిపై మొదటి వేటుగానే భావించవచ్చు.
అయితే ఇక్కడితో ఆగకుండా పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద పార్టీ ముసుగులో కొనసాగుతున్న దళారులను సైతం కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Post A Comment:
0 comments: