మూడు నెలలుగా బంధువులకు దూరం
విషాదాల్లో పరామర్శించ లేని దురవస్థ
అనుబంధాలపై కరోనా ప్రభావం పడింది. భౌతిక దూరం,మాస్కులు జీవితంలో భాగమయ్యాయి. పండుగలు మాయమయ్యాయి. శుభకార్యాలు, విందులు, వినోదాలు ఇప్పట్లో జరుపుకొనే పరిస్థితి లేదు. విషాదమేమిటంటే చనిపోయిన వ్యక్తి వద్దకు కూడా వెళ్లే పరిస్థితి లేదు. కలిసి ఉన్న మనిషి, బంధువులు, మిత్రులు చనిపోయినా పరామర్శల్లేవ్. ఎన్నోతగాదాలు, విభేదాలు ఉన్న వారు సైతం చనిపోయిన ప్పుడు కలుస్తారు. ఎందుకంటే పోయిన వ్యక్తి మళ్లీ రాడు కాబట్టి.. కాని ఆ సంప్రదాయం అటకెక్కింది.
ఏదైనా శుభకార్యం చేసుకొన్న దూరం నుంచే చూసి తరలించాల్సిందే. రికార్డు చేసిన విడియో చూసి తరించాల్సిందే. దూరంగా ఉన్న బంధువులు, స్నేహితులను సైతం పలకరించటానికి ఫోన్‌నే పెద్ద దిక్క అయింది. బంధువులు ఎవరైనా చనిపోయినా ఫోన్లోనే పరామర్శించాల్సి వస్తుంది. అంత్యక్రియలను సైతం కరోనా కారణంగా చివరి చూపు ఫోన్లోనే చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన పలువురు విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగ రిత్య ఉంటున్నారు. ఇప్పుడు కరోనా భయంతో ఎక్కడి వారు అక్కడే ఉంటున్నారు. ప్రతి రోజు ఫోన్ ద్వారా యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు.
మరోవైపు లాక్‌డౌన్ ఈనెలాఖరు వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఇప్పట్లో ప్రస్తుత పరిస్థితుల్లో మార్పులు అశించటం వృధా.


Post A Comment:
0 comments: