లాక్‌డౌన్ వేళ ...నిరంత‌రాయంగా జామియా మ‌సీదు యువ‌కుల సేవా ప్ర‌స్థానం 

 రంజాన్‌ మాసంలో నీవు చేసే మంచి పని విలువ వెయ్యిరెట్ల ప్రయో జనాన్ని కలిగిస్తుందనేది ఇస్లాం విశ్వాసం. జకాత్‌లో చేసే దానం అల్లా  తిరిగి అన్ని రెట్లతో తిరిగిస్తాడనేది ముస్లీం సోదరుల విశ్వాసం.  సాటి మనిషికి సహాయం చేయడం, నిరుపేదలకు సాయం చేయడం, శాంతిగా జీవించడం అల్లా కు ఇష్టమైన పనులు. చిల‌క‌లూరిపేట‌కు చెందిన యువ‌కులు ప‌విత్ర రంజాన్ మాసం సంద‌ర్బంగా లాక్‌డౌన్ వేళ ప్ర‌వ‌క్త సూచించిన మార్గంలో న‌డుస్తూ ప‌లువురికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. 

ఇప్పుడు క‌రోనా వైర‌స్ విజృభిస్తున్న స‌మ‌యంలో ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించింది. లాక్‌డౌన్ నిరుపేద‌లు, వ‌ల‌స కూలీలు, యాచ‌కులు, అనాధుల  జీవితాల్లో పెను సంక్షోభం మొద‌లైంది. క‌నీసం తిండికి నోచుకొని దీన స్థితికి నెట్టివేయ‌బ‌డ్డారు. ఈ ద‌శ‌లో ఒక రోజు కాదు... రెండు రోజులు కాదు. నెల‌ల తర‌బ‌డి నిరుపేద‌ల‌ను ఆదుకోవ‌టానికి కొంత‌మంది యువ‌కులు చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాలు య‌జ్ఞాన్ని త‌ల‌పిస్తున్నాయి. 
ప‌ట్ట‌ణంలోని జామీయా మ‌సీదు ఏరియా క‌మిటి ఆధ్వ‌ర్యంలో లాక్‌డౌన్ సేవ‌ల‌లో కొత్త అధ్యాయానికి తెర‌తీసాయి. క‌మిటీ స‌భ్యులు స‌య్య‌ద్ న‌జీర్‌,  జ‌న‌తా మ‌హ‌మ్మ‌ద్, ఇత‌ర స‌భ్యుల స‌హ‌కారంతో లాక్‌డౌన్ ప్రారంభ స‌మ‌యంలో నిరుపేద‌ల ఆక‌లి బాధ‌ను తీర్చ‌టానికి భోజ‌నాన్ని వండి, స్వ‌యంగా ప్యాకింగ్ చేసి నిరుపేద‌ల‌కు పంపిణీ చేశారు. ఇదే స‌మ‌యంలో తాము చేస్తున్న కార్య‌క్ర‌మాన్ని మిత్రుల‌కు వాట‌ప్స్ ద్వారా షేర్ చేయ‌టంతో అనూహ్య స్పంద‌న ల‌భించింది. తాము సైతం అంటూ దాత‌లు ముందుకు వ‌చ్చారు. ఇది మొద‌లు వారి కార్య‌క్ర‌మం నిరంత‌రాయంగా కొన‌సాగుతునే ఉంది. 

భోజ‌నం వండ‌టానికి ,ప్యాకింగ్ చేయ‌టానికి స్థ‌లం డాక్ట‌ర్ చిలుకూరి శ్రీ‌రామార్తి వాడుకోవ‌టానికి అనుమ‌తి ఇస్తే, ప్ర‌తి రోజు భోజ‌నాన్ని   వండ‌టానికి వంట‌మాస్ట‌ర్ ఖాద‌ర్‌మ‌స్తాన్‌,  వంట సామాగ్రి అంద‌జేయ‌టానికి గౌస్ టెంట్ హౌస్ య‌జ‌మానికి ముందుకు వ‌చ్చారు. ఇలా ఎంద‌రో దాత‌లు పార్టీల‌కు, వ‌ర్గాల‌కు, మ‌తాల‌కు అతీతంగా ముందుకు రావ‌టం, యువ‌కులు స్వ‌చ్చంధంగా సేవ‌లు అంద‌జేస్తున్నారు. ప్ర‌తి రోజూ విధులు నిర్వ‌హిస్తున్న పోలీసులు, పారిశుధ్య కార్మికులు, ఆరోగ్య సిబ్బందితో పాటు దూర‌ప్రాంతాల‌కు పోతున్న డ్రైవ‌ర్లు, యాచ‌కులు, అభాగ్యుల ఆక‌లి తీరుస్తున్నారు.
 ఈ సంద‌ర్బంగా ఓ క‌వి చెప్పిన పాట ఇక్క‌డ అన్వ‌యించుకోవ‌చ్చు.. ఎవ‌రో ఒక‌రు న‌డ‌వ‌రా ముందుగా ...,ఎవరో ఒకరు ఎపుడో అపుడు...నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు....అటో ఇటో ఎటో వైపు...మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరీమొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ...వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది

Axact

చిలకలూరిపేట న్యూస్

నిజం.. నిష్పక్షపాతం మా నైజం నిగ్గు తేల్చే నిజాల కోసం.. నిక్కచ్చైన విశ్లేషణల కోసం

Post A Comment:

0 comments: