పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సైనికులకు స్మరించుకుంటూ నివాళులర్పించి దేశభక్తిని చాటుదామని ఆర్.వి.యస్.సి.వి.యస్. స్కూలు, ప్రధానోపాద్యాయులు ఉప్పలపాటి వేంకటేశ్వర రావు అన్నారు. “I STAND FOR THE NATION”అనే నినాదంతో అక్షరాకృతిలో పాఠశాల విద్యార్ధిని, విద్యార్థులు కొలువుదీరి అందరిని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాద్యాయులు ఉప్పలపాటి వేంకటేశ్వరరావు మాట్లాడుతూ మీరు ఎక్కడ ఉన్నా ,మీరు ఎలా ఉన్నా ,మీరు ఏ పని చేస్తున్నా,మనమందరం కలిసి దేశం కోసం ఫిబ్రవరి 14 వ తేదీ రోజు సాయంత్రం 3 గంటల 15 నిమిషాలకు, ఒక రెండు నిమిషాల సమయం కేటాయించి నిలబడుద్దాం జాతీయ గీతం పాడుదాం మరియు మన సైనికులకు సెల్యూట్ చేద్దాం.మన దేశం యొక్క ఔన్నత్వాని చాటిచెబుదాం.ఈ యొక్క కార్యక్రమంలో మీరుకూడా భాగస్వామ్యులు కండి అని పేర్కొన్నారు.
మీరు ఎక్కడ ఉన్న , మీరు ఎలా ఉన్న , మీరు ఏ పని చేస్తున్నా, మనమందరం కలసి దేశం కోసం రెండు నిమిషాలు సమయం కేటాయించి నిలబడి మన సైనికులకు సెల్యూట్ చేద్దాం. అమరువైన జవాన్లుకు నివాళులర్పించి దేశ భక్తిని చాటుదాం . పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సైనికులను స్మరిస్తూ " నాదేశం కోసం నిలబడతా" నినాదంతో ఫిబ్రవరి 14 న 3 గంటల 15 నిమిషాలకు జాతీయ గీతంతో శ్రద్ధాంజలి ఘటిద్ధాం. ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వామ్యులు కండి. మన దేశ భక్తిని చాటి మన దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెబుదాం!


Post A Comment:
0 comments: