అన్నీ ఎన్నికలు ఒక్కసారే వచ్చేసాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత మిని ఎన్నికల సమరం మొదలైంది. అంతా హడావిడి.. ప్రచారానికి సమయంలేదు. అభ్యర్ధుల ఎంపిక పూర్తికావాలి. దీంతో పాటు డబ్బు, మద్యం లేకుండా ఎన్నికలు కొనసాగాలి. ప్రతిపక్ష పార్టీ కన్నా ఈ సారి అధికార పార్టీలోనే అందోళన ఎక్కువగా ఉంది. ఏ మాత్రం తేడా జరిగినా సీఎం జగన్‌మోహనరెడ్డి హెచ్చరికలు కూడా గుబులు పుట్టిస్తున్నాయి. ఎట్టి పరిస్థితి 90శాతం గెలుపు కావాలి. టీడీపీ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. అధికార పార్టీ హావాలో నెగ్గుకురావటం, నాయకులు ముందుకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేయటం కష్టంగా ఉంది.
గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్ ఎన్నికలు వరుసగా జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇలాంటి చర్చలే జోరుగా సాగుతున్నాయి. సుదీర్ఘ తరువాత పంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. పలు పార్టీలకు చెందిన వ్యక్తులు తామే పోటీ చేస్తున్నామని ప్రకటిస్తుండటంతో గ్రామాల్లో పోటీతత్వం పెరుగుతుంది. రాజకీయాల ద్వారా సామాజిక సేవ చేయాలని ఎన్నికల్లో పోటీకి యువతరం అసక్తి చూపుతోంది. ఈ సారి నాదెండ్ల మండలం గణపవరం,చిలకలూరిపేట మండలం మానుకొండవారిపాలెం, పసుమర్రు గ్రామాలు మున్సిపాలిటిలో విలీనం కావటంతో ఈ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఉండవు.
ఈ సారి మున్సిపల్ ఎన్నికలు కూడా కీలకంగా మారాయి. విలీన గ్రామాల కలయికతో 38 వార్డులకు కలిపి ఎన్నికలు నిర్వహించనున్నారు.చిలకలూరిపేట మేజర్ పంచాయతీ నుంచి 1964లో గ్రేడ్-3 మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. 1980లో గ్రేడ్ -2గా, 2001లో గ్రేడ్-1 అప్ గ్రేడ్ అయ్యింది. ప్రస్తుతం 34 వారులు కలిగి ఉన్న పట్టణం 18.13 చదరపు కిలో మీటర్లు విస్తరించి ఉంది. మూడు గ్రామాల విలీనంతో పట్టణ వైశాల్యం గణనీయంగా పెరగటంతో పాటు 38 వారులకు చేరుకోనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణంలో 1,01,398 మంది ఉండగా గణపవరంలో గ్రామంలో 21,386 మంది, పసుమర్రులో 1, 165, మానుకొండవారిపాలెంలో 2,461 మంది మొత్తం కలిపి 1,32,410 జనాల ఉన్నారు. అయితే ప్రస్తృత జనాబా లక్షా 50వేలకు పైబడి ఉండే అవకాశం ఉంది. అదే ఓట్ల విషయానికి వస్తే ప్రస్తుతం పట్టణంలో 87,022 ఓట్లు, గణపవరంలో 13,774. పసుమర్రులో 5,777, మానుకొండవారిపాలెంలో 1,862 కలిపి మొత్తం 1,08, 525 ఓటర్లు ఉన్నారు. గతంలో 34 వార్డులకు గాను సరాసరి వారుకు 2,660 ఓటర్లు ఉండేవారు. మూడు గ్రామాల విలీనంతో 38వార్డులకు సంబంధించి ఈ సరాసరిలో మార్పు రానుంది. కనిష్టంగా వారుకు 2,660 నుంచి గరిష్టంగా 3, 141గా నిబంధనలను అనుసరించి మార్పు చేర్పులు చేశారు. దీంతో నియోజకవర్గ కేంద్రంలో ఉన్న మున్సిపాలిటి ఎన్నికలు రెండు పార్టీలకు కీలకం కానుంది.
ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి విజయం సాధించిన వైసీసీ తన సత్తా చాటతానికి సిద్దం అవుతుంది. మరోవైపు తన ఆధిపత్యాన్ని నిరూపించుకొని గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతానికి సర్పంచ్ ఎన్నికల్లే కీలకమని టీడీపీ భావిస్తుంది.
చిలకలూరిపేట స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం ఎవరిది..? వైసీసీ తన పట్టు నిలబెట్టుకుందా...? టీడీపీ పట్టు బిగిస్తుందా..? కొన్ని రోజుల్లో నే తేలనుంది.



Post A Comment:
0 comments: