chilakaluripet news, అత్య‌ధిక ప‌రీక్ష‌లతో .. అందిన విజ‌యం ,భ‌విష్య‌త్తు త‌రాల‌కు ఒక ఆద‌ర్శం

విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనే విజ్ఞ‌త‌గా వ్య‌వ‌హ‌రించాలి. క‌ష్టాలు వ‌చ్చిన‌ప్పుడే స‌రైన నిర్ణ‌యం తీసుకోవాలి. క‌రోనా మ‌హ‌మ్మారి చిల‌క‌లూరిపేట చుట్టూ పొంచి ఉండి, ఏ క్ష‌ణ‌మైనా మ‌న నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశించ‌టానికి అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతునే విజ్ఞ‌త‌గా వ్య‌వ‌హ‌రించారు. కార్యాల‌యాల్లో ఉండాల్సిన అధికారులు రోడ్ల‌పై , బ‌య‌ట‌కు తిరిగే ప్ర‌జ‌లు ఇళ్ల‌ల్లో ఉండటం వ‌ల్ల‌నే మ‌న చిల‌క‌లూరిపేట‌లో ఇప్ప‌టివ‌ర‌కు  క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా నివారించ‌గ‌లిగాం. 
ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష‌లు, తీసుకోవ‌ల్సిన ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు, ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా స‌మ‌న్వ‌యంతో ఎలా వ్య‌వ‌హ‌రించాలో చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌ని,అధికారులు చేసి చూపారు. ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతోనే ఈ విజ‌యం సాధ్య‌మైంది. ఈ క్ర‌మంలోనే కొన్ని పొర‌పాట్లు దొర్ల వ‌చ్చు. వ్యాపారులు,సామాన్య ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ్డ‌మాట వాస్త‌వ‌మే. ఇప్పుడు రాజ‌కీయాలు, చిన్న చిన్న త‌ప్పులు ప‌ట్టించుకోవ‌ల్సిన అవ‌స‌రం లేదు. 
అత్య‌ధిక ప‌రీక్ష‌లతో .. అందిన విజ‌యం 

క‌రోనా గురించి, దాని వ్యాప్తి గురించి అంత‌గా ప్రాచుర్యం లేని స‌మ‌యంలోనే చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం అప్ర‌మ‌త్త‌మైంది. జ‌న‌వ‌రి 19వ తేదీ నియోజ‌క‌వ‌ర్గంలో చైనా వెళ్లివ‌చ్చిన వ్య‌క్తిని ప‌రీక్షించి జ‌న‌వ‌రి 24వ తేదీ నెగిటివ్ ఫ‌లితం రావ‌టంతో ఇంటికే ప‌రిమితం చేశారు. అప్ప‌టి నుంచి చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో క‌రోనాపై విస్తృత ప్ర‌చారం ప్రారంభించారు. నియోజ‌వ‌ర్గంలోని నిర‌క్ష‌రాస్యులకు సైతం క‌రోనా విష‌యంలో పూర్తి అవ‌గాహ‌న క‌లిగింది. ఈ క్ర‌మంలోనే న‌ర‌స‌రావుపేటలో వైద్యం చేసిన వైద్యురాలికి క‌రోనా సోక‌టం, చికిత్స పొంది విజ‌య‌వంతంగా క‌రోనాను జ‌యించి ఇంటికి రావ‌టం పేట ప్ర‌జ‌ల్లో ధైర్యాన్ని నింపింది. అన్నింటిక‌న్నా చెప్పుకోవ‌ల్సింది క‌రోనా ప‌రీక్ష‌ల గురించి. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఇప్ప‌టి వ‌రకు 625 మందిని ప‌రీక్షించారు. ఇందులో మున్సిపల్, పోలీసు సిబ్బందితో పాటు వ‌ల‌స కూలీల‌, ల‌క్ష‌ణాలు ఉన్న ప్ర‌జ‌ల‌ను  ప‌రీక్షించారు. అన్ని నెగిటివ్ రిపోర్టులు రావ‌టంతో అంతా ఊప‌రి పీల్చుకున్నారు. 
ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రే క‌రోనా కేసు న‌మోదు కాలేదు. మ‌రికొన్ని రోజుల్లోనే చిల‌క‌లూరిపేట క‌రోనా ను జ‌యించిన నియోజ‌క‌వ‌ర్గంగా అధికారులు ప్ర‌క‌టించి, స‌డ‌లింపులు ఇచ్చే అవ‌కాశం ఉంది. అయితే భిన్న‌మైన ఆలోచ‌న‌లు, మ‌తాలు, కులాలు, వ‌ర్గాలు, పార్టీలతో ఉన్న ప్ర‌జ‌లు ఒక్క‌తాటిపై నిల‌చి క‌రోనాపై విజ‌యం సాధించ‌టం భ‌విష్య‌త్తు త‌రాల‌కు ఒక ఆద‌ర్శంగా నిల‌వ‌నుంది. ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు, అన్ని శాఖ‌ల అధికారుల‌కు,  స‌హ‌క‌రించిన ప్ర‌జ‌ల‌కు భావిత‌రం రుణ‌ప‌డి ఉంది. 


Axact

చిలకలూరిపేట న్యూస్

నిజం.. నిష్పక్షపాతం మా నైజం నిగ్గు తేల్చే నిజాల కోసం.. నిక్కచ్చైన విశ్లేషణల కోసం

Post A Comment:

0 comments: