చిల‌క‌లూరిపేటలో  కంటోన్మెంట్ జోన్ల‌ను కుదించారు. చిన‌పీరు సాహెబ్ వీధి క‌రోనా బాధితులు ఉన్నా కంటోన్మెంట్ జోను అంక్షలు స‌డ‌లించి ఆ వీధికే ప‌రిమితం చేశారు. ర‌జ‌క‌వీదిలో ఉన్న మ‌హిళ కోలుకోవ‌టంతో చౌత్ర‌సెంట‌ర్ ప‌రిస‌ర ప్రాంతాల‌లో కంటోన్మెంట్‌ను తొల‌గించారు.  ప్ర‌భుత్వం కూడా లాక్ డౌన్ ను స‌డ‌లించింది.  అయితే ఇక స్వేచ్ఛగా బయట తిరిగేయవచ్చు అనుకుంటే పొరపాటు. కరోనా పొంచి ఉన్న ఈ సమయంలో మునుపటి కన్నా రెట్టింపు అప్రమత్తంగా మసలుకోవాలి. 


ఇప్పటివరకూ కలవలేకపోయిన స్నేహితులు, బంధువులను కలవాలనే తాపత్రయం సహజం. అయితే ఇందుకు మరికొంత సంయమనం పాటించాలి. లాక్‌డౌన్‌ సడలింపులు మొదలైన వెంటనే మునుపటి పరిస్థితులు వెంటనే సాధారణ స్థితికి రావు. ఇప్పటికీ కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం పొంచి ఉందనే విషయం గుర్తుపెట్టుకుని మసలుకోవాలి. మరీ ముఖ్యంగా కొన్ని పనులకు దూరంగా ఉండాలి.

విహారయాత్రలు వద్దు: కొన్ని నెలల వరకూ కుటుంబసమేతంగా విహారయాత్రలకు వెళ్లడం మానుకోవాలి. ప్రయాణమాధ్యమాలు ఉన్నంత మాత్రాన జనసమ్మర్దం ఉండే ప్రదేశాలకు ప్రయాణాలు మొదలుపెట్టడం సరి కాదు.  లాక్‌డౌన్‌ సడలింపులు కరోనా తగ్గుదలకు సంకేతాలు కావు. కరోనా వైరస్‌ దాడి నుంచి కాపాడుకోవాలంటే పూర్వం లాగే తరచుగా చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. చేతులు శుభ్రంగా ఉంచుకునే అలవాటు అలవరుచుకోవడం వల్ల కరోనాతో పాటు ఇతరత్రా వ్యాధికారక ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ పొందుతా
 ఎంతోకాలంగా కలవలేకపోయిన స్నేహితులను కలిసినప్పుడు విందులు, వినోదాలలో తేలిపోవాలని అనిపించడం సహజం. అయితే ఇలా అందరూ కూడే పబ్‌లు, క్లబ్‌ల ద్వారా కరోనా ఇన్‌ఫెక్షన్‌ ప్రబలే ప్రమాదం ఉంది. కాబట్టి మరికొంతకాలం పాటు స్నేహితులకు దూరంగా ఉండడమే మేలు.. జనసమ్మర్దం ఉండే ప్రదేశాలకు వెళ్లే ప్రతిసారీ తప్పనిసరిగా ఫేస్‌మాస్క్‌ వాడవలసిందే.. ఇంటికి చేరుకున్న తర్వాత ఈ మాస్క్‌ను తొలగించి, వెంటనే శుభ్రం చేసుకోవాలి. ఇలా మరికొంత కాలం పాటు జాగ్రత్తలను పాటిస్తేనే మ‌నం, మ‌న కుటుబం దీంతో పాటు స‌మాజం సుర‌క్షితంగా ఉంటుంద‌న్న విష‌యం మ‌రిచిపోరాదు. 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

1 comments:

  1. The Casino, Hotel and Tableau - DRMCD
    Enjoy live table 의정부 출장안마 games, 시흥 출장마사지 entertainment, and an easy-to-navigate experience at the 계룡 출장마사지 Casino, Hotel and Tableau. Enjoy the 서귀포 출장샵 perfect 순천 출장샵 casino experience with

    ReplyDelete