చిలకలూరిపేట అతిపెద్ద నగరంగా అవతరించనుంది. సమీపాన ఉన్న నాదెండ్ల మండలం గణపవరం, చిలకలూరిపేట మండలంలోని పసుమర్రు, మానుకొండ వారిపాలెం గ్రామాల విలీనంతో పేట మున్సిపాలిటి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటిగా మారనుంది. దీని నిమిత్తం ఇప్పటికే మూడు గ్రామాల పంచాయితీ తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపటం జరిగింది. .
చిలకలూరిపేట మేజర్ పంచాయతీ నుంచి 1964లో గ్రేడ్-3 మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. 1980లో గ్రేడ్ -2గా, 2001లో గ్రేడ్-1 అప్ గ్రేడ్ అయ్యింది. ప్రస్తుతం 34 వారులు కలిగి ఉన్న పట్టణం 18.13 చదరపు కిలో మీటర్లు విస్తరించి ఉంది. మూడు గ్రామాల విలీనంతో పట్టణ వైశాల్యం గణనీయంగా పెరగటంతో పాటు 38 వారులకు చేరుకోనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణంలో 1,01,398 మంది ఉండగా గణపవరంలో గ్రామంలో 21,386 మంది, పసుమర్రులో 1, 165, మానుకొండవారిపాలెంలో 2,461 మంది మొత్తం కలిపి 1,32,410 జనాల ఉన్నారు. అయితే ప్రస్తృత జనాబా లక్షా 50వేలకు పైబడి ఉండే అవకాశం ఉంది. అదే ఓట్ల విషయానికి వస్తే ప్రస్తుతం పట్టణంలో 87,022 ఓట్లు, గణపవరంలో 13,774. పసుమర్రులో 5,777, మానుకొండవారిపాలెంలో 1,862 కలిపి మొత్తం 1,08, 525 ఓటర్లు ఉన్నారు. గతంలో 34 వార్డులకు గాను సరాసరి వారుకు 2,660 ఓటర్లు ఉండేవారు. మూడు గ్రామాల విలీనంతో 38వార్డులకు సంబంధించి ఈ సరాసరిలో మార్పు రానుంది. కనిష్టంగా వారుకు 2,660 నుంచి గరిష్టంగా 3, 141గా నిబంధనలను అనుసరించి మార్పు చేర్పులు చేశారు.
ఇప్పుడు విలీనంతో మున్సిపాలిటి రూపురేఖలు మారుతున్నాయి. దీని వలన కలిగే మంచిచెడులను ఒకసారి పరిశీలిస్తే ...
మున్సిపాలిటి ఆదాయం పెరుగుతుంది. సత్వర అభివృద్ది సాధ్యమౌతుంది. విలీన గ్రామాలలో రోడ్లు, వీధి దీపాలు, మంచినీరు తదితర సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుంది. ఈ గ్రామాల పరిధిలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ది చెందుతుంది. ఇదంతా ఒక కోణం మరోకోణంలో ప్రస్తుత మున్సిపాలిటిలొ ఉన్న 34వార్డుల్లోనే తాగునీరు, పారిశుధ్యం సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల పట్టణంలోని పలు ప్రాంతాలలో డెంగీ వ్యాధి లక్షణాలతో పలువురు మృత్యువాత పడగా పలువురు రక్త కణాలు తగ్గాయని లక్షలాది రూపాయలు నష్టపోయారు. కొన్ని వార్డుల్లో కనీస మౌలిక సదుపాయలు కూడా కరువయ్యాయి. ఇదంతా మున్సిపాలిటి పరంగా అయితే గ్రామాల పరంగా చూస్తే పన్నులు పెరుగుతాయి. కొత్త గ్రామాల అభివృద్దిపై ఇప్పట్లో పట్టించుకోవటం జరగదు. అనుమతుల కోసం ప్రతి విషయానికి పట్టణానికి రావల్సి ఉంటుంది. పరిశ్రమలు ఏర్పాటుకు గతంలో మాదిరి సత్వర అనుమతులు లభించవు.ఆన్‌లైన్, అధికారుల అలసత్వంతో ఆలశ్యం జరుగుతుంది. మరి ఈ మార్పు మంచిదేనా...?


Post A Comment:
0 comments: